Justice Madan b lokur
-
TG: పవర్ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ లోకూర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది. జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. -
న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే.. రాజ్యాంగమే సర్వోన్నతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు, పార్లమెంట్ కంటే రాజ్యాంగమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. ఓ లీగల్ వెబ్సైట్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘పార్లమెంటు చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనే తనిఖీ బాధ్యతను రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ వల్ల న్యాయవ్యవస్థకు స్వతంత్రత పోతుందనే భావనతో దాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించారని భావించరాదు’’ అని చెప్పారు. నిర్దిష్ట చట్టం, లేదా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిన్నాయా, లేదా అనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నింటిలోనూ పార్లమెంటే అత్యున్నతమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జస్టిస్ లోకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ముమ్మాటికీ తప్పును సరిదిద్దుకోవాలి
చాలామంది మాట్లాడటానికి భయపడుతున్నప్పుడు, మాజీ సీనియర్ న్యాయమూర్తులు కొందరు తీవ్రమైన విమర్శలు చేయడానికి సాహసించారు. బహుశా వారు వెరపులేని విమర్శకునికి అనుకూలంగా గొంతెత్తడం కోసం తమ సంయమనాన్ని కూడా అలా పక్కన పెట్టేయడానికి... వారి చైతన్యమే ప్రేరేపించినట్లున్నది. అలా స్పందించిన వారిలో ముగ్గురి గురించి ఈరోజు నేను మాట్లాడదలిచాను. వీరిలో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు కాగా, మూడో వ్యక్తి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాడ్ కేసులో తీర్పును ప్రకటించిన తర్వాత, ఆమెను అరెస్టు చేయడమే న్యాయస్థానం ఉద్దేశమైతే ‘ఇక స్వర్గాధిపతులే మనకు సహాయపడతారు’ అని జస్టిస్ మదన్ లోకుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి, విధానాలను దుర్వినియోగపర్చే ప్రక్రియలో పాల్గొన్న వారందరినీ చట్టం ప్రకారం విచారించా’లని ఆ తీర్పులో ఉన్న ఒక వాక్యం ఆయన్ని నిస్పృహకు గురి చేసింది. ఆ తీర్పు చెప్పిన న్యాయ మూర్తులు ఇక ఏమాత్రం జాగు చేయకుండా, ప్రత్యేకంగా సమావేశమై తీస్తా అరెస్టు తమ ఉద్దేశం కాదని ప్రకటన చేయాలని జస్టిస్ మదన్ లోకుర్ చెప్పారు. ‘కోర్టుకు సెలవులు కాబట్టి వారు ఢిల్లీలో లేనట్లయితే, తీస్తా సెతల్వాడ్‌ను అరెస్టు చేయడం తమ ఉద్దేశం కాదంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కి ఆదేశం పంపాల’ని ఆయన సూచించారు. ‘తప్పుడు కేసు పెట్టినందుకు ఆమెను విచారించాలని మీరు చెప్పాల్సిన అవసరం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘వేలాది తప్పుడు కేసులను కోర్టుల్లో నమోదు చూస్తూనే ఉన్నారు. మరి వారందరినీ పట్టుకుని విచారించారా?’ అని ఆయన నిలదీశారు. ‘తప్పుడు కేసులను లెక్కకు మించి పెడుతున్న పోలీసుల విషయం ఏమిటి? ఇలా చెప్పడం ద్వారా కోర్టు తన విలువను తాను క్షీణింప చేసుకుంది. తీస్తాను అభిశంసించిన రోజు నిజంగా చీకటి దినమే అంటే అంగీకరిస్తాను. సుప్రీం కోర్టు ఇలా వ్యవహరి స్తుందని ఎవరూ ఊహించలేదు’ అని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ జుబెయిర్ కేసుపై జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానిస్తూ దిగువ కోర్టుపై మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతడిని టార్గెట్ చేశారని భావిస్తున్నాను, ఎక్కడో తప్పు జరుగుతోంది’ అనేశారు. పోలీసు దురభిమానానికి జుబెయిర్ కేసు చక్కటి ఉదాహరణగా జస్టిస్ గుప్తా అభివర్ణించారు. ‘కచ్చితంగా దాంట్లో సందేహించాల్సిన పనేలేదు’ అన్నారు. ‘అతడిని ఎందుకు కస్టడీలోకి తీసు కున్నారని నాకు కాస్త ఆందోళనగానూ, అయోమయం గానూ ఉంది’ అని జస్టిస్ గుప్తా పేర్కొన్నారు. ‘ఆ సంఘటన 2018 మార్చిలో జరిగింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. అతడి ట్వీట్ రెండు మతాల మధ్య ఏదైనా వివాదానికి దారి తీసినట్లు సంకేతాలు కూడా లేవు’ అంటూ జస్టిస్ గుప్తా స్వరం పెంచారు. ‘న్యాయస్థానం అతడికి బెయిల్ ఇవ్వడాన్ని కూడా తిరస్కరించిందన్న వాస్తవం నన్ను మరింత భయపెట్టింది. నాలుగేళ్లు అతడిని మీరు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆ నాలుగేళ్లూ ఎలాంటి హానికర ఘటనా జరగ లేదు కదా. కానీ ఇప్పుడు అతడిని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారని న్యాయమూర్తి పోలీసులను కనీసంగా కూడా ప్రశ్నించలేదెందుకు?’ అన్నారు. బహుశా ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో కరకుగా వ్యవహరించింది మద్రాస్, ఢిల్లీ హైకోర్టుల్లో పనిచేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎపీ షా కావచ్చు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌ని ధిక్కరించినందుకు జహంగిరి పురిలోని ముస్లిం ఇళ్లను కూల్చివేయడం గురించి ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు న్యాయం చేయాలనుకుంటే అది తప్పకుండా తగిన చర్యలు తీసుకుని, తప్పు చేసిన అధికార్లను జైలుకు పంపించాలి.’ అంతకుమించి న్యాయ స్థానం ‘యధాతథ స్థితిని’ పునరుద్ధరించి, ‘పరిహారాన్ని నిర్ణయించాలి.’ అలాగే ‘ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న క్యాంపెయిన్ని స్పష్టంగా చూస్తున్నాను’ అని జస్టిస్ షా ఖరాఖండీగా చెప్పారు. దీనికి గాను ‘అత్యున్నత స్థాయి నుంచి క్షమాపణ’ రావాలని ఆయన కోరారు. ఢిల్లీ కేసుకు సంబంధించినంతవరకు హోమ్ మంత్రిని ఉద్దేశించే తానిలా అంటున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా, విద్వేష ప్రసంగం, మతపరమైన హింస పట్ల ప్రభుత్వ మౌనాన్ని జస్టిస్ షా తీవ్రంగా ప్రశ్నించారు. అత్యున్నత స్థాయిలో ఉంటున్నవారు దీనిపట్ల పూర్తి మౌనం వహించడం చాలా ఆందోళనకరమైన విషయం అన్నారు. ఈ మొత్తం వ్యవహారం లక్ష్యం... ప్రజల్ని మరింతగా వేరు చేయడం, మరిన్ని ఉద్రిక్తతలను సృష్టించడమే అనడంలో సందేహమే లేదని చెప్పారు. ఇక ఢిల్లీ పోలీసుల విషయానికి వస్తే ‘వారు పూర్తిగా రాజీపడిపోయారు, సంపూర్ణంగా పక్షపాత దృష్టితో ఉంటున్నార’ని జస్టిస్ షా చెప్పారు. ఆయన ముగింపు మరింత తీవ్రంగా ఉంది. ‘ఇక్కడ నేను స్పష్టంగా ఎలక్టోరల్ నిరంకుశత్వాన్ని చూస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి నాయకులు... ప్రజాస్వామిక సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్, మానవ హక్కుల కమిషన్, మీడియా కూడా రాజీపడిపోయాయ’ని జస్టిస్ షా చెప్పారు. ఈ ముగ్గురు న్యాయమూర్తుల్లో ఏదో ప్రత్యేకత, నిస్సంకోచత్వాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి భ్రమా రాహిత్యాన్నీ, ధిక్కార స్వరాన్నీ వ్యక్తం చేసిన ప్రముఖ వ్యక్తులు వేరే ఎవరైనా ఉంటారని నేను భావించను. అందుకే ఈ ముగ్గురు మన చైతన్య స్వరాలు అని నేను నమ్ముతున్నాను. మనలో చాలామంది మౌనంగా ఉంటున్న తరుణంలో వారు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇందుకు వారికి మనం మహాభినందన తెలియజేయాలి. (క్లిక్: వివక్షే ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టు) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించకపోవడంపై సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మదన్.బి.లోకూర్ స్పందించారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ రాజేంద్ర మీనన్‌ల నియామకంపై 2018, డిసెంబర్ 12న కొలీజియం చేసిన సిఫార్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న సమావేశమైన కొత్త కొలీజియం జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను తొలగించి జస్టిస్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిల పేర్లను సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుకు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ది లీఫెల్ట్ న్యూస్‌పోర్టల్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ జ్యుడీషియరీ అనే కార్యక్రమంలో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. ‘2018, డిసెంబర్ 12న కొలీజియం సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. కానీ డిసెంబర్ 12 నుంచి 2019, జనవరి 10 మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పలేను. కానీ మేము ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం నన్ను నిరాశ పరిచింది. అయితే ఆ తీర్మానాన్ని వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదో నాకు అనవసరం’ అని వ్యాఖ్యానించారు. విశ్వాసఘాతకానికి పాల్పడలేను.. కొలీజియం నిర్ణయాలపై స్పందిస్తూ.. ‘కొలీజియంలో నిర్ణయాలను పరస్పరం నమ్మకంతో రహస్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బయటపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడలేను. కానీ ఈ సమావేశంలో మేం కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కొలీజియం భేటీలో ఆరోగ్యకరమైన చర్చ సాగింది. అందులో సమ్మతి, అసమ్మతి రెండూ ఉన్నాయి’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ.. ‘జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతమాత్రాన రుషిలా, ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దూరం పాటించాలంటే అర్థం ఏంటి? ప్రధాని మోదీ ముఖాన్ని కూడా చూడకూడదంటున్నారా? సాధారణ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం తప్పుకాదు. ఇలాంటి కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవడం మంచిదే‘ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని తాను భావించడం లేదని లోకూర్ అన్నారు. విధివిధానాలు రూపొందించాలి కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా తన పరిధి దాటి వ్యవహరించిందని జస్టిస్ లోకూర్ తెలిపారు. కొలీజియం తీసుకునే నిర్ణయాలను నిర్ణీత గడువులోగా అమలుచేసేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ గడువులోగా కేంద్రం నుంచి జవాబు రాకుంటే ఆమోదం లభించాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొలీజియంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ ఏఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించే విషయంలో కేంద్రం ఫైలును కొన్నినెలల పాటు తనవద్దే అట్టిపెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ, కేంద్రానికి ఇలా ఫైళ్లను తొక్కిపెట్టే అధికారం లేదన్నారు. భవిష్యత్‌లో కేంద్రం ఇచ్చే ఎలాంటి బాధ్యతలను తాను స్వీకరించబోనని చెప్పారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను ప్రతిపాదించిన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ లోకూర్.. గత డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు. -
జస్టిస్ లోకూర్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్.బి.లోకూర్ ఆదివారం పదవీవిరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్ లోకూర్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు డిసెంబర్ 14నే జస్టిస్ లోకూర్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఆదివారంతో ఆయన పదవీకాలం పూర్తయింది. కేసుల కేటాయింపు విషయంలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ గొగోయ్, అప్పటి జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో కలిసి లోకూర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్ 31న జన్మించిన లోకూర్, 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లోకూర్ పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. -
పోలవరంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలవరం విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తమ వాదనలను త్రిసభ్య ధర్మాసనం ఎదుట వినిపించాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 50 మీటర్ల వెడల్పుతో 60 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నారని, దీంతో చాలాప్రాంతం ముంప్పునకు గురవుతుందని ఒడిషా ప్రభుత్వం తన అభ్యంతరాలను సుప్రీం దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే తమకు కొంత సమాచారం కావాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టును కోరాయి. తమకు ఏ సమాచారం కావాలో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం కేసు ఒక అంతు లేని కథ అని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను జనవరి మొదటివారానికి కోర్టు వాయిదా వేసింది. -
దిద్దుబాటే శ్రేయస్కరం
సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు అత్యంత అనుభవశాలురైన న్యాయమూర్తులు మీడియా సమక్షంలో హృదయావిష్కారం చేసిన ఘట్టం చరిత్రాత్మకమైనది. శుక్రవారంనాడు ఢిల్లీలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియాతో మాట్లాడటమే అపూర్వమైన అంశం అయితే వారు అందించిన సందేశం దిగ్భ్రాంతికరమైనది. జస్టిస్ లోధా, జస్టిస్ ఠాకుర్ వంటి మాజీ ప్రధాన న్యాయమూర్తులూ, మాజీ సొలిసిటర్ జనరల్ సోలీ సొరాబ్జీ వంటి న్యాయకోవిదులూ ఈ పరిణామం దురదృష్టకరమైనదనీ, అవాంఛనీయమైనదనీ అభివర్ణించారు. న్యాయమూర్తులు చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయనీ, న్యాయవ్యవస్థను వేధిస్తున్న సమస్యలను వెల్లడిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయం కూడా ఉంది. సుప్రీంకోర్టులో అనుభవం రీత్యా, పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా తర్వాత అగ్రగణ్యులైన నలుగురు న్యాయమూర్తులు సంప్రదాయం, నియమావళి పేరుతో తమను కట్టిపడవేసిన బంధనాలను తెంచుకొని, తెగించి ప్రజల ముందుకు వచ్చారంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, న్యాయవ్యవస్థ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను ప్రజలే కాపాడుకోవాలనీ వారు చెప్పారంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తిని కలసి సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగింది. బహుశా రాష్ట్రపతిని కలసి ఆయనకు సమస్యను నివేదించి ఉంటే ప్రయోజనం ఉండేదేమో! నలుగురూ నిష్ణాతులే ఇప్పుడు వివాదం సృష్టించడం వల్ల ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేదు. పైగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చే అక్టోబర్ 2న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అలంకరించే అవకాశం ఉన్న రంజన్ గొగోయ్ తక్కిన ముగ్గురితో గొంతు కలపడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టదాయకంగా పరిణమించవచ్చు. జస్టిస్ చలమేశ్వర్ పదవీ కాలం ఈ యేడాది జూన్ 22తో ముగుస్తుంది. జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29 వరకే పదవిలో ఉంటారు. జస్టిస్ లోకుర్ సైతం డిసెంబర్ 30న పదవీ విరమణ చేయవలసి ఉంది. నెలా, రెండు నెలల్లో పదవీ విరమణ చేయబోయే వారిని ప్రధాన న్యాయమూర్తి పీఠంపైన కూర్చో»ñ ట్టే సంప్రదాయం లేదు కనుక 2019 నవంబర్ 17 వరకూ పదవీకాలం కలిగిన గొగోయ్‌కి ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ముగ్గురు సహచరులతో కలసి తిరుగుబాటు చేయడం నిజంగా సాహసమే. జస్టిస్ చలమేశ్వర్ చెప్పినట్టు, భావితరాలు తమను తప్పుపట్టకుండా తగిన సమయంలో ప్రశ్నించవలసిన బాధ్యతను నెరవేర్చామని గొగోయ్ సైతం భావిం చారు. జాతి రుణం తీర్చుకుంటున్నామని స్వయంగా చెప్పారు. ఇది ఎంతో గంభీ రమైన విషయం కాకపోతే అంత బరువైన మాటలు న్యాయమూర్తులు ఉపయోగించేవారు కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండే నైజం గొగోయ్‌కి ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ను కోర్టు ధిక్కార నేరంపైన జైలుకు పంపించిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగపీఠంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. చీఫ్ జస్టిస్ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ (నెంబర్ 2) నిష్కర్షగా వ్యవహరించి వివాదాలకు కేంద్రమైనారు. న్యాయమూర్తుల నియామకం కొలీజియం ద్వారా కాకుండా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (నేషనల్ జుడిషియల్ అపాయంట్మెంట్స్ కమిషన్–ఎన్జెఎస్సి) ప్రమేయంతో జరగాలని భావించి మెజారిటీ తీర్పుతో విభేదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగపీఠం 2015 డిసెం బర్ 16న వెలువరించిన తీర్పులో తన అసమ్మతిని జస్టిస్ చలమేశ్వర్ (1:4) నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో 66(ఎ) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పడం ద్వారా భావ ప్రకటనాస్వేచ్ఛకు దన్నుగా నిలిచారు. కొలీ జియం వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ పారదర్శకంగా ఉండాలని వాదించే ప్రముఖులలో చలమేశ్వర్ ప్రథములు. సీనియారిటీ ప్రకారం నాలుగో స్థానంలో ఉన్న లోకుర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా కూడా ఉన్నారు. రాజకీయవాదులు మతం పేరుతో ఓట్లు అడగరాదంటూ ఉత్తమమైన తీర్పు చెప్పిన న్యాయమూర్తులలో ఆయన ఒకరు. అయిదో స్థానంలో ఉన్న కురియన్ త్రిపుల్ తలాఖ్ చెల్లనేరదని చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి. ఈ నలుగురూ మీడియాతో మాట్లాడటాన్ని తప్పు పట్టినవారు సైతం వారి రుజువర్తనం, నిజాయితీ, న్యాయశాస్త్ర పరిజ్ఞానం, ధర్మనిరపేక్షత, నిబద్ధత పట్ల లవలేశమంత సందేహం వెలిబుచ్చలేదు. ముదిరిన విభేదాలు కడచిన రెండు మాసాలలో సంభవించిన కొన్ని పరిణామాలు ఒకానొక అసాధారణ పరిస్థితిని సృష్టించాయి. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు నడిపే మెడికల్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కుంభకోణంపైన రగిలిన వివాదం. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసి ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేసింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉన్నట్టు పిటిషనర్లు అన్యాపదేశంగా ఆరోపించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్)ను పురస్కరించుకొని ఈ కేసు విచారణకు ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ని నెలకొల్పుతూ జస్టిస్ చలమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని, చలమేశ్వర్ ఏర్పాటు చేసిన బెంచ్‌ని రద్దు చేసి ఆయన స్వయంగా తన ఆధ్వర్యంలోనే ఒక బెంచ్‌ని నియమించారు. ‘చీఫ్ జస్టిస్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని ఏ కేసు ఎవరు విచారించాలో నిర్ణయించే అధికారం ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందంటూ 1998లో రాజ్యాంగపీఠం ఇచ్చిన తీర్పు నెలకొల్పిన సంప్రదాయాన్ని జస్టిస్ దీపక్‌మిశ్రా గుర్తు చేశారు. నిజానికి చీఫ్ జస్టిస్ సమానులలో ప్రథముడే (ఫస్ట్ ఎమాంగ్ ఈక్వెల్స్) కానీ అందరి కంటే అధికుడు కారని నలుగురు న్యాయమూర్తులు విడుదల చేసిన లేఖలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. తక్కినవారంతా సుప్రీం కోర్టు న్యాయమూర్తులైతే (జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు) చీఫ్ జస్టిస్ దేశానికి ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా). అంతమాత్రాన విశేషాధికారాలను వినియోగించే క్రమంలో పక్షపాతం కానీ స్వప్రయోజనాలు కానీ ఉన్నట్టు కనిపిస్తే ప్రధాన న్యాయమూర్తిని సైతం ప్రశ్నించే అధికారం న్యాయమూర్తులకూ, న్యాయవాదులకూ, సామాన్య పౌరులకూ ఉంటుంది. సర్వసాధారణంగా ఏదైనా కేసు విచారించేందుకు నియమించిన పీఠాన్ని విస్తరించాలంటే కొత్తగా కొందరు న్యాయమూర్తులను చేర్చుతారు కానీ ఉన్నవారిని తొలగించరు. ఉదాహరణకు ఇద్దరు న్యాయమూర్తులున్న బెంచ్‌ని విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఐదుగురు సభ్యుల బెంచ్గా విస్తరించాలంటే కొత్తగా ముగ్గురిని నియమిస్తారు కానీ, మొదటి ఇద్దరిలో ఎవ్వరినీ తొలగించరు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. మెడికల్ కుంభకోణం కేసు విచారించడానికి జస్టిస్ మిశ్రా నియమించిన బెంచ్‌లో జస్టిస్ చలమేశ్వర్ లేరు. రెండు, గుజరాత్ పరిణామాలకు సంబంధించి సోహ్రాబుద్దీన్ అనే వ్యక్తిని ‘బూటకపు ఎన్ కౌంటర్’ చేశారనే ఆరోపణను విచారిస్తున్న సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతి కేసు. నాగపూర్‌లో తన సహచరుడి కుమార్తె వివాహానికి వెళ్ళి అనుమానాస్పద పరిస్థితులలో 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో లోయా మరణించారు. ఈ కేసు ప్రారంభంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిందితుడు. అనంతరం షా పేరు నిందితుల జాబితా నుంచి తొలగించారు. లోయా మరణానికి సంబంధించిన కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులో నడుస్తుంటే దాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఒక పిటిషన్ ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తులకు కాకుండా సీనియారిటీ జాబితాలో పదో స్థానంలో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కి పోస్ట్ చేశారు. లోయా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌నూ, ఇతర పత్రాలను సుప్రీం కోర్టులో జనవరి 15 నాడు సమర్పించాలని ఆదేశాలు వెళ్ళాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కౌన్సెల్ నిశాంత ఆర్ కర్నేశ్వార్కర్కు సుప్రీంకోర్టు పురమాయించింది. సాధారణంగా హైకోర్టులో విచారించవలసిన అంశాలు సుప్రీంకోర్టుకు వస్తే ముందు హైకోర్టుకు వెళ్ళండి అని పిటిషనర్లను న్యాయమూర్తులు ఆదేశిస్తారు. లోయా కేసు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. పైగా బొంబాయ్ లాయర్ల సంఘం ఈ కేసు విచారణ బొంబాయ్ హైకోర్టులోనే జరగాలని కోరుతోంది. ఈ సంఘం తరఫున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్టు బీఆర్ లోన్ తరఫున ఇందిరా జైసింగ్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ వకీలుగా వరీందర్ కుమార్ శర్మ మరో పిటిషన్ వేశారు. వీరందరి ప్రార్థనా ఒక్కటే. ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించవద్దు, బొంబాయ్ హైకోర్టులో విచారణ కొనసాగించాలి. ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసును సీనియర్ల నాయకత్వంలోని బెంచ్‌కి అప్పచెప్పకుండా జూనియర్‌కు పంపించడం వివాదాస్పదం అయింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ సమానులే. సీనియర్, జూనియర్ అనే భేదం లేదు. కానీ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న కేసులు సీనియర్లకు కేటాయించడం రివాజు. ప్రధాన న్యాయమూర్తిదే బాధ్యత ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారక ముందే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సోమవారం నుంచి తాము యథావిధిగా సుప్రీంకోర్టుకు వెడతామని జస్టిస్ చలమేశ్వర్ చెప్పారు. శనివారంనాడు సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల సమావేశాలు జరిగాయి. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయమూర్తులు మీడియాను కలుసుకోవడాన్ని తప్పు పట్టింది. వివాదం పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. లోయా కేసులో క్షుణ్ణంగా విచారణ జరగాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం అనవసరమైన రాజకీయ జోక్యమంటూ విమర్శించింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలన్న ఎన్డీఏ ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి వైఖరిని స్వాగతించింది. న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడటం పట్ల బార్ అసోసియేషన్ అభ్యంతరం చెప్పలేదు కానీ పరిస్థితి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. లోయా కేసు సహా అన్ని ‘పిల్’లనూ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ఆధ్వర్యంలోని బెంచ్లే విచారించాలని బార్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం తక్షణం చేయవలసిన పని ఒకటి ఉంది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం చేస్తుందని నిర్ణయించిన అనంతరం ఆ నిర్ణయం అమలు జరగాలంటే సుప్రీంకోర్టుకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఒక ఒప్పంద పత్రం (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్–ఎంఓపీ) ఉండాలి. ఈ పత్రాన్ని తయారు చేయడంలో సహకరించడానికి అటార్నీ జనరల్ ముకుల్ రోహట్గీ నిరాకరించినప్పుడు ‘మీరు అటార్నీ జనరల్ దేశానికా లేక ప్రస్తుత ప్రభుత్వానికా?’ అంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ఎద్దేవా చేశారు. ఎంఓపీని సుప్రీంకోర్టు కేంద్రానికి పంపి నెలలు గడిచిపోతున్నా కేంద్రం ఆమోదం తెలపలేదు. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తిగా తనను నియమించడానికి నిరాకరించారంటూ లూత్రా అనే న్యాయవాది వేసిన పిల్పైన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన బెంచ్ తీర్పు ఇస్తూ ఎంఓపీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ఎంఓపీ లేకపోవడం వల్ల న్యాయమూర్తుల నియామకాలు నిలిచిపోయి కోర్టులలో ఖాళీలు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమైతే, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే న్యాయమూర్తులు తమ వంతు కర్తవ్యం నెరవేర్చినట్టే. ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా పెద్దమనసుతో నిర్వహించాలి. న్యాయమూర్తులనూ, న్యాయవాదులనూ కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత ప్రధానంగా ఆయనదే. కె. రామచంద్రమూర్తి -
అక్కడ అంతా సమానులే
ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ ((2017) 1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిసెస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకుర్, కురియన్ జోసెఫ్ కలసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు రెండు మాసాల క్రితం రాసిన లేఖ పూర్తి పాఠం. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన న్యాయ సంబంధమైన కొన్ని ఆదేశాలు ‘న్యాయ వ్యవస్థ నిర్వహణ మీద ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించాయి’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులలో పైన పేర్కొన్న ఆ నలుగురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ ఆ లేఖ– గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగారికి! అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న కొన్ని ఆదేశాలు మొత్తం న్యాయ వ్యవస్థ పని తీరు మీద, హైకోర్టుల స్వాతంత్య్రం మీద, వీటితో పాటు గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థ నిర్వహణ మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ అంశాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకు రావడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆందోళనతో, తీవ్ర క్షోభతో ఈ లేఖ రాశాం. కలకత్తా, బొంబాయి, మద్రాసు హైకోర్టులు మూడింటిని ప్రత్యేక అధికారాలతో నెలకొల్పిన నాటి నుంచి న్యాయ వ్యవస్థలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఆ మూడు హైకోర్టులు ఆవిర్భవించిన తరువాత దాదాపు వందేళ్లకు రూపుదిద్దుకున్న ఈ అత్యున్నత న్యాయస్థానం ఆ ఆచారాలూ, సంప్రదాయాలనే స్వీకరించింది. ఈ సంప్రదాయాలన్నీ ఆంగ్లో– సాక్సన్ న్యాయ సిద్ధాంత అధ్యయనం, అమలు ద్వారానే నెలకొన్నాయి. ఒకసారి స్థిరపడిన ఈ సిద్ధాంతాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ (జాబితా)లో, ఆ రోస్టర్‌ను నిర్ణయించడంలో అధికారం కలిగిన పెద్ద అనే హోదా దక్కించుకున్నారు. లావాదేవీలు జరిపేందుకు అవసరమైన కోర్టుల సంఖ్య, కోర్టులు నడిచేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఏర్పాట్లు, సుప్రీంకోర్టులో ధర్మాసనం/సభ్యుని నిర్ణయం వంటివాటికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యులు. రోస్టర్‌ను రూపొందించడంలో, వ్యాజ్యాన్ని సభ్యులకు/ధర్మాసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక హక్కును గుర్తించడమనేది కూడా సంప్రదాయమే. ఇది కోర్టు లావాదేవీలు సమర్థంగా, క్రమపద్ధతిలో సాగేందుకు ప్రవేశపెట్టిన సంప్రదాయమే కానీ, దీనితో ప్రధాన న్యాయమూర్తి న్యాయ నిర్వహణ పరంగా, వాస్తవంగా మిగిలిన తన సహచరుల కంటే అధికునిగా గుర్తించడానికి కాదు. న్యాయ శాస్త్ర వ్యవహారాలలో స్థిరపడిన సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అంటే, తనతో సమ స్థాయిలో ఉన్నవారిలో మొదటివారు మాత్రమే అవుతారు. అంతకు మించి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే రోస్టర్ నిర్ధారణలో కూడా ప్రధాన న్యాయమూర్తికి మార్గదర్శకంగా ఉండే విధంగా బాగా స్థిరపడిన, కాల పరీక్షకు నిలిచిన సంప్రదాయాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ వ్యాజ్యానికి సంబంధించిన ధర్మాసనాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన సంప్రదాయాలను పాటించాలి. పైన పేర్కొన్న ఈ సిద్ధాంతం సహజ పరిణామం ఏమిటంటే బహుళ సభ్యులు కలిగిన ఒక చట్ట బద్ధ వ్యవస్థలో ఉన్నవారు, ఈ ఉన్నత న్యాయస్థానం సభ్యులతో సహా– ఒక ప్రత్యేక వ్యాజ్యం కోసం నియమించిన ధర్మాసనం మీద తమకు తాము ఆధిపత్యం తెచ్చుకోకూడదు. ధర్మాసనం కూర్పులో గానీ, సంఖ్య విషయంలో గాని నిర్ధారించిన రోస్టర్ మేరకు జరిగిన నిర్ణయం మీద వారు ఆధిపత్యం చేయలేరు. ఈ రెండు నియమాలను అధిగమించినట్టయితే వికృతమైన, అవాంఛనీయమైన పరిణామాలు ఎదురవుతాయి. వ్యవస్థ పరిపూర్ణత గురించి సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి సంక్షోభం గురించి మౌనం వహించడం కూడా అలాంటి పలాయనం ఫలితమే కాగలదు. ఇటీవలి కాలంలో ఈ రెండు నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండే పరిస్థితి లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తి అప్పగించిన వ్యాజ్యం ద్వారా జాతికి, వ్యవస్థకి విస్తృత స్థాయి పరిణామాలు ఎదురైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఆ కేసుల కోసం ధర్మాసనాలలో నియమించిన ‘వారి సమక్షం’గురించి ఎలాంటి హేతుబద్ధత కనిపించదు. ఎంత మూల్యం చెల్లించి అయినా ఇలాంటి దాని నుంచి రక్షణ కల్పించాలి. వ్యవస్థను ఇబ్బందికి గురి చేయరాదన్న ఉద్దేశంతోనే మేం పూర్తి వివరాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘన కారణంగా వ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొంతమేర దెబ్బతిన్నది. పైన పేర్కొన్న ఈ నేపథ్యంలోనే ఆర్.బి. లూథ్రా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అక్టోబర్ 27, 2017న ఇచ్చిన ఆదేశాలను గురించి కూడా మీ దృష్టికి తీసుకురావడం తప్పనిసరి అని భావించాం. ఈ న్యాయస్థానంలో అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్–ఇతరులు వర్సెస్ భారత ప్రభుత్వం కేసులలో (2016)5 ఎస్సీసీ1) రాజ్యాంగ ధర్మాసనం అదే విధాన క్రమపత్రం గురించి విచారిస్తున్నది. ఆ కేసుపై ఇచ్చిన ఆదేశంలో ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించవలసిన పద్ధతికి సంబంధించిన విధాన పత్ర రూపకల్పనలో మరింత జాప్యం నివారించాలని చెప్పారు. అయితే అదే విధాన క్రమపత్రం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుండగా జాప్యం జరగరాదని ఇతర బెంచ్ ఎలా చెప్పగలుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఇదే కాకుండా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం దరిమిలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన (మీతో సహా) కొలీజియం క్షుణ్ణంగా చర్చించి విధాన క్రమపత్రానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. దీనినే మార్చి నెల 2017లో గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కానీ ఈ సమాచారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం మౌనం నేపథ్యంలో కోలీజియం ఆమోదించి తుది రూపం ఇచ్చిన విధాన క్రమపత్రానికి సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (సుప్ర) కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా భావించవలసి వచ్చింది. ఆ విధంగా విధాన క్రమపత్రం తుది రూపానికి సంబంధించి పరిశీలించడానికి ధర్మాసనానికి ఎలాంటి అవకాశం కూడా లేకపోయింది. ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ (2017)1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. విధాన క్రమపత్రం విషయంలో ఏ అంశాన్నయినా ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనే, అది కూడా అందరు న్యాయమూర్తులు కలసి చర్చించాలి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆ అంశంలో చట్టపరిధికి సంబంధించిన నిర్ణయం తీసుకోవలసి వస్తే అది ఒక్క రాజ్యాంగ ధర్మాసనమే తీసుకోవాలి. పైన పరిణామాన్ని ఇంత తీవ్రమైన అంశం అన్న స్థాయిలోనే పరిశీలించాలి. విధి నిర్వహణలో నిబద్ధంగా వ్యవహరించే గౌరవ ప్రధాన న్యాయమూర్తి కొలీజియంతో పూర్తి స్థాయి చర్చలు జరిపి పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. అలాగే తరువాతి దశలో ఇందుకు అసవరమైతే ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించాలి. పైన ఉదహరించిన, అంటే ఆర్పీ లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం వాజ్యంలో అక్టోబర్ 27, 2017న కోర్టులో వెలువడిన ఆదేశాల విషయంలో మీరు మళ్లీ ఒకసారి దృష్టి సారించగలిగితే, ఈ న్యాయస్థానం ఇచ్చిన అలాంటి ఇతర ఆదేశాలను కూడా మీ ముందుకు తీసుకువస్తాం. వాటిని కూడా అదే తీరులో పరిశీలించవలసి ఉంది. గౌరవాభినందనలతో... జె. చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బి లోకుర్, కురియన్ జోసెఫ్ -
కంచే చేనును మేస్తే?
న్యాయ నియామకాలలోని, న్యాయ వితరణలోని అన్యాయాల గురించిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? మన న్యాయవ్యవస్థపైన ఫిర్యాదులను, దాని చర్య లవల్ల కలిగే కష్టాలపైన విన్నపాలను, ఫలానా సౌక ర్యం లేదని చెప్పుకునే మహజర్లను స్వీకరించి, అందుకున్నామని రసీదు ఇచ్చి, ఫలానా కాలపరిమి తిలోగా ఆ విషయాన్ని వింటామని అభయమిచ్చి... అలాగే విని వాటిని తిరస్కరించామనో, పరిష్కరిస్తామనో చెప్పే విధా నంగానీ, ప్రక్రియగానీ, యంత్రాంగంగానీ మనకు లేదు. మన సుపరిపాలనలో ఇదొక అద్భుతం. మన న్యాయమంత్రిత్వ శాఖకు వెల్లువెత్తే ఫిర్యాదులలో కోర్టుల్లో అవినీతి గురించి 15 శాతం, అసమంజ çసమైన తీర్పులని 10 శాతం, తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం గురించి 47 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ఇతర అన్ని విభాగాల్లో ఉన్నట్టుగా, న్యాయవ్యవ స్థలో కష్టాలు చెప్పుకునే విధానం, ఫిర్యాదులు విని పరిష్కరించే విధానం దాదాపు మృగ్యం కావడం తీవ్ర లోపమని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వం తమకు వచ్చిన ఫిర్యాదులను న్యాయవ్యవస్థకు పంపుతూ ఉంటుంది. కాని వాటికి ప్రతిస్పందన చాలా అరుదు. ఫిర్యాదుదారుల బాధలను పరిష్క రించకపోయినా, వారి ఫిర్యాదులను పరిశీలించి పలానా కారణాల వల్ల మీ దరఖాస్తు చెత్తబుట్టలో వేస్తున్నామని చెప్పే దిక్కు కూడా లేకపోతే ఎట్లా? ఇదేనా న్యాయం? సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండాలి కదా. జడ్జిల నియామక ప్రక్రియపై తెరలు పూర్తిగా తొలగించడాన్ని జస్టిస్ మదన్ బి లోకుర్ వ్యతిరేకించారు. అంతా బయట పెడితే కొందరు న్యాయ మూర్తులపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలు వారి భవి ష్యత్తును దెబ్బతీస్తాయని, ఆ పదవికి పరిశీలనదాకా వచ్చిన వ్యక్తుల ప్రైవసీని కొంతైనా కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, నియామకాల గురించి బయటకు ఏమీ పొక్క కుండా ఉండే గట్టి తెరలున్నాయనీ, ఇందువల్ల పలుకుబడి ఉన్నవారికే రాజ్యాంగ న్యాయస్థానాల పదవులు దక్కే లాబీయింగ్‌కు ఆస్కారం ఏర్పడిం దని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. జస్టిస్ కురియన్, కొలీజియం నియంతృత్వంగా వ్యవహరించే వీలుం దన్నారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) కేసు విచారణ జరు గుతుండగా... మాథ్యూ నెడుంపర అనే వ్యక్తి కొలీ జియం ద్వారా జడ్జిల పుత్రరత్నాలకు, పెద్ద న్యాయ వాదుల సుపుత్రులకు అవకాశాలు మెండుగా దక్కి, అర్హులై ఆసక్తి ఉన్నవారికి జడ్జిలుగా దరఖాస్తు పెట్టు కునే అవకాశం కూడా దక్కలేదని వాదించారు. బంధుప్రీతిని పెంచిపోషించే విధానాలను తొలగించేందుకే ఎన్‌జేఏసీని ప్రభుత్వం ప్రతి పాదించింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వయంగా ప్రమాణ పత్రాలలో తమ వివరాలు ప్రక టించిన రీతిలో జడ్జిలు కూడా ఆర్టికల్ 124(6) కింద తమ వ్యక్తిగత ఆస్తిపాస్తులు తదితర వివ రాలను ప్రమాణ పూర్వకంగా ప్రకటించాలని, అవా స్తవాలు చెబితే మహాభియోగం ద్వారా కాకుండా సులభరీతిలో జడ్జిలను తొలగించే వీలుండాలని పౌరసమాజం నుంచి ఒక సూచన వచ్చింది. వినే వారెవరయినా ఉన్నారా? తెలుసుకునే హక్కులాగే ప్రైవసీ హక్కు కూడా జీవించే హక్కులో భాగమే తప్ప ప్రాథమిక హక్కు కాదని జస్టిస్ లోకుర్ అన్నారు. కనుక పార దర్శకతకు, గోప్యతకు మధ్య సరైన సమతుల్యం ఉండాలన్నారు. ఎన్‌జేఏసీలో పూర్తి పారదర్శకత ఉంటుందని సమతుల్యం లేనట్టేననీ అన్నారు. అసలు కొలీజియంలో ఏం జరిగిందో ఎవరూ తెలు సుకునే వీల్లేదని, జనానికే కాదు చరిత్రకు కూడా ఆ వివరాలు అందబోవని, జడ్జిలుగా నియమితులైనా ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన దురదృష్ట వంతులకు కూడా రికార్డులు దొరకవని చలమేశ్వర్ తమ తీర్పులో వివరించారు. ఇటువంటి వ్యవస్థ ప్రజల్లో విశ్వాసం పెంచడం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కొలీజి యంలో సర్వసమ్మతి ఉంటే ‘నీకది నాకిది’ అనే ఏర్పాటుకు దారి తీస్తుందనీ, అందువల్ల అన్యాయ మైన నియామకాలు జరిగి, న్యాయార్థుల పట్ల ప్రమాదకరమైన ప్రమాణాలను పాటించడం జరిగి న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆందోళన చెందారు. అంతేకాదు, లాబీయింగ్ వల్ల భజన సంస్కృతి పెరిగిపోయి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిం చారు. అర్హులను వదిలేసి, సొంత కారణాలమీద, సామాజిక జాతీయ వాస్తవాలకు సంబంధం లేకుండా కొందరిని నియమించడం, మరికొందరి నియామకాన్ని కావాలని జాప్యం చేయడం, కొంద రికే ప్రయోజనం చేకూర్చడం, అనుయాయులు కాని వారికి అవకాశాలను దూరం చేయడం, అంతేవాసు లను ఆదరించడం... ప్రతిభలేని వారి నియామకా లకు దారితీస్తున్నాయని జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. అయితే నియామకాధికారాలను రాజకీయ నాయకులతో పంచుకోవడం వివేకవంతమైన చర్య అనడంలో ఇబ్బందులున్నాయని ప్రధాన న్యాయ మూర్తి జేఎస్ కేహార్ అన్నారు. భారతదేశంలో పౌర సమాజం తగినంతగా పరిపక్వత చెందలేదని, కనుక న్యాయమూర్తుల నియామకంలో ఏవైనా లోపాలు జరిగితే అవి దేశాన్ని సంక్షోభంలోకి పడదోస్తాయని ఆందోళన చెందారు. అయితే ఇప్పటి నియామక విధానాల్లో జడ్జిలయిన వారు ఏ విధంగా సంక్షోభం సృష్టిస్తున్నారో మనకు దృష్టాంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. న్యాయ నియామకాలలోని అన్యా యాలు, న్యాయ వితరణలోని అన్యాయాల గురిం చిన ఫిర్యాదులను, ఫిర్యాదుదారుల బాధలను, కష్టాలను వినే విధానమే లేని పాలనాపరమైన తీవ్ర లోపాల అన్యాయాలను నిలదీసి అడిగేవాడే లేడా? (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయ మంత్రిత్వ శాఖ, ఇఐఇ/VS/A/2014/000989– Sఅ కేసులో 3.5.2017 సీఈసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్