కంచే చేనును మేస్తే?
న్యాయ నియామకాలలోని, న్యాయ వితరణలోని అన్యాయాల గురించిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా?
మన న్యాయవ్యవస్థపైన ఫిర్యాదులను, దాని చర్య లవల్ల కలిగే కష్టాలపైన విన్నపాలను, ఫలానా సౌక ర్యం లేదని చెప్పుకునే మహజర్లను స్వీకరించి, అందుకున్నామని రసీదు ఇచ్చి, ఫలానా కాలపరిమి తిలోగా ఆ విషయాన్ని వింటామని అభయమిచ్చి... అలాగే విని వాటిని తిరస్కరించామనో, పరిష్కరిస్తామనో చెప్పే విధా నంగానీ, ప్రక్రియగానీ, యంత్రాంగంగానీ మనకు లేదు. మన సుపరిపాలనలో ఇదొక అద్భుతం. మన న్యాయమంత్రిత్వ శాఖకు వెల్లువెత్తే ఫిర్యాదులలో కోర్టుల్లో అవినీతి గురించి 15 శాతం, అసమంజ çసమైన తీర్పులని 10 శాతం, తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం గురించి 47 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఇతర అన్ని విభాగాల్లో ఉన్నట్టుగా, న్యాయవ్యవ స్థలో కష్టాలు చెప్పుకునే విధానం, ఫిర్యాదులు విని పరిష్కరించే విధానం దాదాపు మృగ్యం కావడం తీవ్ర లోపమని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వం తమకు వచ్చిన ఫిర్యాదులను న్యాయవ్యవస్థకు పంపుతూ ఉంటుంది. కాని వాటికి ప్రతిస్పందన చాలా అరుదు. ఫిర్యాదుదారుల బాధలను పరిష్క రించకపోయినా, వారి ఫిర్యాదులను పరిశీలించి పలానా కారణాల వల్ల మీ దరఖాస్తు చెత్తబుట్టలో వేస్తున్నామని చెప్పే దిక్కు కూడా లేకపోతే ఎట్లా? ఇదేనా న్యాయం? సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండాలి కదా.
జడ్జిల నియామక ప్రక్రియపై తెరలు పూర్తిగా తొలగించడాన్ని జస్టిస్ మదన్ బి లోకుర్ వ్యతిరేకించారు. అంతా బయట పెడితే కొందరు న్యాయ మూర్తులపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలు వారి భవి ష్యత్తును దెబ్బతీస్తాయని, ఆ పదవికి పరిశీలనదాకా వచ్చిన వ్యక్తుల ప్రైవసీని కొంతైనా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నియామకాల గురించి బయటకు ఏమీ పొక్క కుండా ఉండే గట్టి తెరలున్నాయనీ, ఇందువల్ల పలుకుబడి ఉన్నవారికే రాజ్యాంగ న్యాయస్థానాల పదవులు దక్కే లాబీయింగ్‌కు ఆస్కారం ఏర్పడిం దని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. జస్టిస్ కురియన్, కొలీజియం నియంతృత్వంగా వ్యవహరించే వీలుం దన్నారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) కేసు విచారణ జరు గుతుండగా... మాథ్యూ నెడుంపర అనే వ్యక్తి కొలీ జియం ద్వారా జడ్జిల పుత్రరత్నాలకు, పెద్ద న్యాయ వాదుల సుపుత్రులకు అవకాశాలు మెండుగా దక్కి, అర్హులై ఆసక్తి ఉన్నవారికి జడ్జిలుగా దరఖాస్తు పెట్టు కునే అవకాశం కూడా దక్కలేదని వాదించారు.
బంధుప్రీతిని పెంచిపోషించే విధానాలను తొలగించేందుకే ఎన్‌జేఏసీని ప్రభుత్వం ప్రతి పాదించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా ప్రమాణ పత్రాలలో తమ వివరాలు ప్రక టించిన రీతిలో జడ్జిలు కూడా ఆర్టికల్ 124(6) కింద తమ వ్యక్తిగత ఆస్తిపాస్తులు తదితర వివ రాలను ప్రమాణ పూర్వకంగా ప్రకటించాలని, అవా స్తవాలు చెబితే మహాభియోగం ద్వారా కాకుండా సులభరీతిలో జడ్జిలను తొలగించే వీలుండాలని పౌరసమాజం నుంచి ఒక సూచన వచ్చింది. వినే వారెవరయినా ఉన్నారా?
తెలుసుకునే హక్కులాగే ప్రైవసీ హక్కు కూడా జీవించే హక్కులో భాగమే తప్ప ప్రాథమిక హక్కు కాదని జస్టిస్ లోకుర్ అన్నారు. కనుక పార దర్శకతకు, గోప్యతకు మధ్య సరైన సమతుల్యం ఉండాలన్నారు. ఎన్‌జేఏసీలో పూర్తి పారదర్శకత ఉంటుందని సమతుల్యం లేనట్టేననీ అన్నారు. అసలు కొలీజియంలో ఏం జరిగిందో ఎవరూ తెలు సుకునే వీల్లేదని, జనానికే కాదు చరిత్రకు కూడా ఆ వివరాలు అందబోవని, జడ్జిలుగా నియమితులైనా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన దురదృష్ట వంతులకు కూడా రికార్డులు దొరకవని చలమేశ్వర్ తమ తీర్పులో వివరించారు. ఇటువంటి వ్యవస్థ ప్రజల్లో విశ్వాసం పెంచడం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కొలీజి యంలో సర్వసమ్మతి ఉంటే ‘నీకది నాకిది’ అనే ఏర్పాటుకు దారి తీస్తుందనీ, అందువల్ల అన్యాయ మైన నియామకాలు జరిగి, న్యాయార్థుల పట్ల ప్రమాదకరమైన ప్రమాణాలను పాటించడం జరిగి న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన చెందారు. అంతేకాదు, లాబీయింగ్ వల్ల భజన సంస్కృతి పెరిగిపోయి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిం చారు.
అర్హులను వదిలేసి, సొంత కారణాలమీద, సామాజిక జాతీయ వాస్తవాలకు సంబంధం లేకుండా కొందరిని నియమించడం, మరికొందరి నియామకాన్ని కావాలని జాప్యం చేయడం, కొంద రికే ప్రయోజనం చేకూర్చడం, అనుయాయులు కాని వారికి అవకాశాలను దూరం చేయడం, అంతేవాసు లను ఆదరించడం... ప్రతిభలేని వారి నియామకా లకు దారితీస్తున్నాయని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు.
అయితే నియామకాధికారాలను రాజకీయ నాయకులతో పంచుకోవడం వివేకవంతమైన చర్య అనడంలో ఇబ్బందులున్నాయని ప్రధాన న్యాయ మూర్తి జేఎస్ కేహార్ అన్నారు. భారతదేశంలో పౌర సమాజం తగినంతగా పరిపక్వత చెందలేదని, కనుక న్యాయమూర్తుల నియామకంలో ఏవైనా లోపాలు జరిగితే అవి దేశాన్ని సంక్షోభంలోకి పడదోస్తాయని ఆందోళన చెందారు. అయితే ఇప్పటి నియామక విధానాల్లో జడ్జిలయిన వారు ఏ విధంగా సంక్షోభం సృష్టిస్తున్నారో మనకు దృష్టాంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. న్యాయ నియామకాలలోని అన్యా యాలు, న్యాయ వితరణలోని అన్యాయాల గురిం చిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా?
(సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/VS/A/2014/000989– Sఅ కేసులో 3.5.2017 సీఈసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్