
రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం: చాడ
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం రాజకీయ అవసరాలకు అనువుగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం రాజకీయ అవసరాలకు అనువుగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కొత్త రైళ్లు, లైన్లు, బోగీలకు నిధులు కేటాయించకుండా కేంద్రం వివక్ష చూపిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు.