travel the world
-
‘ఉద్యోగం విసుగొచ్చింది’.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతున్న యువతి!
ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్‌ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! అప్పటి నుంచి ఆమె తన ట్రిప్‌లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్‌లను షేర్ చేయడం, ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. I quit my job at LinkedIn. Last year, on this very date. When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time. When I left I was burnt out,had 250k followers on IG, worked alone. Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ — Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023 2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్ఇన్లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
సగం భూమిని చుట్టేశారు!
దేశం కోసం సైన్యంలో పనిచేశారు... ఆ సేవల నుంచి విరామం తీసుకొని విదేశం వెళ్లారు. అక్కడి స్థిరనివాసి అయ్యారు. ఇక శేష జీవితాన్ని గడిపేయడమే తరువాయి అనుకొంటున్న సమయంలో ఆయన ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. 70 యేళ్ల వయసు దాటాకా సగం భూమిని చుట్టేసిన ఘనత ప్రవాసాంధ్రులు మాధవపెద్ది శివరామ్ గారిది... మిలటరీ టు అమెరికా... 1944లో కృష్జా జిల్లా కంకిపాడు సమీపంలోని పామర్రులో జన్మించాను. తెనాలిలో విద్యాభ్యాసం ముగించాను. 1965లో డిగ్రీ పూర్తి చేశాను. 1966లో ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్‌గా చేశాను. 1972లో కెప్టన్‌గా పనిచేసి రాజీనామా చేశాను. 1972-88 మధ్య హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత కొంత కాలానికి అమెరికా వెళ్లాను. అక్కడ వివిధ రకాల పెద్ద ఉద్యోగాలు చేశాను. 1988లో గ్రీన్‌కార్డు వచ్చింది. 2007లో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. భూమి చుట్టూ తిరగాలని... గుండ్రంగా ఉన్న భూమి చుట్టూ తిరగాలని, కాశీలో తొమ్మిది రాత్రులు నిద్రించాలని కోరికలు ఉండేవి. 70 ఏళ్ల వయస్సులో ఇప్పుడు అవి సాధ్యమా అంటారు కొందరు. కానీ పట్టుదల.. కోరిక.. తపన.. ఉంటే చాలు దేనినైనా సాధించవచ్చు. ఆకాశ మార్గం సగభాగం భూమి చుట్టూ ప్రయాణించాను. కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేశాను. విహార యాత్రలతో విజ్ఞానం.. ఎంత ఎక్కువగా విహారయాత్రలు చేస్తే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. 70 సంవత్సరాల వయస్సులో కూడా భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నా. తుది శ్వాస వరకు ఎన్ని వీలైతే అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాను. - కోన సుధాకర్ రెడ్డి