
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీకి తమ పార్టీకి మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు కేవలం తొమ్మిది శాతం ఓట్లే పోలవుతాయని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు ఆప్‌కు చెందినవారైతే ఢిల్లీ మెట్రో చార్జీలు పెరిగిఉండేఇవి కాదని ప్రజలు భావిస్తున్నారని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేశారు.
ప్రజల హక్కుల కోసం తమ పార్టీ మాత్రమే పోరాడుతోందని ప్రజలు గమనిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడూ ఢిల్లీ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పార్టీ ఎంపీలే ఉండిఉంటే ఢిల్లీ మెట్రో రైలు చార్జీలు పెరిగిఉండేవి కాదన్నారు. కాగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లనూ బీజేపీ గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment