న్యూఢిల్లీ: ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బాధితురాలి కుటుంబసభ్యులకు రూ.10లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు.
అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవాదిని నియమిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
ఢిల్లీలోని కంజవాలా ప్రాంతంలో జనవరి 1న ఓ యువతి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఐదుగురు యువకులు తాగిన మత్తులో కారు నడుపుతూ ఆమె స్కూటీని ఢీకొట్టారు. యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించుకుండా కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె చనిపోయింది. శరీర భాగాలు తెగిపోయాయి.
ఈ ఘటనకు సంబధించి ఐదుగురు నిందితులను పోలీసులు మరునాడే అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం కూడా జరిగిఉంటుందని మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. కారు ఈడ్చుకెళ్లడం వల్లే ఆమె మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..'
Comments
Please login to add a commentAdd a comment