ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్‌ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్‌ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది!
అప్పటి నుంచి ఆమె తన ట్రిప్‌లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్‌లను షేర్ చేయడం, ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది.
I quit my job at LinkedIn.
— Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023
Last year, on this very date.
When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time.
When I left I was burnt out,had 250k followers on IG, worked alone.
Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ
2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్‌ఇన్‌లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment