
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ సబ్సిడీ పథకం శనివారం నుంచి ప్రారంభమైంది. రాయితీ కావాలనుకునే వారు 7011311111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజీ పంపొచ్చునంటూ గత నెలలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు విద్యుత్ ఫీజు బకాయి లేని గృహ వినియోగదారులే రాయితీకి అర్హులు.
అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచితంగా, 400 యూనిట్ల వరకు వినియోగించుకునే వారికి 50% సబ్సిడీతో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ అందిస్తోంది. ఇందులో ఢిల్లీలోని మొత్తం 58 లక్షల గృహ విద్యుత్ వినియోగదారుల్లో 47 లక్షల మంది సబ్సిడీ పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment