సాక్షి,హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉండాలన్న నిబంధనేది లేదని, వారం రోజుల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం(జనవరి18) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారు.
వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుంది. బీఆర్‌ఎస్ పార్టీలో తర్వాత ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయింది.బీఆర్‌ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో ఎవరు చెప్పలేరు. కొత్త సభ్యత్వాలు,పోలింగ్ బూత్ కమిటీలు,మండల కమిటీలు పూర్తయ్యాయి.జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది.600 మండల కమిటీలు పూర్తి చేస్తాం..అందులో 50 శాతంపైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం.
పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తాం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదు..బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి మూడు వాయిదాల నిధులు రాలేదంటే అందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడమే.రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ? ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు.
రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలు అమలు చేయాలి. కేంద్రానికి వచ్చే ఆర్థిక వనరులను బేరీజు వేసుకొని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.హైదరాబాద్‌లో ఏడు నెలలుగా వీధి దీపాలు కాలిపోతే నిధుల కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో మద్యంపై వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేశారు.హైడ్రా కొత్తది కాదు..గతంలో ఉన్నదానిని పేరు మార్చారు.మూసీ సుందరీకరణకు నిబంధనల మేరకు కేంద్రం నిధులు ఖచ్చితంగా ఇస్తాం’అని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment