
ఢిల్లీలోని దాబా వద్ద ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసిగా గుర్తించారు. దర్యాప్తులో దాబా యజమానిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు . విచారణలో అసలు విషయం తెలిసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
దర్యాప్తులో..దాబా యజమాని గహ్లోత్ ఆ బాధిత మహిళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఐతే గహ్లోత్ మరో మహిళను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు గహ్లోత్‌ని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం తలెత్తింది. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది సదరు మహిళ.
దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ మహిళ రెండు, మూడు రోజుల క్రితమే హత్యకు గురైందని చెప్పారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
(చదవండి: పార్లమెంట్‌లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! కంటతడి పెట్టిన స్టాలిన్)
Comments
Please login to add a commentAdd a comment