న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు.
‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment