hanged herself
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో
సాక్షి, మల్లాపూర్(హైదరాబాద్): కుటుంబ కలహాలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ కుమార్తెను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం విలేజ్‌కు చెందిన తెలుగు మద్దిలేటి, ఉమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌కు, జమ్మిగడ్డ శ్రీశివసాయినగర్కు చెందిన దీపిక అలియాస్ చందన (27) 2019లో వివాహం జరిగింది. వీరికి రుత్విక(01) కుమార్తె ఉంది. చంద్రశేఖర్ అమీర్‌పేట్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ నెల 4న రుత్విక బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తగారు పాపకు పెట్టిన బంగారు గొలుసు విషయమై భార్యాభర్తల మధ్య తరచు గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం ఉదయం రెండో ఫ్లోర్లో చంద్రశేఖర్ పని చేసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో పాప ఏడుస్తుందని కిందకు వచ్చిన దీపిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని పాప మొహంపై దిండుతో అదిమి చంపివేసింది. అనంతరం ఉయ్యాల తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం కిందకు వచ్చిన చంద్రశేఖర్ సోదరుడు డోర్ కొట్టగా ఎంతకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా దీపిక ఉరివేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి హుటాహుటిన తల్లిబిడ్డలను నాచారం ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాచారం పోలీసులు మృతురాలి భర్త, మరిది, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె మూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్తే చంపాడు.. చంద్రశేఖర్ తన కూతురిని, బిడ్డను హత్య చేశాడని దీపిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్దే చంద్రశేఖర్ కుటుంబసభ్యులపై వారు దాడి చేశారు. -
పండుగనాడు భర్త ఫోన్ ఎత్తలేదని..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగనాడు తన ఎన్నారై భర్త ఫోన్ ఎత్తలేదని మనోవేదనతో ఓ భార్య ప్రాణత్యాగం చేసుకొంది. ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల మహిళకు ఓ ఎన్నారైకు మూడేళ్ల కిందట వివాహం అయింది. అతడు 15 రోజుల కిందటే అమెరికా వెళ్లిపోయాడు. అయితే, కార్వా చౌత్ పండుగ (నిండు పౌర్ణమినాడు భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూడటం)నాడు ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. అయితే, అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో కూడా ఉంది. దీంతో పలుమార్లు ఫోన్ చేసిన ఆమె భర్త ఫోన్ ఎత్తలేదని కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో బాత్రూమ్ కట్టడం లేదని ...
దుమ్కా: ఇంట్లో బాత్రూమ్ లేదు. రోజూ బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అవమానకరంగా భావించింది ఆ 17 ఏళ్ల యువతి కుష్బు కుమారి. ఇంట్లో బాత్రూమ్ కట్టించండంటూ ఆమె తన తల్లిదండ్రుల చెవిలో ఇల్లుకట్టుకుని పోరింది. వారు ఎంతకీ తన మాటలు వినడం లేదని చివరకు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్ దుమ్కాలోని గోశాల రోడ్డులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుష్బు స్థానిక ఏ ఎన్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంట్లోనే బాత్రూమ్ కడితే బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదంటూ తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. తాను ఒకటి తలిస్తే.... ఆమె తల్లిదండ్రులు మరొకటి తలిచారు. ఇంట్లో బాత్రూమ్ కట్టడం కంటే ఆమెకు తగిన వరుడిని చూసి... పెళ్లి చేయాలని తలిచారు. బాత్రూమ్ నిర్మిస్తే... మళ్లీ ఖర్చు అవుతుంది. ఈ అనవసర ఖర్చు ఎందుకూ.... అందుకయ్యే ఖర్చును కూడా దాచి కుష్బు పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నారు. అలాగే చేశారు. దాంతో ఎంత చెప్పిన తన తల్లిదండ్రులు బాత్రూమ్ నిర్మించడం లేదని కుష్బు ఆత్మహత్యకు ఒడిగట్టింది.