టెక్ దిగ్గజాలకు రష్యా సీరియస్ ఆదేశాలు
టెక్ దిగ్గజాలకు రష్యా సీరియస్ ఆదేశాలు
Published Mon, Jan 9 2017 9:39 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
లింక్డ్ఇన్ సర్వీసులను వెంటనే తొలగించాలంటూ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్కు రష్యా గట్టి ఆదేశాలు జారీచేసింది. రష్యాలో గూగుల్, ఆపిల్ ఆన్లైన్ స్టోర్లలో లింక్డ్ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదంటూ హెచ్చరించింది. దేశం సరిహద్దు లోపల గల పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం తమ స్థానిక చట్టాలకు విరుద్దమని, ఈ విషయంలో లింక్డ్ఇన్ తమ చట్టాలను త్యజిస్తోందని రష్యా ఆరోపించింది. తాజాగా రష్యన్ కోర్టు సైతం మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్ఇన్ సర్వీసులను బ్లాక్ చేసింది. దేశ డేటా రక్షణ నిబంధనలను లింక్డ్ఇన్ సర్వీసు ఉల్లంఘిస్తుందనే నెపంతో వాటిని రద్దు చేసింది.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం నెల క్రితమే లింక్డ్ఇన్ యాప్ను రష్యాలో తొలగించాలంటూ ఆదేశాలు వచ్చినట్టు ఆపిల్ ధృవీకరించింది. అయితే మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. లింక్డ్ఇన్ను రష్యాలో తొలగించిందో లేదో కూడా వెల్లడించడం లేదు. తమ సర్వీసులను బ్లాక్ చేస్తూ రష్యన్ రెగ్యులేటర్లు తీసుకున్న నిర్ణయం కంపెనీని ఎంతో నిరాశపరిచిందని లింక్డ్ఇన్ పేర్కొంటోంది. కంపెనీలు లింక్డ్ఇన్ సర్వీసులను వాడితే, వ్యాపారాల్లో వృద్ధి సాధించవచ్చని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. రష్యాలో లింక్డ్ఇన్ సర్వీస్లకు లక్షల మంది యూజర్లున్నారు. ఈ వారం మొదట్లో చైనీస్ అథారిటీల అభ్యర్థన మేరకు ఆపిల్ న్యూయార్క్ టైమ్స్ యాప్నూ తొలగించింది. దేశ రక్షణకు డిజిటల్ సైట్స్ హాని కలిస్తున్నాయనే నెపంతో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ సైట్లను చైనా బ్యాన్ చేసింది.
Advertisement
Advertisement