delhi woman
-
ఈ నేల ఈ గాలి... పర్యావరణ గీతం
ఏయిర్ ఫోర్స్ అధికారి కూతురు అయిన బవ్రీన్ దేశంలోని వివిధప్రాంతాలలో చదువుకుంది. అలా ఎన్నో సంస్కృతులు, కళలు, ప్రకృతి అందాలతో పరిచయం అయింది. లండన్‌లోని వాయు కాలుష్యం గురించి వ్యాసం ఒకటి చదివింది బవ్రీన్. ‘దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితే కదా’ అని నిట్టూర్చింది. ‘ఇది లోకల్ ప్రాబ్లం కాదు. గ్లోబల్ ప్రాబ్లమ్’ అనుకుంది. వర్తమానం సంగతి ఎలా ఉన్నా పొగచూరిన భవిష్యత్ మసక మసకగా కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాపీరైటర్ ఉద్యోగాన్ని వదులుకొని ‘వారియర్ మామ్స్’కు శ్రీకారం చుట్టింది బవ్రీన్. ‘ వాయుకాలుష్యం అనేది చర్మం, జుట్టు, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహార ఉత్పత్తులలోని పోషక విలువలను నాశనం చేస్తుంది. అన్నిరకాలుగా హాని కలిగిస్తుంది’ అంటున్న బవ్రీన్ ‘వారియర్ మామ్స్’ ద్వారా పల్లె నుంచి పట్టణం వరకు ఎన్నోప్రాంతాలు తిరిగింది.క్షేత్రస్థాయిలో వాయుకాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తనలాగే ఆలోచించే మహిళలు తోడు కావడంతో ‘వారియర్ మామ్స్’కు బలం పెరిగింది. మొదట్లో వాయుకాలుష్యం ప్రమాదాల గురించి ప్రచారం మొదలుపెట్టినప్పుడు ‘ఈ విషయాలు మాకు ఎందుకు’ అన్నట్లుగా ముఖం పెట్టేవారు. ప్రమాద తీవ్రత గురించి తెలుసుకున్న తరువాత మాత్రం వారిలో మార్పు రావడం మొదలైంది.‘మీ పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించండి’ అనే మాట వారిని కదిలించి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చింది. ప్రపంచం ఎలా మారాల్సి వచ్చిందో చెప్పడానికి కోవిడ్ మహమ్మారి పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలోనే... ‘మరొక మహమ్మారిని నివారించడానికి మనం ఎందుకు మారకూడదు?’ అని ప్రశ్నిస్తోంది. ‘అభివృద్ధి’ గురించి మాట్లాడినప్పుడు ‘పర్యావరణ హితం’ గురించి కూడా మాట్లాడాలి అంటుంది బవ్రీన్.‘కొన్నిసార్లు దూకుడుగా ముందుకు వెళ్లాలి’ అనేది కొన్ని సందర్భాలలో బవ్రీన్ నోటినుంచే వినిపించే మాట. సమస్య గురించి అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, వారి స్పందనలో అలసత్వం కనిపించినప్పుడు, ‘నా కంపెనీకి మేలు జరిగితే చాలు పర్యావరణం ఏమైపోతే నాకెందుకు!’ అనుకునేవాళ్లను చూసినప్పుడు బవ్రీన్ దూకుడుగా ముందుకు వెళుతుంది, తాను ఆశించిన ఫలితం వచ్చే వరకు మడమ తిప్పకుండా పోరాడుతుంది. ‘మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటున్న బవ్రీన్ మాటలు ఎంతోమందిలో మార్పు తీసుకువచ్చాయి. ‘పదిమందిలో ఏడుగురు వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది వాతావరణ మార్పులపై తగిన కార్యాచరణ అవసరం అంటున్నారు. కానీ పదిమందిలో నలుగురు మాత్రమే కార్యాచరణలో భాగం అవుతున్నారు’ అంటున్న బవ్రీన్ ఆశ మాత్రం కోల్పోలేదు. ‘వారియర్ మామ్స్’ ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ‘ఏమీ చేయలేమా?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వినిపించే జవాబులు రెండు... ‘మనం మాత్రం ఏం చేయగలం!’ ‘కచ్చితంగా మనమే చేయగలం’‘మనం మాత్రమే చేయగలం’ అని దిల్లీకి చెందిన బవ్రీన్ కాంధరీ అనుకోవడం వల్లే‘వారియర్ మామ్స్’ పుట్టుక సాధ్యం అయింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా పదమూడు రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో పర్యావరణ హిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది బవ్రీన్. కాపీరైటర్ నుంచి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్‌గా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం... -
Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్.
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం. ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్‌కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు. కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్‌కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు. ముందు కుటుంబం ఢిల్లీలో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది. మొదటి అటెంప్ట్ టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని. తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్‌లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి. చట్ట ప్రకారం సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్కౌంటర్లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది. అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్‌ను కూడా క్లాసికల్‌గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే రియా పాటలు
పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్ రైటర్, సింగర్ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి... దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్–బాలీవుడ్ మ్యూజిక్‌ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్’ ట్రాక్ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్ లిరిక్స్ రాయడం అంటే రియకు ఇష్టం. క్లాసికల్ సింగింగ్‌లో డిప్లొమా చేసిన రియకు థియేటర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘పర్మిషన్’ తరువాత వచ్చిన ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’కు మంచి పేరు వచ్చింది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్ హ్యావ్ ది టైమ్. ఒక ఫెస్టివల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్ హ్యావ్ ది టైమ్. అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది. మనలో ఎంత టాలెంట్ ఉంటే మాత్రం? టైమ్ లేకపోతే అంతే! అందుకే టైమ్ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్ సాధించడానికి కారణం అయింది. ‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్ హ్యావ్ ది టైమ్’పై పాప్ బీట్ మాత్రమే కాదు బాలీవుడ్ మ్యూజిక్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్ వీడియోల షూట్ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ. ‘ప్రతి నెల ఒక సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్లు, మ్యూజిషియన్లతో పనిచేయాలని, లైవ్ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ. -
నవ్వుల పువ్వుల తోటమాలి
‘ధర్నా దుర్గ’ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దుర్గ ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయలేదు. సింగిల్ నినాదం కూడా చేయలేదు. అయితే ఆమె నవ్వులు మాత్రం ధర్నా చేయకపోయినా హల్చల్ చేస్తాయి. నాప్స్టాప్గా నవ్వేలా చేస్తాయి... ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేక పోయినా దుర్గ ఉండాల్సిందే. ఎందుకంటే దుర్గ ఉన్నచోట ‘హాహాహో’లతో కూడిన భారీ నవ్వుల వర్షం కురుస్తుంది. ఆ నవ్వుల వర్షంలో తడిసిపోవడానికి చుట్టాలు పక్కాలు అమిత ఉత్సాహం చూపుతారు. ఆ నవ్వుల బలంతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకుంది దిల్లీకి చెందిన ధర్నా దుర్గ. నిజజీవితంలోని సంఘటనల చుట్టూ హాస్యాన్ని అల్లుకునే ధర్నా దుర్గకు సామాజిక మాధ్యమాలలో భారీ అభిమాన గణం ఉంది. హీరోయిన్ల గొంతును అనుకరించడం తన ప్రత్యేకత. సారా అలీఖాన్ గొంతును అద్భుతంగా అనుకరిస్తుంది. సారా ఫేవరెట్ డైలాగ్ ‘నమస్తే దర్శకో’పై ఫన్నీగా వీడియో చేసింది దుర్గ. ఈ వీడియో చూసి సారా అలీఖాన్ ముచ్చటపడడమే కాదు, దుర్గను మెచ్చుకుంటూ వీడియోను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో, ఇంటికే పరిమితం కావాల్సిన అనివార్యత వల్ల చాలామందిలాగే దుర్గ కూడా బోర్‌గా ఫీలైంది. దాని నుంచి బయటపడడానికి సెలబ్రిటీలను అనుకరిస్తూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇవి తన స్నేహితులకు తెగ నచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది. ఇక అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తలపై ‘కామెడీ క్వీన్’ అనే కిరీటం వచ్చి చేరింది. ‘ఈ వీడియోలు ఏమిటో, లైక్‌లు ఏమిటో!’ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసేవారు దుర్గ తల్లిదండ్రులు. వారికి అన్నీ ఓపికగా చెప్పేది దుర్గ. తమ చుట్టాలు పక్కాలలో ‘ఫస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా తొలి గుర్తింపు తెచ్చుకుంది దుర్గ. నాటక రంగ నేపథ్యం ఉన్న దుర్గకు లోతైన పరిశీలన శక్తి ఉంది. అది తాను చేసే ఫన్నీ వీడియోలకు ఎంతో ఉపయోగపడుతుంది. రియాలిటీ షోలపై దుర్గ వేసే ఫన్నీ పంచ్‌లకు నవ్వు ఆపుకోవడం చానా కష్టం. ‘బిగ్ బాస్’లాంటి ప్రసిద్ధ రియాలిటీ షోల నుంచి క్యారెక్టర్లను అల్లుకొని ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. నృత్య నైపుణ్యం దుర్గ అదనపు బలం. కొరియోగ్రాఫర్లపై ఫన్నీ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘డ్యాన్సర్ ధర్నా దుర్గ’గా పేరు తెచ్చుకుంది. వేలాదిమందిని నవ్విస్తున్న ధర్నా దుర్గ... ‘నవ్విస్తే ఇంత పేరు వస్తుందని తెలియదు’ అంటోంది నవ్వుతూ! -
‘ఉద్యోగం విసుగొచ్చింది’.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతున్న యువతి!
ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్‌ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! అప్పటి నుంచి ఆమె తన ట్రిప్‌లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్‌లను షేర్ చేయడం, ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. I quit my job at LinkedIn. Last year, on this very date. When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time. When I left I was burnt out,had 250k followers on IG, worked alone. Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ — Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023 2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్ఇన్లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె.. అందులోనుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కాసేపటికే మరో బైక్‌లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చాక అప్పగించారు. #WATCH | A woman was found taking out petrol from a bike and setting it on fire in Jaitpur police station area of Delhi's South East District last night. She was later trying to put another bike on fire during which locals caught her and handed her over to police: Delhi Police… pic.twitter.com/EXqSZ1f8nQ — ANI (@ANI) May 12, 2023 అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. మహిళ బైక్‌కు నిప్పంటించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. అర్ధరాత్రి సమయంలో ఈమె ఇలా ఎందుకు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అత్తింటి వేధింపులకు యువ డాక్టర్ బలి.. కారు ఇస్తామన్నా.. -
Nikki Yadav: ప్రియుడు మోసగాడని తెలియక నిక్కీ..
క్రైమ్: శ్రద్ధా వాకర్ తరహాలో.. అదీ దేశరాజధానిలోనే వెలుగు చూసిన ‘ఫ్రిడ్జ్‌లో ప్రియురాలి శవం’ ఉదంతం డేటింగ్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారి తీసింది. ఏళ్ల తరబడి కలిసి ఉన్న ఆమెకు.. ప్రియుడు చేసిన నమ్మక ద్రోహం తెలిశాక నిలదీసింది. అయితే తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. వదిలించుకునేందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మంగళవారం ప్రియుడు సాహిల్ గెహ్లాట్‌కు చెందిన ఓ రెస్టారెంట్ ఫ్రిడ్జ్‌లో శవమై కనిపించింది నిక్కీ యాదవ్. ఛార్జింగ్ కేబుల్‌ను మెడకు బిగించి చంపి.. ఆపై ఆ శవాన్ని దగ్గర్లోనే ఉన్న తన కుటుంబానికి చెందిన ధాబాలోని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు సాహిల్. తన కూతురికి సాహిల్ మోసగాడు అని గుర్తించలేకపోయిందని, గుడ్డిగా ప్రేమించి ప్రాణం పొగొట్టుకుందని నిక్కీ తండ్రి విలపిస్తున్నాడు. సాహిల్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడాయన. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఫుటేజ్ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. निक्की यादवचं हत्येच्या काही तास आधीचं CCTV आलं समोर#NikkiYadav Murder Case CCTV#SahilGehlot #SahilGahlot #Delhi pic.twitter.com/d7hJJtYfuV — Shivraj Yadav | शिवराज यादव 🇮🇳🖊️ (@shiva_shivraj) February 15, 2023 మరోవైపు నిక్కీ యాదవ్ చివరిసారిగా కనిపించిన వీడియో ఒకటి పోలీసుల ద్వారా మీడియాకు రిలీజ్ అయ్యింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని తన ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ రోజు తేదీ ఫిబ్రవరి 9. ఆరోజే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాహిల్‌కి చాలారోజుల కిందటే.. మరో యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. ఆ విషయం నిక్కీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అతను. అయితే.. వివాహానికి ముందురోజు ఆమెకు ప్రియుడి చేస్తున్న మోసం తెలిసింది. దీంతో.. అతన్ని నిలదీసింది. మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియగానే.. నిక్కీ అతనితో గొడవకు దిగింది. ఇంట్లోకి వెళ్లిన నిక్కీ.. కాసేపటికే మళ్లీ బయటకు వచ్చింది. ఆపై సుమారు మూడు గంటలపాటు ఇద్దరూ కారులోనే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫోన్ ఛార్జింగ్కేబుల్ను ఆమె మెడకు బిగించి సాహిల్ హత్య చేశాడు. నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్. అయితే ఆమె మాత్రం ఢిల్లీలో ఉంటోంది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే నిక్కీ-సాహిల్ మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. నిక్కీ కనిపించకుండా పోయిందని పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో సాహిల్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. -
షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం
ఢిల్లీలోని దాబా వద్ద ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసిగా గుర్తించారు. దర్యాప్తులో దాబా యజమానిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు . విచారణలో అసలు విషయం తెలిసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దర్యాప్తులో..దాబా యజమాని గహ్లోత్ ఆ బాధిత మహిళ రిలేషన్షిప్లో ఉన్నారు. ఐతే గహ్లోత్ మరో మహిళను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు గహ్లోత్‌ని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం తలెత్తింది. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది సదరు మహిళ. దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ మహిళ రెండు, మూడు రోజుల క్రితమే హత్యకు గురైందని చెప్పారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! కంటతడి పెట్టిన స్టాలిన్) -
కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బాధితురాలి కుటుంబసభ్యులకు రూ.10లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవాదిని నియమిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీలోని కంజవాలా ప్రాంతంలో జనవరి 1న ఓ యువతి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఐదుగురు యువకులు తాగిన మత్తులో కారు నడుపుతూ ఆమె స్కూటీని ఢీకొట్టారు. యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించుకుండా కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె చనిపోయింది. శరీర భాగాలు తెగిపోయాయి. ఈ ఘటనకు సంబధించి ఐదుగురు నిందితులను పోలీసులు మరునాడే అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం కూడా జరిగిఉంటుందని మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. కారు ఈడ్చుకెళ్లడం వల్లే ఆమె మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్‌ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లి..
న్యూఢిల్లీ: ఆత్మహత్య చేసుకుందని భావించిన మహిళ ఊహించని విధంగా ప్రత్యక్షమైన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలో ట్రైని మేనేజర్‌గా పనిచేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ కార్యదర్శి కుమార్తె అనిల్ తలాన్ కోమల్(29) ఈనెల 5న ఢిల్లీ నుంచి అదృశ్యమయ్యారు. ఆమె కారును ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ బ్రిడ్జి వద్ద కనుగొన్నారు. కారులో సూసైడ్ నోట్ ఉండటంతో హిండన్ కాలువలోకి దూకి ఆమె ఆత్మహత్య చేసుకునివుండొచ్చని భావించారు. తన భర్త అభిషేక్, మెట్టినింటి వారి వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్ నోట్ పేర్కొన్నారు. కోమల్‌ను అత్తింటివారు వేధింపులకు గురిచేసిన మాట వాస్తమేనని ఆమె తండ్రి అనిల్ తలాన్ కూడా పోలీసులతో చెప్పారు. మూడు రోజుల పాటు హిండన్ నదిలో గాలింపు జరిపినా మృతదేహం దొరక్కపోవడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. నిఘా సమాచారంతో మలుపు అయితే కోమల్ బతికేవుందని ఇంటెలిజెన్స్ విభాగం కనిపెట్టడంతో పోలీసులతో సహా ఆమె కుటుంబీకులు అవాక్కయ్యారు. రాజస్తాన్ జైపూర్‌లోని కొంత మందిని ఆమె కాంటాక్ట్ అయినట్టు నిఘా విభాగం సమాచారం ఆధారంగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు. మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లినట్టు సమాచారం దొరికింది. దీంతో పోలీసులు ముంబైకి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆమె బెంగళూరులో ఉన్నట్టు గుర్తించారు. ఘజియాబాద్ పోలీసులు ఆమెను తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ‘నా భర్తను అరెస్ట్ చేశారా, అతడిని జైలుకు పంపారా?’ పోలీసులను చూసిన వెంటనే ఆమె అడిగిన మొదటి ప్రశ్న ఇది. తనను వేధింపులకు గురిచేసిన భర్తను జైలుకు పంపాలన్న ఉద్దేశంతో కోమల్ ఇదంతా చేశారని ఘజియాబాద్ నగర ఎస్పీ శ్లోక్ కుమార్ తెలిపారు. -
‘60 శాతం స్కోర్ చేశావ్.. చాలా గర్వంగా ఉంది’
న్యూఢిల్లీ : పిల్లలు పరీక్షల్లో నూటికి తొంభై శాతం మార్కులు సాధించినా కొందరు తల్లిదండ్రులు సంతృప్తి పడరు. వేలకువేలు పోసి చదివిస్తే.. ఈ మార్కులేనా అంటూ విమర్శలు. ఇలాంటివారిని చూస్తే.. అత్తెసరు మార్కులతో పాసయిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చదువనేది రూపాయలు పోసి కొనే వస్తువు కాదని వీరంతా ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. మన చుట్టూ దాదాపు అందరూ ఇలాంటి వారే. కాబట్టి కాసేపు వీరి విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫేస్బుక్లో వైరలవుతోన్న ఓ తల్లి మెసేజ్ గురించి మాట్లాడుకుందాం. రెండు రోజుల క్రితం సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వచ్చాయి కదా. ఈ ఫలితాల్లో తన కుమారుడు 60 శాతం మార్కులతో పాసయ్యాడంటూ ఓ తల్లి చాలా గర్వంగా ఫేస్బుక్ వేదికగా ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు.. ఢిల్లీకి చెందిన వందన సూఫియా కతోచి అనే మహిళ తన ఫేస్బుక్లో చేసిన ఈ పోస్ట్ ఎందరినో ఆకర్షించడమే కాక ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఈ మెసేజ్‌లో ‘10వ తరగతి బోర్టు ఎగ్జామ్స్‌లో 60 శాతం మార్కులతో పాసయిన నా కొడుకును చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చదివింది నిజమే. నా కొడుకు సాధించింది 90 శాతం కాదు.. 60 శాతం మార్కులు మాత్రమే. తొంభై శాతం సాధించినా.. అరవై శాతం సాధించినా నా సంతోషంలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే పరీక్షల ముందు కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో మా అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు. తప్పకుండా ఫెయిల్ అవుతాననే భావించాడు. దాంతో చివరి నెలన్నర చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. ఫలితం సాధించాడు’ అని తెలిపింది. అంతేకాక ‘ఈ మహా సముద్రంలో నీ లక్ష్యాన్ని నువ్వే ఎంచుకో. దాంతో పాటు నీ మంచితనాన్ని, తెలివిని, ఉత్సుకతను, హాస్య చతురతను కూడా సజీవంగా ఉంచుకో’ అంటూ కొడుకు సూచించింది వందన. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ మెసేజ్ ఇప్పటికే కొన్ని వేల లైక్‌లు, షేర్స్‌తో పాటు కామెంట్స్ కూడా అందుకుంది. ఓ తల్లిగా ఆమె కొడుకును అర్థం చేసుకున్న తీరును చాలా మంద్రి తల్లిదండ్రులు, విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. ‘మీరేవరో నాకు తెలీదు. కానీ మిమ్మల్ని చూస్తే చాలా చాలా గర్వంగా ఉందం’టూ కొందరు కామెంట్ చేయగా.. ‘మార్కుల గురించి వదిలేద్దాం. మన పిల్లల కష్టాన్ని గుర్తిద్దాం.. వారు చెప్పేది విని.. అండగా నిలుద్దాం’ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. -
ఢిల్లీ ఆంటీ క్షమాపణలు చెప్పింది!
న్యూఢిల్లీ : ‘హలో గాయిస్.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్.. షార్ట్ డ్రెస్సెస్ ధరిస్తున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకున్న వీరిని అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయండి’ అంటూ హల్చల్ చేసిన ఢీల్లి ఆంటీ ఎట్టకేలకు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరింది. తన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, చాలా తప్పుగా మాట్లాడనని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పేర్కొంది. అనంతరం ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలన్నిటినీ తొలగించింది. ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ.. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పట్టేలా చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలోహల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే ఆ యువతులు కోరినా.. సదరు మహిళ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరింది. చదవండి: అవి ధరించిన వారిని రేప్ చేయండి: ఢిల్లీ ఆంటీ -
పొట్టి దుస్తులు ధరించిన యువతులపై షాకింగ్ వ్యాఖ్యలు
-
అవి ధరించిన వారిని రేప్ చేయండి: ఢిల్లీ ఆంటీ
న్యూఢిల్లీ: నువ్వు రికార్డు చేస్తున్నావా? హాలో గాయిస్.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్ షార్ట్ డ్రెస్సెస్ ధరిస్తున్నారు.. ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ పేర్కొన్న వ్యాఖ్యలివి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నేను, నా స్నేహితులు ఒక రెస్టారెంట్లో స్నాక్స్ తింటుండగా.. ఓ మహిళ నా వద్దకు వచ్చి.. పొట్టిగా ఉన్న దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుపడు అంటూ పేర్కొంది. నేను, నా స్నేహితులు ఆమెతో వాదనకు దిగాం. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలను అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయాలంటూ రెస్టారెంట్లో ఉన్న పురుషులకు ఆమె చెప్పింది. దీంతో షాక్ తిన్న మేం సమీపంలో ఉన షాపింగ్‌మాల్ వరకు ఆమెను వెంటాడుతూ.. ఆమె వికృత మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ.. వీడియో తీశాం’ అని ఓ యువతి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే యువతులు కోరినా.. సదరు మధ్య వయస్కురాలైన మహిళ పెద్దగా పట్టించుకోలేదు. అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడే హక్కు లేదని, వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా ప్రశ్నించడానికి నువ్వు ఎవరని ఓ మహిళ ఆమెతో వాదనకు దిగారు. పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల వరకు దేశంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అలాంటి సమయంలో ఇలా దుస్తులు, వేషాధారణ గురించిన నీచమైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివారిని పురుషులు రేప్ చేయాలని పేర్కొనడం దారుణమని ఆ మహిళ మండిపడ్డారు. అయినా ఏ మాత్రం వెనుకకు తగ్గని ఆమె.. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నారని వీడియో చివరలో పేర్కొనడం గమనార్హం. పది నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో తీసిన యువతి వివరాలు పెద్దగా తెలియరాలేదు. -
41 లక్షలే కాదు, 50 కోట్లు గోవింద
న్యూఢిల్లీ : ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయిన వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్‌కు ఇటీవల భారీగా డిమాండ్ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గల ప్రధాన కారణం పలు దేశాల్లో దీనిపై నియంత్రణలు తీసుకురావడం, చట్టబద్ధ కరెన్సీగా దీనికి గుర్తించకపోవడం, హ్యాకర్ల నుంచి ఈ కరెన్సీకి భారీగా ముప్పు ఉండటం. ఇప్పటికే పలు దేశాల ప్రభుత్వాలు, రెగ్యులేటరీ సంస్థలు కూడా ఈ కరెన్సీల విషయంలో ప్రజలు మోసం పోయే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన వాలెట్ నుంచి దాదాపు రూ.41 లక్షల విలువైన బిట్కాయిన్లను కోల్పోయినట్టు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన అకౌంట్‌ను హ్యాక్ చేయడంతో, ఈ నగదును కోల్పోయినట్టు ఆమె తెలిపింది. అయితే తాను మాత్రమే కాక, మరికొంత మంది బాధితులు కూడా దాదాపు రూ.50 కోట్లను కోల్పోతున్నట్టు ఆ మహిళ పేర్కొంది. ఈ మేరకు దీనిపై మయూర్ విహార్ అనే మహిళ, ఆర్థిక నేరాల వింగ్ వద్ద తన ఫిర్యాదును నమోదుచేసింది. తొలుత రూ.6.5 లక్షల 6.5 బిట్కాయిన్లను కోల్పోయానని, అనంతరం రూ.35 లక్షల పోగొట్టుకున్నట్టు పేర్కొంది. దీనిపై సైబర్ సెల్ విచారణ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తనకు బిట్కాయిన్లను పరిచయం చేయడంతో, మొదట తాను 0.4 బిట్కాయిన్లను 2017 ఫిబ్రవరిలో ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానని ఆ మహిళ చెప్పింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల కోసం ఆ కంపెనీ ఫైవ్-స్టార్ హోటల్స్‌లో సెమినార్లను నిర్వహించేదని పేర్కొంది. తన మ్యూచువల్ ఫండ్ పాలసీ కాలం గడువు తీరి పోయిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా బిట్‌కాయిన్‌లోనే పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తన సేవింగ్స్ అన్నింటిన్నీ ఆ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసినట్టు చెప్పింది. నెలవారీ 12 శాతం రిటర్నులను అందిస్తానని కంపెనీ వాగ్ధానం చేసినట్టు బాధితురాలు పేర్కొంది. 2017 ఆగస్టు వరకు మాత్రమే తనకు రిటర్నులు వచ్చాయని, కానీ అనంతరం నుంచి రిటర్నులు పొందలేదని చెప్పింది. ఎఫ్ఎక్స్ఆప్షన్స్.కామ్, క్రిప్టోమైనర్స్.కామ్, కాయిన్స్పేస్ప్రాఫిట్.కామ్, 24ఆప్షన్స్.కామ్ పేర్లతో మోసగాడు వెబ్సైట్లను నిర్వహిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. కాగ, బిట్‌కాయిన్, ఇతర వర్చ్యువల్ కరెన్సీలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా తన బడ్జెట్ ప్రసంగంలో హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. బిట్‌కాయిన్, ఇతర వర్చ్యువల్ కరెన్సీల వాడకాన్ని ప్రభుత్వం నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ కరెన్సీలను చట్టబద్ధంగా గుర్తించడం లేదన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వీటిపై ఆందోళనలు వ్యక్తం చేసింది. టెక్ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్‌దారులు, జువెల్లర్స్ భారీగా ఈ బిట్‌కాయిన్, వర్చ్యువల్ కరెన్సీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. -
పండుగనాడు భర్త ఫోన్ ఎత్తలేదని..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగనాడు తన ఎన్నారై భర్త ఫోన్ ఎత్తలేదని మనోవేదనతో ఓ భార్య ప్రాణత్యాగం చేసుకొంది. ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల మహిళకు ఓ ఎన్నారైకు మూడేళ్ల కిందట వివాహం అయింది. అతడు 15 రోజుల కిందటే అమెరికా వెళ్లిపోయాడు. అయితే, కార్వా చౌత్ పండుగ (నిండు పౌర్ణమినాడు భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూడటం)నాడు ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. అయితే, అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో కూడా ఉంది. దీంతో పలుమార్లు ఫోన్ చేసిన ఆమె భర్త ఫోన్ ఎత్తలేదని కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేపిస్టుల నుంచి తప్పించుకోడానికి..
దేశ రాజధానిలో మరో ఘోరం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ప్రణవ్ నగర్ ప్రాంతంలో తనపై అత్యాచారం చేస్తున్న ఐదుగురు మగాళ్ల బారినుంచి తప్పించుకోడానికి ఓ మహిళ అపార్టుమెంటు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఆ ఐదుగురు వ్యక్తులు ఆమెను నగ్నంగా చేసి.. ఆపై ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అక్కడకు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజిలో ఈ విషయం రికార్డు కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది. తనకు సాయం చేయాల్సిందిగా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరినీ ఆమె వేడుకున్నా, అటువైపు వెళ్లేవాళ్లంతా ఆమెవైపు చూస్తూ నిల్చుండిపోయారు తప్ప ఒక్కరు కూడా ఆదుకోలేదు. చాలా కార్లు అటునుంచి వెళ్లాయి గానీ ఒక్కటి కూడా ఆగలేదు. చివరకు ఓ ఆటో డ్రైవర్ ఆమెను కాపాడేందుకు ముందుకొచ్చాడు. -
తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..!
కర్నాల్: ఓ మహిళ తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన ప్రీతి భరద్వాజ్(36) కారు(మారుతి స్విఫ్ట్)లో బుధవారం రాత్రి హర్యానాలోని కర్నాల్ సమీపంలోని జాతీయరహదారిపై వెళ్తోంది. రోడ్డు పక్కన వెళ్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి ప్రీతి కారు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారని, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు పోలీసులు సమాచారం అందుకున్నారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఢిల్లీ మహిళ కారును కొంతమేరకు ధ్వంసం చేశారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్న కొందరు వ్యక్తులను ఢిల్లీ మహిళ కారుతో ఢీకొట్టిందని, ఇద్దరు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారని స్టేషన్ ఇన్చార్జ్ రాజ్బీర్ సింగ్ యాదవ్ చెప్పారు. ప్రమాదం తర్వాత కారు ఆపకుండా ఆమె అలాగె వెళ్తుండగా స్థానికులు ఛేజ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఆ సమయంలో కారులో ఆమె ఒక్కరే ఉన్నారని, మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు. మృతులు రాజ్‌కుమార్, బన్సీలాల్ అని పోలీసులు గుర్తించారు. ప్రీతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని కర్నాల్ చేరుకున్న ప్రీతి పేరేంట్స్ ఈ ఘటనపై షాక్‌కు గురయ్యారు. ఢిల్లీ మహిళపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో మహిళను వెంటాడి..
న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహించిన ఓ మహిళను దుండగులు వేటాడి, ఆమెపై కాల్పులు జరిపారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దారి మధ్యలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళ ఎదురుతిరిగి ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిన అపరిచితులు కాసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకుని స్కార్పియోను వెంబడించారు. ఐఫ్కో చౌక్ వద్ద దుండగులు స్కార్పియో అద్దాలను బేస్ బాల్ బ్యాట్లతో పగలగొట్టారు. లోపల ఉన్న సిద్ధాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపి పారిపోయారు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన సిద్ధాంత్, దేవిశ్రీ గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.