రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కోటలో పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ శనివారం రాయ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల కోసం 10 ఉచిత హామీ పథకాలను ప్రకటించారు.
గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు నిరుద్యోగులకు రూ.3,000 భృతి, స్కూలు విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, నిరుపేద మహిళలకు నెలకి రూ.1,000, తదితర 10 హామీలతో గ్యారంటీ కార్డును విడుదల చేశారు. త్వరలో రైతులకు హామీ ప్రకటిస్తామని చెప్పారు. ఆప్ మొదటి సారిగా 2018 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను 85 స్థానాల్లో పోటీకి దిగి అన్ని చోట్లా «డిపాజిట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment