► కలెక్టరేట్ ఆవరణలో కలకలం
► పాఠశాల భవన నిర్మాణ బిల్లు
చెల్లించేందుకు రూ.5వేలు డిమాండ్
► గతంలోనూ రూ.45వేలు తీసుకున్న ఉద్యోగి
నయీంనగర్ : జిల్లా పాలనకు కేంద్రబిం దువు, సాక్షాత్తు కలెక్టర్ విధులు నిర్వర్తించే జిల్లా కలెక్టరేట్‌లోని ఓ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా కలకలం సృష్టించింది. కలెక్టరేట్ ఆవరణలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల నిర్మాణం, బిల్లులు చెల్లింపు ఇతరత్రా వ్యవహారాలు కొనసాగుతారుు.
ఇందులో భాగంగా జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణ పనిని దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆలకుంట్ల దుర్గయ్య పూర్తిచేశాడు. ఈ మేరకు చివరి విడత రూ.26లక్షల బిల్లు కోసం కార్యాలయంలోని ఏఈ ఎం.ఏ.అజీజ్‌ను సంప్రదించాడు. నిధులు విడుదల చేయూలం టూ రూ.5వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. అరుుతే, గతంలో మొదటి, రెండో విడత బిల్లుల కోసం కూడా అజీజ్‌కు రూ.45వేల వరకు ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్గయ్య ఈసారి విసిగి పోయూడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు సంప్రదించగా వారు నిఘా పెట్టారు.
ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఏ ఈ అజీజ్‌కు ఆయన కార్యాలయంలో దుర్గయ్య రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సారుుబాబా ఆధ్వర్యంలో రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు సాంబయ్య, రాఘవేందర్‌రా వు పాల్గొన్నారు. కాగా, ఈనెల 1న ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ.20వేలు తీసుకుంటూ గ్రేటర్ వరంగల్ కాజీపేట సర్కిల్ కార్యాలయంలో టీపీఎస్ రమణయ్య, మేడారం జాతర పనుల్లో భాగంగా చిలుకల గుట్ట వద్ద నిర్మించిన సీసీ రోడ్డు పను ల బిల్లు చెల్లించేందుకు 6వ తేదీన రూ.40వేలు తీసుకుంటూ తా డ్వాయి పీఆర్ ఏఈ జీ.పీ.కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఇలా పది రో జుల్లోనే ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి దొరకడం గమనార్హం.
కలెక్టరేట్‌లో ఇది ఆరో కేసు
హన్మకొండ: గత సంవత్సరం కాలంలో కలెక్టరేట్ ఆవరణలోని కార్యాలయూల్లో లంచం తీసుకుంటున్న ముగ్గు రు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయూంశంగా మారింది. కలెక్టరేట్ ఆవరణలో ఇప్పటి వరకు ఆరు మార్లు ఏసీబీ దాడులు జరగగా ఎనిమిది మంది ఉద్యోగులు పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీకి దొరికిన ఉద్యోగుల వివరాలిలా ఉన్నారుు.
♦ కలెక్టరేట్ సమావేశ మందిరం పైభాగంలో ఉన్న చిన్నమొత్తాల పొదుపు విభాగం ప్రత్యేక తహశీల్దార్‌గా పనిచేసిన పంత్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నుంచి రూ.3వేలు తీసుకుంటూ 2004లో ఏసీబీకి చిక్కారు.
♦ కలెక్టరేట్ ప్రగతి భవనంలోని సాంఘిక సంక్షేమ శాఖ డీఎస్‌డ బ్ల్యూవో వై.గాలయ్య.. వార్డెన్ మునిరుద్దీన్‌కు వైద్య బిల్లుల విషయంలో రూ.4వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు.
♦ సాంఘిక సంక్షేమ శాఖలో గాలయ్య స్థానంలో ఇన్‌చార్జ్‌గా ఉన్న డీఎస్‌డబ్ల్యూవో ప్రభాకర్ కూడా అదే వార్డెన్ మునీరుద్దీన్ పదోన్నతి విషయంలో లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
♦ కలెక్టరేట్‌లోని ‘సీ’ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీల్ తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో 1 జూలై 2015న ఏసీబీ అధికారులు వల పన్నగా ఆయన చిక్కారు.
♦ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డీపీఓ ఈఎస్.నాయక్ కారుణ్య నియూమకం విషయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇంత నగదుతో ఏసీబీకి దొరకడం జిల్లాలో ఇదే ప్రథమం. కాగా, ఇదే అంశంలో రూ.5వేల చొప్పున లంచం తీసుకుంటున్న కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ అలీ, అటెండర్ సారంగపాణికి పట్టుబడ్డారు.
♦ ప్రస్తుతం కలెక్టరేట్ ఆవ ణలోని టీఎస్‌డబ్ల్యూఈఐడీసీ ఉద్యోగి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోనిఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి ఉమామహేశ్వర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం కూడా ఏసీబీకి చిక్కారు. అరుుతే, ఈ దాడులు కలెక్టరేట్ ఆవరణలో జరగలేదు.