రేపిస్టుల నుంచి తప్పించుకోడానికి.. | woman jumps from balcony to get rid of rapists | Sakshi
Sakshi News home page

రేపిస్టుల నుంచి తప్పించుకోడానికి..

Published Mon, Mar 13 2017 6:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

రేపిస్టుల నుంచి తప్పించుకోడానికి..

రేపిస్టుల నుంచి తప్పించుకోడానికి..

దేశ రాజధానిలో మరో ఘోరం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ప్రణవ్ నగర్ ప్రాంతంలో తనపై అత్యాచారం చేస్తున్న ఐదుగురు మగాళ్ల బారినుంచి తప్పించుకోడానికి ఓ మహిళ అపార్టుమెంటు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఆ ఐదుగురు వ్యక్తులు ఆమెను నగ్నంగా చేసి.. ఆపై ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. అక్కడకు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజిలో ఈ విషయం రికార్డు కావడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

తనకు సాయం చేయాల్సిందిగా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరినీ ఆమె వేడుకున్నా, అటువైపు వెళ్లేవాళ్లంతా ఆమెవైపు చూస్తూ నిల్చుండిపోయారు తప్ప ఒక్కరు కూడా ఆదుకోలేదు. చాలా కార్లు అటునుంచి వెళ్లాయి గానీ ఒక్కటి కూడా ఆగలేదు. చివరకు ఓ ఆటో డ్రైవర్ ఆమెను కాపాడేందుకు ముందుకొచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement