ఇంట్లో బాత్రూమ్ కట్టడం లేదని ...
దుమ్కా: ఇంట్లో బాత్రూమ్ లేదు. రోజూ బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అవమానకరంగా భావించింది ఆ 17 ఏళ్ల యువతి కుష్బు కుమారి. ఇంట్లో బాత్రూమ్ కట్టించండంటూ ఆమె తన తల్లిదండ్రుల చెవిలో ఇల్లుకట్టుకుని పోరింది. వారు ఎంతకీ తన మాటలు వినడం లేదని చివరకు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్ దుమ్కాలోని గోశాల రోడ్డులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
కుష్బు స్థానిక ఏ ఎన్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంట్లోనే బాత్రూమ్ కడితే బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదంటూ తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. తాను ఒకటి తలిస్తే.... ఆమె తల్లిదండ్రులు మరొకటి తలిచారు. ఇంట్లో బాత్రూమ్ కట్టడం కంటే ఆమెకు తగిన వరుడిని చూసి... పెళ్లి చేయాలని తలిచారు.
బాత్రూమ్ నిర్మిస్తే... మళ్లీ ఖర్చు అవుతుంది. ఈ అనవసర ఖర్చు ఎందుకూ.... అందుకయ్యే ఖర్చును కూడా దాచి కుష్బు పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నారు. అలాగే చేశారు. దాంతో ఎంత చెప్పిన తన తల్లిదండ్రులు బాత్రూమ్ నిర్మించడం లేదని కుష్బు ఆత్మహత్యకు ఒడిగట్టింది.