సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన జన్వాడ ఫామ్‌హౌజ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల విచారణ ముగిసింది. రాజ్‌పాకాలను మోకిల పీఎస్ పోలీసులు ఎనిమిది గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం రాజ్‌పాకాలను పోలీసులు విడిచిపెట్టారు. రాజ్‌పాకాల దగ్గర లిక్కర్, గేమింగ్ మినహా డ్రగ్స్ ఆనవాళ్లు దొరలేదని సమాచారం.
రాజ్‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న అతడి స్నేహితుడు విజయ్ మద్దూరికి సంబంధించి పోలీసులు విచారణలో ఆరా తీశారు. విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో తనకు సంబంధం లేదని, అతడి ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని రాజ్‌పాకాల చెప్పినట్లు తెలిసింది.
కాగా, విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని న్యాయవాది ద్వారా పోలీసుకు విజయ్ సమాచారమిచ్చాడు. విజయ్ కాల్‌లిస్ట్, సిగ్నల్ ఆధారంగా డ్రగ్స్ కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.విజయ్ డ్రగ్స్ ఎక్కడ కొన్నాడు. ఎక్కడ వాడాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, జన్వాడలోని రాజ్‌పాకాల ఇంట్లో ఇటీవల జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసిన అక్రమ మద్యానికి సంబంధించిన కేసులు పెట్టారు.
ఇదీ చదవండి: డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్.. పోలీసుల మెరుపు దాడి
Comments
Please login to add a commentAdd a comment