బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం
బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం
Published Sun, Mar 19 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
కర్నూలు(అర్బన్): రాష్ట్ర బడ్జెట్‌లో బీసీ కుల వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్‌లో ‘ బీసీలు – బడ్జెట్ ’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర్లకు రూ.25 కోట్లు, విశ్వ బ్రాహ్మణులకు రూ.30 కోట్లు, ఈడిగలకు రూ.35 కోట్లు, సగరులకు రూ.25 కోట్లు, వాల్మీకులకు రూ.25 కోట్లు, మేదరులకు రూ.20 కోట్లు, భట్రాజులకు రూ.15 కోట్లు కేటాయించారన్నారు. తక్కువ జనాభా ఉన్న కాపులకు రూ.1000 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు కేటాయించడం దారుణమన్నారు.
ఓసీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా ? అని వారు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికే తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో బీసీలకు జరిగిన అన్యాయంపై పునః సమీక్షించి రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కులానికి జనాభా ప్రకారం బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. నాయకులు జలం శ్రీను, భాస్కరప్ప, కృష్ణోజిరావు, సర్వేశ్వరబాబు, చిన్న రామయ్య, మల్లికార్జున, రంగమునినాయుడు, డీవీ చంద్ర, పట్నం రాజేశ్వరి, గోగుల సుగుణమ్మ, పోతన, చంద్రికమ్మ, రామకృష్ణ, తిమ్మరాజు, వెంకటస్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement