ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.
అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి..
Comments
Please login to add a commentAdd a comment