Viral Video: Woman Takes Out Petrol From Bike, Sets It On Fire In South East Delhi - Sakshi
Sakshi News home page

Viral Video: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ..

Published Fri, May 12 2023 10:56 AM | Last Updated on Fri, May 12 2023 11:05 AM

South East Delhi Women Take Out Petrol From Bike Sets It on Fire - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్‌ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె.. అందులోనుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. మంటలు రాగానే సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది.

కాసేపటికే మరో బైక్‌లో నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించింది. అయితే స్థానికులు గమనించి ఆమెను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చాక అప్పగించారు.

అయితే ఈ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత లేదు. వ్యక్తిగత కక్షలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా.. మహిళ బైక్‌కు నిప్పంటించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.  అర్ధరాత్రి సమయంలో ఈమె ఇలా ఎందుకు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: అత్తింటి వేధింపులకు యువ డాక్టర్‌ బలి.. కారు ఇస్తామన్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement