
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్ కురిపిస్తున్న ఉచిత వరాలపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన చర్యలను సమర్ధించుకున్నారు. పరిమితంగా చేపట్టే ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని, ఇవి పేదల చేతిలో డబ్బు ఉండేలా చేయడంతో వ్యవస్థలో డిమాండ్ పెరుగుతాయని వ్యాఖ్యానించారు.
లోటు బడ్జెట్‌లకు, అధిక పన్నులకు తావివ్వని రీతిలో పరిమితంగానే ఉచిత వరాలు ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి, భద్రత అవసరమని ఉచిత నీరు, విద్యుత్ వంటి వరాలు కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇక ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తప్పుడు హామీలు గుప్పిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా సైతం విమర్శలు గుప్పించారు. దేశంలో తప్పుడు వాగ్ధానాలపై పోటీ జరిగితే కేజ్రీవాల్ ముందువరసలో ఉంటారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment