
సాక్షి, న్యూఢిల్లీ : పండుగనాడు తన ఎన్నారై భర్త ఫోన్ ఎత్తలేదని మనోవేదనతో ఓ భార్య ప్రాణత్యాగం చేసుకొంది. ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల మహిళకు ఓ ఎన్నారైకు మూడేళ్ల కిందట వివాహం అయింది. అతడు 15 రోజుల కిందటే అమెరికా వెళ్లిపోయాడు.
అయితే, కార్వా చౌత్ పండుగ (నిండు పౌర్ణమినాడు భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూడటం)నాడు ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. అయితే, అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో కూడా ఉంది. దీంతో పలుమార్లు ఫోన్ చేసిన ఆమె భర్త ఫోన్ ఎత్తలేదని కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.