![Justice Madan B Lokur Appointed As Power Enquiry Commission Chairman In Telangana](/styles/webp/s3/article_images/2024/07/30/Justice-Madan-B-Lokur.jpg.webp?itok=cFtSHEao)
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్‌ను నియమించింది. గతంలో పవర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆ స్థానం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం మదన్ లోకూర్‌ను ఎంపిక చేసింది.
జస్టిస్ మదన్ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జుడ్యీషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ జ్యుడీషియల్ కమిషన్ ఇక ముందు జస్టిస్ మదన్ లోకూర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment