Dumka
-
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్‌దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్‌కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్‌మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్‌కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలకు చేరిన సోరెస్ ఇంటి పోరు!
జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు. 1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్‌పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన దరిమిలా జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమెను అభ్యర్థిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే, వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్‌తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోరెన్ కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది. -
ఫెయిల్ చేశాడని టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు
రాంచీ: విద్యాబుద్ధులు నేర్పే గురువులను ధైవంతో సమానంగా చూడాలంటారు పెద్దలు. కొన్నేళ్ల క్రితం అలాగే ఉండేది.. గురువుల పట్ల ఎంతో వినయంగా, భయం, భక్తితో మెలిగేవారు విద్యార్థులు. కానీ, ఇప్పుడు కాలం మారింది. గురువులనే ఎదురించే శిష్యులు తయారయ్యారు. అలాంటి సంఘటనే జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారని ఓ గణితం టీచర్, క్లర్క్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదారు కొందరు విద్యార్థులు. గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో గత సోమవారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదో తరగతి పరీక్షల ఫలితాలను జార్ఖండ్ అకాడమీ కౌన్సిల్ గత శనివారం విడుదల చేసింది. స్కూల్లోని 9వ తరగతిలో 32 మంది ఉండగా.. అందులో 11 మందికి ప్రాక్టికల్ పరీక్షలో గ్రేడ్ ‘డీడీ’ వచ్చింది. అంటే ఫెయిల్ అయినట్లే. దీంతో మార్కులు వేసిన ఉపాధ్యాయుడు, వాటిని జేఏసీ సైట్లో అప్లోడ్ చేసిన క్లర్క్‌ను పట్టుకుని చితకబాదారు. అయితే.. ‘ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటంతో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ని కలిసి ఫిర్యాదు చేయాలని కోరాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందనే కారణంతో ఇచ్చేందుకు నిరాకరించారు.’ అని గోపికందర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ నిత్యానంద్ భోక్తా తెలిపారు. బాధిత ఉపాధ్యాయుడు సుమన్ కుమార్, క్లర్క్ సొనేరామ్ చౌరేగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారు సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థులు ఉండగా అందులో చాలా మంది ఈ సంఘటనలో పాల్గొన్నట్లు బీడీవో అనంత్ ఝా తెలిపారు. బాధిత టీచర్ గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేయగా.. ఆయన్ను తొలగించారు. ప్రస్తుత సంఘటనతో 9, 10వ తరగతులకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. In #Jharkhand’s Dumka district, a group of school students tied their teachers to a tree and allegedly beat them up for giving them low scores which resulted in the students failing their exams. pic.twitter.com/vdr1Amubp4 — Samira Nabila (@SamiraNabila1) August 31, 2022 ఇదీ చదవండి: అంకిత సజీవ దహన ఉదంతంలో ట్విస్ట్.. ఆమె మైనర్, ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవే! -
మేకను ఎత్తుకెళ్లాడని కొట్టి చంపారు
రాంచీ: మేకను ఎత్తుకెళ్లాడన్న కోపంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సోమవారం జార్ఖండ్‌లో జరిగింది. డుమ్కా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మేక కనిపించకుండా పోవడంతో ముప్పై ఏళ్ల సుభాన్ మియాన్ అనే వ్యక్తి దాన్ని దొంగిలించాడని భావించాడు. దీంతో కొంతమంది వ్యక్తులను పోగేసుకుని అతనిపై దాడికి దిగబడ్డాడు. అతనితోపాటు ఉన్న దులాల్ మీర్దా అనే మరో వ్యక్తిని కూడా చితకబాదారు. ఈ దాడిలో సుభాన్ అక్కడికక్కడే మరణించాడు. (మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి) సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా సుభాన్ రక్తపు మడుగులో పడి ఉండగా, తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దులాల్‌ను డుమ్కాలోని సర్దార్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డవారిలో మేక యజమాని సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ నేరంలో ఎవరెవరు పాల్గొన్నారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. కాగా మేక పోయిందని అటు గ్రామస్తులు, ఇటు బాధితులపై దాడి రెండింటిపైనా కేసు నమోదు చేశామని ఎస్పీ అంబర్ లర్కా తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. (బాలిక గొంతుకోసిన యువకుడు) -
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి, డుంకా: జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
ఇంట్లో బాత్రూమ్ కట్టడం లేదని ...
దుమ్కా: ఇంట్లో బాత్రూమ్ లేదు. రోజూ బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం అవమానకరంగా భావించింది ఆ 17 ఏళ్ల యువతి కుష్బు కుమారి. ఇంట్లో బాత్రూమ్ కట్టించండంటూ ఆమె తన తల్లిదండ్రుల చెవిలో ఇల్లుకట్టుకుని పోరింది. వారు ఎంతకీ తన మాటలు వినడం లేదని చివరకు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్ దుమ్కాలోని గోశాల రోడ్డులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుష్బు స్థానిక ఏ ఎన్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంట్లోనే బాత్రూమ్ కడితే బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదంటూ తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. తాను ఒకటి తలిస్తే.... ఆమె తల్లిదండ్రులు మరొకటి తలిచారు. ఇంట్లో బాత్రూమ్ కట్టడం కంటే ఆమెకు తగిన వరుడిని చూసి... పెళ్లి చేయాలని తలిచారు. బాత్రూమ్ నిర్మిస్తే... మళ్లీ ఖర్చు అవుతుంది. ఈ అనవసర ఖర్చు ఎందుకూ.... అందుకయ్యే ఖర్చును కూడా దాచి కుష్బు పెళ్లి ఘనంగా చేద్దామనుకున్నారు. అలాగే చేశారు. దాంతో ఎంత చెప్పిన తన తల్లిదండ్రులు బాత్రూమ్ నిర్మించడం లేదని కుష్బు ఆత్మహత్యకు ఒడిగట్టింది.