జార్ఖండ్ రాజకీయాలను శాసించిన శిబూ సోరెన్ కుటుంబం ఇప్పుడు ఇంటి పోరును ఎదుర్కొంటోంది. శిబూ సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ సొంత పార్టీ జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు. దుమ్కా స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె బరిలోకి దిగుతున్నారు.
1980 తర్వాత ఒకటి రెండు ఎన్నికలు మినహా దుమ్కా సీటు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆధీనంలో ఉంది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్.. శిబు సోరెన్‌పై విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, సీతా సోరెన్ పార్టీలో చేరిన తర్వాత అభ్యర్థిని మార్చింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన దరిమిలా జేఎంఎం ఇక్కడి నుంచి హేమంత్ భార్య కల్పనా సోరెన్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆమెను అభ్యర్థిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దుమ్కాలో జేఎంఎం అభ్యర్థి హేమంత్ లేదా కల్పన ఎవరైనా సరే, వారి కుటుంబానికి చెందిన సీతా సోరెన్‌తో పోటీ పడవలసి ఉంటుంది. సీతా సోరెన్ బీజేపీ అభ్యర్థిగానే కాకుండా బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా వ్యవహరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోరెన్ కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment