Freezer Box
-
‘గాందీ’లో అందుబాటులో ఫ్రీజర్స్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఫ్రీజర్‌బాక్సులు అందుబాటులో లేవన్న సమస్యే ఉత్పన్నం కాదని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున సాంకేతిక సమస్యలు కూడా తలెత్తవని ప్రస్తుతం ఆస్పత్రిలో 62 ఫ్రీజర్ బాక్సులున్నాయని ఆస్పత్రి సూపరింటిండెంట్ హైకోర్టుకు అఫిడవిట్ సమరి్పంచారు. గాంధీ ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ఈ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...‘గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 62 ఫ్రీజర్ బాక్సులున్నాయి. రోజుకు 15 నుంచి 20 మృతదేహాలు ఆస్పత్రికి వస్తాయి. ఇందులో 3 నుంచి 4 గుర్తుతెలియనివి ఉంటాయి. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత గుర్తించిన మృతదేహాలను బంధువులకు అందజేస్తారు. గుర్తు తెలియని వాటిని 72 గంటల పాటు ఫ్రీజర్‌లో భద్రపరిచి ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించి.. మున్సిపాలిటీ అధికారులకు అందజేస్తారు. వారు నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనూ అవసరమైతే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పలు కారణాల రీత్యా వ్యక్తి మృతిచెందిన రోజే పోస్టుమార్టం సాధ్యం కాదు. 60 బాక్సులకు 25 మాత్రమే పని చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనం అవాస్తవం’అని ఆస్పత్రి సూపరింటిండెంట్ ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటిండెంట్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఫ్రీజర్స్ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. -
షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం
ఢిల్లీలోని దాబా వద్ద ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసిగా గుర్తించారు. దర్యాప్తులో దాబా యజమానిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు . విచారణలో అసలు విషయం తెలిసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దర్యాప్తులో..దాబా యజమాని గహ్లోత్ ఆ బాధిత మహిళ రిలేషన్షిప్లో ఉన్నారు. ఐతే గహ్లోత్ మరో మహిళను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు గహ్లోత్‌ని నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం తలెత్తింది. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది సదరు మహిళ. దీంతో కోపోద్రిక్తుడైన గహ్లోత్ ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దాబాలోని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ మహిళ రెండు, మూడు రోజుల క్రితమే హత్యకు గురైందని చెప్పారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: పార్లమెంట్లో ఒక ప్రధాని ఇలా అంగీకరించడం ప్రపథమం! కంటతడి పెట్టిన స్టాలిన్) -
రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా..
యూఎస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయినా.. బయటకు పొక్కనీకుండా కూతురు అత్యంత రహస్యంగా ఉంచింది. దీంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో ఇల్లినాయిస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ తన 96 ఏళ్ల తల్లి రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. అయితే ఆ విషయం బయటకు పొక్కనీయకుండా అత్యంత జాగ్రత్తపడింది. ఆమె ఇల్లినాయిస్లోని రెండు అంతస్తుల అపార్ట్మెంట్ భవనం సెల్లార్‌లోని డీప్ ప్రీజ్‌లో ఆమె తల్లి మృతదేహాన్ని కనుగోన్నారు చికాగో పోలీసులు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసి బ్రాచర్‌ని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆమె తల్లి పేరుతో తప్పుడు ఐడీని కలిగి ఉన్నట్లు కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మైఖేల్ పెకారా చెప్పారు. అంతేగాదు బ్రాచర్ తన తల్లి చనిపోవడానికి రెండు సంవత్సరాల క్రితమే డీప్ ఫ్రీజర్‌ని కోనుగోలు చేసినట్లు ఉన్న రసీదును కూడా ఆమె నివాసం వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అసలు ఎందుకలా ఆమె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియకుండా దాచి ఉంచిందన్న విషయంపై విచారించడం ప్రారంభించారు పోలీసులు. ఒకవేళ తన తల్లి మరణం దాచడం ద్వారా ఎవా బ్రాచర్ పొందే సామాజిక భద్రతా ప్రయోజనం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బ్రాచర్ కూతురు సబ్రినా వాట్సన్ తన తల్లికి ఎవరీ పట్ల ప్రేమ ఉండదని, ఆఖిరికీ తనమీద కూడా ఉండదంటూ కన్నీటి పర్యతమయ్యింది. కనీసం ఆమెకు మానవత్వం కూడా లేదంటూ.. అమ్మమ్మ మిచాల్స్కీ తలుచుకుంటూ విలపించింది. (చదవండి: ఓరి దేవుడా! అది బస్సా! ఇంకేదైననా? ఆ స్థితిలో కూడా ఏం రేంజ్లో వెళ్తోంది) -
మనిషి మరణించగానే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. చదవండి: పార్ట్ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి.. చదవండి: పార్ట్ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. -
ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!
పిల్లలు ఐస్‌క్రీం కావాలని మారం చేస్తే ఏదో రకంగా ఎక్కడికైన వెళ్లి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ అది వేళకాని వేళ అయితే కాస్త బుజ్జగించడానికి ప్రయత్నించటమో లేక వేరే ఏదైన కొని ఇవ్వడం చేస్తాం. కానీ ఇక్కడొక వ్యక్తి పిల్లలు ఐస్‌క్రీం అడిగితే షాపు యజమాని ఇవ్వనన్నాడని ఏం చేశాడో చూడండి. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అక్కడ రూ.23 లక్షల రుణాలు ఇస్తారట!) అసలు విషయంలోకెళ్లితే...ముంబైలో వసాయ్ కౌల్ హెరిటేజ్ సిటీలోని ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో మెడికల్ స్టోర్ పక్కన ఉన్న ఐస్క్రీ షాపు వద్దకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో షాపు మూసే నిమిత్తం అన్ని సర్దుకుంటున్నాడు. పైగా ఏంటీ ఈ సమయంలో వచ్చారు అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఆ వ్యక్తి వంకా చూశాడు. ఇంతలో సదరు వ్యక్తి వచ్చి ఐస్‌క్రీం అడగటంతో అతను ఇప్పుడు విక్రయించను అని చెప్పాడు. దీంతో అతను యజమానిని కోపంగా బెదిరించడం వంటివి చేశాడు. ఆ తర్వాత కాసేపటి ఒక ఇనుపరాడ్‌ని తీసుకుని ఐస్‌క్రీం స్టాక్ ఉన్న గాజు ఫ్రీజర్లను పగలు కొట్టేసి వెళ్లిపోతాడు. పాపం దుకాణ యజమానికి సదరు వ్యక్తి భారి నష్టాన్ని మిగిల్చి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో ముంబై సబర్బ్ వసాయ్‌లోని మానిక్‌పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని ఆచూకి కోసం గాలిస్తున్నారు. (చదవండి: చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!) -
చివరి చూపు అయినా దక్కాలి కదా!
వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్ లైఫ్‌లో సోనూ సూద్ విలన్. రియల్ లైఫ్‌లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ పలు విషయాలు చెప్పారు. ► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి? సోనూ సూద్: నేను చిన్న టౌన్ (పంజాబ్‌లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైమ్‌లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. ► దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందజేయాలనే ఆలోచన గురించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ప్యాన్ ఇండియా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తగ్గించి కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఆరంభించనున్నాం. ► గొప్ప నాయకుడు భగత్ సింగ్ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్–ఇ–అజామ్’లో భగత్ సింగ్ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్ సింగ్‌తో పోల్చడంపై మీ ఫీలింగ్? నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా? నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది? తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్‌ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్ 15000 రూపాయలు, రైల్వేస్‌కు చెందిన మరో హ్యాండీకాప్డ్ పర్సన్ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది? నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్ ఎ కామన్‌మ్యాన్. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్ అయ్యాను. ► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్‌లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో! ► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్ చెబుతుంది. ► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్‌గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు... నా సోదరీ మణులకు థ్యాంక్స్. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్ లైఫ్‌లో దేవుడు నాకో పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్ బ్లెస్డ్ రోల్’ ఇది అని భా విస్తున్నా. ► బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు.. మాకు మంచి నెట్వర్క్ ఉంది. మా టీమ్‌లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చాం. మరికొందరు నా గైడ్ లైన్స్‌ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా. ► మీ బయోపిక్ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా? బయోపిక్ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్‌ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి. ► ఇటీవల మీకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పాజిటివ్ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్‌కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్‌తో కనెక్ట్ అయి, మా టీమ్‌తో టచ్‌లో ఉన్నాను. నా ఫోన్‌కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్‌లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్‌గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్ బాయ్స్, హాస్పిటల్ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది. – డి.జి. భవాని -
Coronavirus: చచ్చినా చావే!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కవ అంటుంటారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కాస్ట్ ఆఫ్ డెత్ కూడా చాలా ఎక్కువైంది. కోవిడ్ రోగిని బతికించే ఆసుపత్రుల్లో చికిత్సలు, యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లే కాదు..ఎవరైనా కన్ను మూస్తే కొన్ని గంటలు భద్రపరచడానికి ఉపకరించే డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సుల అద్దెలూ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణ సమయంలో వీటి అద్దె 24 గంటలకు గరిష్టంగా రూ.8 వేల వరకు ఉండేది. అయితే ప్రస్తుత సమయంలో వాటి యజమానులు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లో మార్చురీలు లేక.. కరోనా తొలి దశ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఫ్రీజర్ బాక్సులకు భారీ డిమాండ్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నగరంలో ప్రతి రోజూ జరిగే మరణాల సంఖ్య సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు కొన్ని రెట్లు పెరిగింది. సిటీలోని దాదాపు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. అయితే కేవలం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే మార్చురీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే వేళకాని వేళల్లో ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణించిన కోవిడ్ రోగుల మృతదేహాలను మరుసటి రోజు ఉదయం శ్మశానాలు తెరుకునే సమయం వరకు భద్రపరచడం కోసం కుటుంబీకులు ఫ్రీజర్ బాక్సులతో కూడిన అంబులెన్సుల సేవలు వినియోగించుకోవాల్సి వస్తోంది. అనుమానాల నేపథ్యంలోనూ బాక్సుల్లో.. ఒకప్పుడు అన్ని మృతదేహాలను ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచే వాళ్లు కాదు. అంత్యక్రియలకు ఎక్కువ సమయం పట్టే వాటితో పాటు వివిధ రోగాల బారినపడి మరణించిన వారిలో కుళ్లిపోతాయని భావించిన వాటిని భద్రపరచడానికి మాత్రమే ఫ్రీజర్ బాక్సులు వాడే వాళ్లు. అయితే ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు ప్రతి మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచాల్సి వస్తోంది. చుట్టు పక్కల వాళ్లు, బంధువులు మరణానికి కోవిడ్ వైరస్ కారణమనే అనుమానంతో ఉంటున్నారు. దీంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణించిన కోవిడ్ రోగుల మృతదేహాలు ప్రొటోకాల్ ప్రకారం పార్శిల్ చేసి ఇవ్వట్లేదు. ఈ కారణాల నేపథ్యంలో ఇప్పుడు దాదాపు ప్రతి శవాన్ని కుటుంబీకులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్రీజర్ బాక్సులోనే ఉంచాల్సి వస్తోంది. ఈ పరిణామాలను క్యాష్ చేసుకుంటున్న ఫ్రీజర్ బాక్సులతో కూడిన అంబులెన్స్‌ల యజమానులు రూ.8 వేల అద్దెను రూ.25 వరకు పెంచేశారు. శానిటైజ్ చేయాల్సి వస్తోంది ఫ్రీజర్ బాక్సుల అద్దెల్ని భారీగా పెంచి వసూలు చేస్తున్నామనేది వాస్తవం కాదు. ఇప్పటి అవసరాలను బట్టి కొంత వరకు పెంచాం. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రపరిచేది మామూలు మృతదేహమైనా, కోవిడ్ రోగి డెడ్ బాడీ అయినా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఫ్రీజర్ బాక్సుల్ని తరలించే అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు సహాయకుడికీ గ్లౌజులు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్ అందించాల్సి వస్తోంది. దీనికి తోడు దాదాపు ప్రతి రోజూ ఫ్రీజర్ బాక్సుతో పాటు వాహనాన్నీ శానిటైజ్ చేస్తున్నాం. ఈ కారణంగానే గతంకంటే కొంత ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నాం. – యాదయ్య, ఫ్రీజర్ బాక్సు యజమాని, సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, బ్లాక్ మార్కెట్ దందాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం నిఘా, తనిఖీలు ముమ్మరం చేశాం. కోవిడ్ సంబంధిత మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లతో సహా దేనికైనా వాస్తవ రేటు కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం. దీనికోసం 100 లేదా రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి 9490617111, హైదరాబాద్‌కు 9490616555, సైబరాబాద్‌కు 9490617444 నెంబర్లకు వాట్సాప్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు. – మహేష్ భగవత్, పోలీసు కమిషనర్, రాచకొండ చదవండి: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి -
‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’
చెన్నై: కొన్ని సార్లు మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు చూస్తే.. త్వరగా యుగాంతం వస్తే బాగుండు అనిపిస్తుంది. అంతటి దారుణాల మధ్య యాంత్రికంగా బతికేస్తున్నాం. ఇక వృద్ధుల పట్ల జరిగే దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు కుటుంబం కోసం శ్రమిస్తారు. వృద్ధాప్యంలో తన వారికి భారమవుతారు. ఈసడింపులు, ఛీత్కారాలు భరిస్తూ.. ఇంకా ఎన్ని రోజులు ఈ నరకం అని ఆ పండుటాకులు.. ఎప్పుడు పోతార్రా బాబు అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తోన్న రోజులివి. అందరు ఇలానే ఉన్నారని కాదు. కానీ ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ.. కుటుంబ సభ్యులు ప్రాణం ఉండగానే అతడిని శవాలను ఉంచే ఫ్రీజర్‌లో పెట్టి ఎప్పుడు కన్ను మూస్తాడా అని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ ట్రిక్ తో సేఫ్ గా ఉండండి ] వివరాల్లోకి వెళితే...సేలం కందపట్టి హౌసింగ్ బోర్డుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలసుబ్రమణ్య కుమార్ (70)కు పిల్లలు లేరు. గత ఏడాది భార్య ఉషా కూడా మరణించింది. దీంతో తన సోదరుడు శరవణన్, బంధువులు జయశ్రీ, గీతలతో కలిసి హౌసింగ్ బోర్డులో నివాసం ఉన్నారు. గత నెల బాలసుబ్రమణ్య కుమార్ అనారోగ్యం బారిన పడటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమించినట్టేనని, ఇక బతకడం కష్టం అని వైద్యులు తేల్చారు. దీంతో మంగళవారం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్ కోమాలోకి వెళ్లినట్టుగా పరిస్థితి మారింది. దీంతో ఇక, అన్నయ్య మరణించినట్టేనని భావించిన తమ్ముడు శరవణన్, అంత్యక్రియల ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాడు. (చదవండి: వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన) ముందుగానే ఏర్పాట్లు..... ముందుగా ఫ్రీజర్ బాక్స్‌ను ఇంటికి తెప్పించాడు. అందులో బతికే ఉన్న సోదరుడిని పడుకోబెట్టాడు. కాళ్లు చేతులు, కట్టి మృతదేహంలా ఆ బాక్స్‌లో పెట్టేశాడు. బాలసుబ్రమణ్య కుమార్ శరీరం చచ్చుబడ్డా, గుండె మాత్రం కొట్టుకుంటుండటంతో, ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందో అని రాత్రంతా ఎదురు చూశాడు. అయితే, బుధవారం ఉదయాన్నే ఆ ఇంటికి ఫ్రీజర్ బాక్స్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి వచ్చాడు. ఈ సమయంలో బాలసుబ్రమణ్య కుమార్ శరీరంలో చలనం కనిపించడంతో, కళ్లు తెరచుకుని ఊపిరీ పీల్చలేని స్థితిలో ఉండటాన్ని చూసి ఆందోళన చెందాడు. శరవణన్‌ను హెచ్చరించాడు. ఆయన పట్టించుకోక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఫ్రీజర్ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. శరశణన్ను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది. తన సోదరుడు చనిపోవడం ఖాయం అని వైద్యులు చెప్పేశారని, అందుకే ముందుగానే తాను ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని, తమకు సాయంగా ఎవ్వరూ లేరని , అందుకే అన్ని ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా దీవలింగం మాట్లాడుతూ.. "ఆ వ్యక్తిని రాత్రంతా లోపల ఉంచారు. ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ భయపడి నన్ను అప్రమత్తం చేశాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులు ‘అతను చనిపోయాడు కానీ ఆత్మ ఇంకా విడిచిపెట్టలేదు అందుకే మేము వేచి ఉన్నాము' అని చెప్పారు" అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. -
డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత..
సాక్షి, మహబూబ్‌నగర్: నిందితుల కుటుంబాలకు మృతదేహాల అప్పగింత వాయిదా పడడంతో జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఫ్రీజర్లు లేకపోవడంతో బయటి నుంచి తెప్పించి మృతదేహాలను అందులో ఉంచారు. ఈ క్రమంలో వసతులు లేవని, మృతదేహాలను భద్రపరిచేందుకు సరైన వసతులు లేవని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. వాయిదా పడిన అంత్యక్రియలు శవాలను పూడ్చేందుకు తీసిన గోతులు జక్లేర్‌లో మహ్మద్ ఆరీఫ్ పాషాను ముస్లింల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు ఆ గ్రామ మైనార్టీలు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్లలో తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు నవీన్, శివ, చెన్నకేశవులు కుటుంబీకులు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గుంతలను తవ్వించారు. అంత్యక్రియలు చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందుండి గుంతలను తవ్వించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతమైన వాతావరణంలో అంత్యక్రియలు జరపాలని పోలీసు యంత్రాంగం ప్రణాళికతో అంచనా వేసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్, హైకోర్టు ఆదేశాలతో చివరకు మృతదేహాలు గ్రామాలకు చేరుకోకపోవడంతో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. -
శవాలకూ రక్షణ కరువు
సాక్షి, జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధానాస్పత్రిలో శవపరీక్షలకు కష్టకాలం వచ్చింది. జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ గది చిన్నగా ఉండడం, ఫ్రీజర్ సైతం ఒకటే ఉండడం ఇబ్బందిగా మారింది. సెలవు దినాల్లో రెండుకు మించి మృతదేహాలు వస్తే భద్రపరచడం కూడా కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరచగా.. ఎలుకలు తిన్నాయి. అంతేకాకుండా ఫ్రీజర్‌లోనూ రెండు మృతదేహాలను మాత్రమే భద్రపరిచే అవకాశం ఉంది. అది కూడా ఒక దానిపైన మరో శవాన్ని ఉంచాల్సి వస్తుండడంతో మృతుల బంధువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఒకే ఫీజర్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. ఏదైన ప్రమాదం జరిగి చనిపోతే పోస్టుమార్టం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఆస్పత్రిని అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. ప్రస్తుతం జిల్లాగా అవతరించడం, జనాభా పెరగడం తో ఆస్పత్రి సరిపోవడం లేదు. దీంతో పోస్టుమార్టం గది సైతం చిన్నగా మారింది. ఈ గదిలో రెండు ఫ్రీజర్లతోపాటు ఒక బల్ల మాత్రమే ఉన్నా యి. ఈ ఆస్పత్రికి వారంలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలు వస్తుంటాయి. సాయంత్రం వేళ పోస్టుమార్టం చేయకపోవడం, రాత్రి వేళ చనిపోయిన వారిని ఇక్కడే తేవడంతో మృతదేహాలను పోస్టుమార్టం గదిలో భద్రపరుస్తుంటారు. రెండు మృతదేహాలకన్నా ఎక్కువగా ఉంటే బయట వరండాలోనే వేయాల్సిన దుస్థితి. అన్నీ అసౌకర్యాలే.. పోస్టుమార్టం గదికి ఒక భవనంతోపాటు మృతదేహాలను భద్రపర్చేందుకు ఒక గది, కుళ్లిన మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను భద్రపరిచేందుకు ఒక గది ఉండాలి. కానీ ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇందులో నిరంతరం నీటి సరఫరాతోపాటు శుభ్రం చేసేందుకు వాక్యుమ్‌క్లీనర్లు ఉండాలి. ఇవన్నీ కనిపించడం లేదు. పరికరాలు సైతం స్టీల్‌తో చేసినవి ఉండాలి. గది లోపలికి గాలి వెళ్లేందుకు ఎగ్జిట్‌ఫ్యాన్లు సైతం ఉండాలి. కానీ ఈ గది పురాతనమైనది కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా ఇతర సామగ్రిని సైతం ఇందులోనే వేస్తున్నారు. శవ పంచనామా రాసేందుకు ప్రత్యేక గది లేదు. మరొకటి ఎప్పుడో ? జగిత్యాల జిల్లా కేంద్రంగా మారడంతో ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఆ స్థాయిలో వసతులు కల్పించలేదు. మృతదేహాలు సైతం దాదాపు నెలకు 30కి పైగానే వస్తుంటాయి. వీటన్నింటికి పోస్టుమార్టం చేసేందుకు ఒకే గది ఉంది. గతంలో అధికారులు పరిశీలించినప్పటికీ స్థలం లేదని, ఉన్న దాంట్లోనే మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికైన అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మరో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్థలం లేకనే ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న పోస్టుమార్టం గదికి మరమ్మతులు చేయిస్తున్నాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మరో గదిని ఏర్పాటు చేయాలంటే స్థలం లేదు. ప్రస్తుతం ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న మాతాశిశు సంక్షేమ భవనంలోకి గైనిక్ విభాగం వెళ్తే ఇబ్బందులు తొలగుతాయి. ఇటీవల మృతదేహాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుదక్షిణాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కొండంత విషాదం... కడసారి చూపుకోసం..
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): ఆపద్దర్మ మంత్రులు వచ్చారు.. పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లారు. అధికారులు వచ్చారు.. సహాయక చర్యలు పరిశీలించి వెళ్లారు. వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ మృతి చెందినవారిని అందరూ గాలికొదిలేశారు. మృతి చెందిన వారి బంధువులెవరు.. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులేంటని పట్టించుకున్న నాదుడే లేడు. అయినవారి కడసారి చూపు కోసం ఫ్రీజర్ బాక్స్(ఐస్ బాక్స్)లో పెట్టే ఆర్థిక స్థోమత లేక మృతదేహాలను మంచు గడ్డలతో కప్పి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి కొడిమ్యాల మండల ప్రజలు చలించపోతున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. ఈ మండలానికి చెందిన వారే సుమారు 49 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఈ మండలంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ వారు మరణించిన విషయం తెలుసుకొని కడసారి చూపుకోసం హుటాహుటిని స్వస్థలానికి బయలుదేరారు. వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో లేక.. ఉన్నా వాటికి అద్దె కట్టే ఆర్థిక స్థోమత లేక.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంచు గడ్డలతో మృతదేహాలని కప్పిపెట్టారు. కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 57 మంది దుర్మరణం -
పెన్షన్ కోసం తల్లి శవాన్ని..
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ : డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్‌కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్ కూడా సృష్టించాడు. వివరాలు...కోల్‌కతాకు చెందిన బీనా మజుందార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తు ఉండేది. అనారోగ్యం కారణంగా 2015 ఏప్రిల్ 7న హాస్పిటల్లో మరణించింది. అయితే అప్పటి నుంచి తన భర్త గోపాల్ మజుందార్, కుమారుడు సుప్రభాత్ మజుందార్లు ఆమె శవాన్ని ఇంట్లోనే ఫ్రిజ్‌లో దాచిపెట్టారు. ఇరుగు పొరుగు వారు అడిగితే మార్చురీలో ఉందని చెప్పేవారు. బీనా మజుందార్‌కు వచ్చే పెన్షన్ డబ్బులను గత రెండేళ్ల నుంచి వీరే డ్రా చేస్తున్నారు. అయితే పెన్షన్ కోసమే ఇలా చేసుండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. శవంపై కత్తి గాట్లు ఉన్నాయని, పోస్ట్‌మార్టంకు తరలించామని దాని తర్వాతే అసలు నిజాలు చెప్పగలమని పోలీసులు పేర్కొన్నారు. -
మంటగలిసిన మానవత్వం..!
కాజీపేట: కుటుంబసభ్యురాలి మరణంతో పుట్టెడు దుఃఖం లో ఉన్న ఓ కుటుంబాన్ని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకే రానివ్వలేదు. దీంతో ఆ కుటుంబం శ్మశానవాటిక ఎదుటే టెంట్ వేసుకొని రాత్రంతా గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాజీపేటలో శనివారం రాత్రి జరిగింది. బాపూజీనగర్‌కు చెందిన సుమన్ బారుు(70) రైల్వే మాజీ ఉద్యోగి భార్య. ఆమెకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు అమర్గాంధీ వికలాంగుడు. కోడలు కిరణ్ కిరాణా దుకాణంలో పనిచేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరు బాపూజీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. సుమన్ బారుు అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు యత్నించగా ఇంటి యజమానురాలు అభ్యంతరం తెలిపింది. అంత్యక్రియలు ముగిశాక రావాలని చెప్పింది. స్థానికుల సహాయంతో రాత్రంతా శ్మశానవాటిక వద్ద ఫ్రీజర్‌బాక్స్‌లో మృతదేహాన్ని భద్రపరిచారు. మరు నాడు అంత్యక్రియలు నిర్వహించారురు.