జస్టిస్‌ లోకూర్‌ పదవీవిరమణ | SC judge Justice M B Lokur retires | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ లోకూర్‌ పదవీవిరమణ

Published Mon, Dec 31 2018 5:15 AM | Last Updated on Mon, Dec 31 2018 5:15 AM

SC judge Justice M B Lokur retires - Sakshi

జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌.బి.లోకూర్‌ ఆదివారం పదవీవిరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్‌ లోకూర్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు డిసెంబర్‌ 14నే జస్టిస్‌ లోకూర్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఆదివారంతో ఆయన పదవీకాలం పూర్తయింది.

కేసుల కేటాయింపు విషయంలో అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ గొగోయ్, అప్పటి జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌తో కలిసి లోకూర్‌ మీడియా సమావేశంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్‌ 31న జన్మించిన లోకూర్,  1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు. 2010–12 మధ్యకాలంలో గువాహటి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లోకూర్‌ పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement