బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు
- పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ అని వ్యాఖ్య
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామని... కేంద్రంలోని అధికార బీజేపీ ‘మిత్రులకు’ దీనిపై ముందే సమాచారముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులు, చిన్నమొత్తాల పొదుపులపై సర్జికల్ స్ట్రైక్స్ అని... నల్ల ధనం, బ్లాక్ మార్కెటర్లపై కాదని పేర్కొన్నారు. ‘బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ అధినేత సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు ఒక రోజు ముందే రూ.2,000 నోటును సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ స్థారుులో డబ్బు డిపాజిటరుుంది. అధికార పార్టీ వారికి నోట్ల రద్దుపై ముందే సమాచారం అందడం వల్లే డిపాజిట్లు జరిగాయని స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ‘నల్ల ధనం పేరుతో దేశంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది.
ఏటీఎంలలో డబ్బు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ఇప్పుడున్న ఏటీఎంలు పంపిణీ చేయలేవు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను కేంద్రం ఎలా మార్చగలదు? విషయం తెలిసే సంక్షోభం సృష్టించారు. మోదీ దృష్టిలో నల్లధనం అంటే ఏది? అంబానీ, అదానీ, శరద్‌పవార్, సుభాష్ చంద్ర, బాదల్ వంటి బడా పారిశ్రా మికవేత లు కూడబెట్టిన నల్లధనమా? లేదంటే రైతులు, రిక్షావారు, కూలి చేసుకు బతికేవారు సంపాదిం చిందా..’ అని ప్రశ్నించారు. కొత్త నోట్లు ఇచ్చేం దుకు ప్రజల నుంచి కమీషన్లు తీసుకొంటున్న వారితో పాటు ముందుగానే విషయం తెలుసు కుని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్న ‘మిత్రు ల’ జాబితా బయటపెట్టాలన్నారు.
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం...
ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, చివరకు నిరుద్యో గానికి దారితీస్తుందని హెచ్చరించారు. ‘ప్రజ ల్లో భయాందోళనలు నెలకొన్నారుు. వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది సరైన నిర్ణయ మనిపించుకోదు’ అని అన్నారు. నల్ల ధనాన్ని మళ్లీ పంపిణీ చేసుకోవడానికే ఇది ఉపయో గపడుతుందన్నారు.
‘నల్ల’కుబేరులకు ఆప్ వత్తాసు: బీజేపీ
నల్ల కుబేరులకు మద్దతు తెలుపుతోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొ ట్టింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిని ప్రజలు పట్టించుకోరని బేజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఇది బీజేపీ మరో జిమ్మిక్కు: కాంగ్రెస్
పెద్ద నోట్ల రద్దు బీజేపీ మరో జిమ్మిక్కని... నిజంగా నల్ల ధనం వెలికి తీయాలనే ఆలోచనే ఉంటే రాబోయే యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టే ఖర్చెంతో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల ఖర్చుపై లెక్క తేల్చేందుకు విచారణ కమిషన్‌ను వేయాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కోరారు. ఎలాంటి ప్రణాళికా లేకుండా బీజేపీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమి దన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2005కు ముందు నోట్లను రద్దు చేయాలనుకొం టున్నామని ప్రకటిస్తే బీజేపీ దాన్ని పేదల వ్యతిరేక నిర్ణయమని అభివర్ణించిందన్నారు.
పూర్తిస్థారుులో కరెన్సీ ముద్రణ: ఆర్‌బీఐ
ముంబై: ప్రస్తుతమున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్సుల్లో పూర్తి స్థారుులో నోట్లను ముద్రిస్తున్నామని ఆర్‌బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో నోట్లు అందుబాటులో ఉంచామని, వాటిని బ్యాంకుల బ్రాంచీలతో అనుసం ధానించామని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకు లపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో లావాదేవీలు జరపాలని కోరింది.