సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అన్యాయాల్ని సహించేది లేదు.. లంచాన్ని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు.. ప్రజలకు సేవలందించేప్పుడే మంచి అధికారిగా గుర్తింపు ఉంటుంది. మాటలు మాని చేతలు చూపాలి’అని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. జిల్లాకు కలెక్టర్‌గా వచ్చి నెలన్నరవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నానని.. భవిష్యత్ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. జిల్లాను కరప్షన్ ఫ్రీగా చూడాలన్నది లక్ష్యమన్నారు. పేదలకు సాయం చేసేందుకు ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంగా భావించాలని వ్యాఖ్యానించారు.
లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం
వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని అంతా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై దృష్టిసారించాలన్నారు. రూ.15 వేలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అడుగు వేసిందని, గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. ఇప్పుడు లక్ష్యం కేవలం మూడు నెలలే ఉందన్నారు. దీనిపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షించామన్నారు. 2,300 గ్రామాల్లో ఇసుక, రేకులు, మరుగుదొడ్ల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాల్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
జాయింట్ కలెక్టర్ కూడా సిబ్బందికి పలు అంశాల్ని సూచించారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే వెళ్తాయని, వర్క్స్ కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయన్నారు. గుడిసెలున్న ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో మరుగుదొడ్లు కని పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఒకే ప్రాంతంలో పది మరుగుదొడ్లు కట్టించి తాళాలు కూడా లబ్ధిదారుడి చేతికే అందేలా చూస్తున్నామన్నారు.
స్పందిస్తా కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన లబ్ధిని ఎవరైనా దిగమింగితే ఊరుకునేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా