ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యువతి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్‌కు దీపిందర్ ఫిదా అయ్యారు. నెటిజన్లు సైతం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
జొమాటో! నిన్న మొన్నటిదాకా అదొక జస్ట్ చిన్నకంపెనీ. మొబైల్ యాప్‌తో లక్షలాది మంది ఆకలి తీరుస్తుంది. హోటళ్లకు, కస్టమర్లకు వారధిగా మారి వేడి వేడి ఫుడ్‌ను క్షణాల్లో కస్టమర్లకు అందిస్తుంది. కట్ చేస్తే స్టార్టప్ నుంచి అతి తక్కువ కాలంలో లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు అదే కంపెనీలో తమిళనాడు సత్యబామ యూనివర్సిటీ సీఎస్‌సీ ఫైనల్ ఇయర్ విద్యార్ధి దీక్షితా బసు ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంది.
వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా 14 పేజీల ఇంటర్న్‌షిప్ ప్రపోజల్‌ను తయారు చేసి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్, జొమాటో డిజైన్ లీడ్ విజయ్ వర్మ, ఫుడ్ డెలివరీ సీఈవో రాహుల్ గంజూని ట్యాగ్ చేసింది. అంతే ఆమె ప్రపోజల్‌కు జొమాటో యాజమాన్యం స్పందించింది.ఇంటర్న్‌షిప్ చేసేందుకు అంగీకరించింది. అయితే ఇంతకీ యువతి ఇంటర్న్షిప్ ప్రపోజల్‌కు జొమాటో గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి ఆమె ఏం చేసిందో తెలుసా? క్రియేటివిటీని జోడించింది. మూస ధోరణిలో కాకుండా కొత్తగా, కాస్త భిన్నంగా ఆలోచించింది.
జొమాటో ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలని అనుకున్న దీక్షితా బసు జొమాటో కస్టమర్లకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేలా కొన్ని సలహాలు, అదే విధంగా యాప్‌లో కొన్ని లోపాల్ని ఎత్తి చూపిస్తూ 14పేజీల ఇంటర్నషిప్ డ్రాఫ్ట్‌ను తయారు చేసింది.ఆ డ్రాఫ్ట్‌కు సుజనాత్మకతను జోడించి చిన్న కార్టూన్ బొమ్మతో ఇంట్రడ్యూజ్ చేస్తూ స్లైడర్‌తో కట్టిపడేసింది. ఆ స్లైడర్‌కు వాలంటైన్స్‌డే ఇంటర్న్‌షిప్ ప్రపోజల్ పేరు పెట్టి లింక్డిన్‌లో పోస్ట్ చేసి జొమాటో బాస్‌కు ట్యాగ్ చేసింది.
అంతేనా "జొమాటో జింగ్" అనే కొత్త కాన్సెప్ట్ 15సెకన్ల వీడియోలో జొమాటోలో ఆర్డర్ పెట్టే కస్టమర్లకు తాను తెచ్చిన కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన వాలెంటైన్ ప్రపోజల్ జొమాటో యాజమాన్యాన్ని కట్టిపడేసింది. నెటిజన్లు సైతం ఆ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ పోస్ట్‌ను 16వేలకు పైగా లైకులు, 800 కామెంట్ల వర్షం కురిపించారు.
దీక్షితా బసు ఇన్నోవేటీవ్ థాట్‌కు జొమాటో సీఈఓ గంజూ స్పదించారు. దీక్షితా బసు ప్రయత్నాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జొమాటో యాజన్యం ఆమెతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు.
ఈ పోస్ట్‌పై విజయ్ వర్మ కూడా ‘గ్రేట్ వర్క్’ అంటూ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment