పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామని... కేంద్రంలోని అధికార బీజేపీ ‘మిత్రులకు’ దీనిపై ముందే సమాచారముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులు, చిన్నమొత్తాల పొదుపులపై సర్జికల్ స్ట్రైక్స్ అని... నల్ల ధనం, బ్లాక్ మార్కెటర్లపై కాదని పేర్కొన్నారు. ‘బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ అధినేత సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు ఒక రోజు ముందే రూ.2,000 నోటును సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ స్థారుులో డబ్బు డిపాజిటరుుంది. అధికార పార్టీ వారికి నోట్ల రద్దుపై ముందే సమాచారం అందడం వల్లే డిపాజిట్లు జరిగాయని స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ‘నల్ల ధనం పేరుతో దేశంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది.