
కేజ్రీ! ఆ అధికారెవరో చెప్పండి: సీబీఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసత్య ఆరోపణలతో తప్పుదోవ పట్టిస్తున్నారని సీబీఐ మండిపడింది. ‘కేంద్రం మాట వినని పార్టీలపై సీబీఐ దాడులు చేయాలని కేంద్ర ఆదేశించిందని.. ఓ సీబీఐ అధికారి నాతో చెప్పారు’ అని శుక్రవారం కేజ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ అధికారెవరో చెప్పాలని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్.. కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. భారత అత్యున్నత విచారణ సంస్థను అవమానించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.
'మీకు అలా చెప్పిన అధికారెవరో చెప్పండి చట్ట ప్రకారం చర్యలు ప్రారంభిస్తాం' అని ఆమె అన్నారు. కాగా, ఐఏఎస్ అధికారుల బృందం.. శనివారం కేజ్రీవాల్‌ను కలిసింది. ప్రశాంతంగా, తటస్థంగా పనిచేసే వాతావరణాన్ని కలిపించాలని ఢిల్లీ సీఎంను కోరింది.