LinkedIn services
-
జొమాటో బాస్‌కు యువతి వాలంటైన్స్ ప్రపోజల్!! నెటిజన్లు ఫిదా..కామెంట్ల వరద!
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యువతి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్‌కు దీపిందర్ ఫిదా అయ్యారు. నెటిజన్లు సైతం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. జొమాటో! నిన్న మొన్నటిదాకా అదొక జస్ట్ చిన్నకంపెనీ. మొబైల్ యాప్‌తో లక్షలాది మంది ఆకలి తీరుస్తుంది. హోటళ్లకు, కస్టమర్లకు వారధిగా మారి వేడి వేడి ఫుడ్‌ను క్షణాల్లో కస్టమర్లకు అందిస్తుంది. కట్ చేస్తే స్టార్టప్ నుంచి అతి తక్కువ కాలంలో లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు అదే కంపెనీలో తమిళనాడు సత్యబామ యూనివర్సిటీ సీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్ధి దీక్షితా బసు ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా 14 పేజీల ఇంటర్న్‌షిప్ ప్రపోజల్‌ను తయారు చేసి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్, జొమాటో డిజైన్ లీడ్ విజయ్ వర్మ, ఫుడ్ డెలివరీ సీఈవో రాహుల్ గంజూని ట్యాగ్ చేసింది. అంతే ఆమె ప్రపోజల్‌కు జొమాటో యాజమాన్యం స్పందించింది.ఇంటర్న్‌షిప్ చేసేందుకు అంగీకరించింది. అయితే ఇంతకీ యువతి ఇంటర్న్‌షిప్ ప్రపోజల్‌కు జొమాటో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ఆమె ఏం చేసిందో తెలుసా? క్రియేటివిటీని జోడించింది. మూస ధోరణిలో కాకుండా కొత్తగా, కాస్త భిన్నంగా ఆలోచించింది. జొమాటో ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్‌షిప్ చేయాలని అనుకున్న దీక్షితా బసు జొమాటో కస్టమర్లకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేలా కొన్ని సలహాలు, అదే విధంగా యాప్‌లో కొన్ని లోపాల్ని ఎత్తి చూపిస్తూ 14పేజీల ఇంటర్నషిప్ డ్రాఫ్ట్‌ను తయారు చేసింది.ఆ డ్రాఫ్ట్‌కు సుజనాత్మకతను జోడించి చిన్న కార్టూన్ బొమ్మతో ఇంట్రడ్యూజ్ చేస్తూ స్లైడర్‌తో కట్టిపడేసింది. ఆ స్లైడర్‌కు వాలంటైన్స్‌డే ఇంటర్న్‌షిప్ ప్రపోజల్ పేరు పెట్టి లింక్డిన్లో పోస్ట్ చేసి జొమాటో బాస్‌కు ట్యాగ్ చేసింది. అంతేనా "జొమాటో జింగ్" అనే కొత్త కాన్సెప్ట్ 15సెకన్ల వీడియోలో జొమాటోలో ఆర్డర్ పెట్టే కస్టమర్లకు తాను తెచ్చిన కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన వాలెంటైన్ ప్రపోజల్ జొమాటో యాజమాన్యాన్ని కట్టిపడేసింది. నెటిజన్లు సైతం ఆ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ పోస్ట్‌ను 16వేలకు పైగా లైకులు, 800 కామెంట్ల వర్షం కురిపించారు. దీక్షితా బసు ఇన్నోవేటీవ్ థాట్‌కు జొమాటో సీఈఓ గంజూ స్పదించారు. దీక్షితా బసు ప్రయత్నాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జొమాటో యాజన్యం ఆమెతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. ఈ పోస్ట్‌పై విజయ్ వర్మ కూడా ‘గ్రేట్ వర్క్’ అంటూ స్పందించారు. -
చైనాకు మరో భారీషాక్, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు
హాంకాంగ్: చైనాలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో విదేశీ టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా యాహూ కూడా చైనా మార్కెట్ నుంచి వైదొలిగింది. చైనాలో కార్యకలాపాలు కొనసాగించలేని విధంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమని పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే యాహూకి సంబంధించిన చాలా మటుకు సర్వీసులను చైనా నిలిపివేసింది. దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ కఠినతరమైన ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు సవాలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చాన్నాళ్ల క్రితమే చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ సైతం తమ చైనా సైట్‌ను మూసివేస్తున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. చదవండి: భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా? -
టెక్ దిగ్గజాలకు రష్యా సీరియస్ ఆదేశాలు
లింక్డ్ఇన్ సర్వీసులను వెంటనే తొలగించాలంటూ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్‌కు రష్యా గట్టి ఆదేశాలు జారీచేసింది. రష్యాలో గూగుల్, ఆపిల్ ఆన్లైన్ స్టోర్లలో లింక్డ్ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదంటూ హెచ్చరించింది. దేశం సరిహద్దు లోపల గల పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం తమ స్థానిక చట్టాలకు విరుద్దమని, ఈ విషయంలో లింక్డ్ఇన్ తమ చట్టాలను త్యజిస్తోందని రష్యా ఆరోపించింది. తాజాగా రష్యన్ కోర్టు సైతం మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్ఇన్ సర్వీసులను బ్లాక్ చేసింది. దేశ డేటా రక్షణ నిబంధనలను లింక్డ్ఇన్ సర్వీసు ఉల్లంఘిస్తుందనే నెపంతో వాటిని రద్దు చేసింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం నెల క్రితమే లింక్డ్ఇన్ యాప్‌ను రష్యాలో తొలగించాలంటూ ఆదేశాలు వచ్చినట్టు ఆపిల్ ధృవీకరించింది. అయితే మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. లింక్డ్ఇన్ను రష్యాలో తొలగించిందో లేదో కూడా వెల్లడించడం లేదు. తమ సర్వీసులను బ్లాక్ చేస్తూ రష్యన్ రెగ్యులేటర్లు తీసుకున్న నిర్ణయం కంపెనీని ఎంతో నిరాశపరిచిందని లింక్డ్ఇన్ పేర్కొంటోంది. కంపెనీలు లింక్డ్ఇన్ సర్వీసులను వాడితే, వ్యాపారాల్లో వృద్ధి సాధించవచ్చని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. రష్యాలో లింక్డ్ఇన్ సర్వీస్‌లకు లక్షల మంది యూజర్లున్నారు. ఈ వారం మొదట్లో చైనీస్ అథారిటీల అభ్యర్థన మేరకు ఆపిల్ న్యూయార్క్ టైమ్స్ యాప్‌నూ తొలగించింది. దేశ రక్షణకు డిజిటల్ సైట్స్ హాని కలిస్తున్నాయనే నెపంతో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ సైట్లను చైనా బ్యాన్ చేసింది.