
పిల్లలు ఐస్‌క్రీం కావాలని మారం చేస్తే ఏదో రకంగా ఎక్కడికైన వెళ్లి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ అది వేళకాని వేళ అయితే కాస్త బుజ్జగించడానికి ప్రయత్నించటమో లేక వేరే ఏదైన కొని ఇవ్వడం చేస్తాం. కానీ ఇక్కడొక వ్యక్తి పిల్లలు ఐస్‌క్రీం అడిగితే షాపు యజమాని ఇవ్వనన్నాడని ఏం చేశాడో చూడండి.
(చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి అక్కడ రూ.23 లక్షల రుణాలు ఇస్తారట!)
అసలు విషయంలోకెళ్లితే...ముంబైలో వసాయ్ కౌల్ హెరిటేజ్ సిటీలోని ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి రాత్రి రెండు గంటల సమయంలో మెడికల్ స్టోర్ పక్కన ఉన్న ఐస్‌క్రీ షాపు వద్దకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో షాపు మూసే నిమిత్తం అన్ని సర్దుకుంటున్నాడు. పైగా ఏంటీ ఈ సమయంలో వచ్చారు అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఆ వ్యక్తి వంకా చూశాడు. ఇంతలో సదరు వ్యక్తి వచ్చి ఐస్‌క్రీం అడగటంతో అతను ఇప్పుడు విక్రయించను అని చెప్పాడు. దీంతో అతను యజమానిని కోపంగా బెదిరించడం వంటివి చేశాడు.
ఆ తర్వాత కాసేపటి ఒక ఇనుపరాడ్‌ని తీసుకుని ఐస్‌క్రీం స్టాక్ ఉన్న గాజు ఫ్రీజర్లను పగలు కొట్టేసి వెళ్లిపోతాడు. పాపం దుకాణ యజమానికి సదరు వ్యక్తి భారి నష్టాన్ని మిగిల్చి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో ముంబై సబర్బ్ వసాయ్‌లోని మానిక్‌పూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి అతని ఆచూకి కోసం గాలిస్తున్నారు.
(చదవండి: చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!)