సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలకు(ఎంబీసీ) అన్యాయం జరుగుతోందని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రోహిణిని సంఘ ప్రతినిధులు సూర్యారావు, సత్యం, అంతయ్య తదితరులు బుధవారం ఢిల్లీలో కలసి ఎంబీసీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో పర్యటించి అత్యంత వెనుకబడిన కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి న్యాయం చేస్తామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
‘రిజర్వేషన్లలో ఎంబీసీలకు అన్యాయం’
Published Thu, Feb 1 2018 4:01 AM | Last Updated on Thu, Feb 1 2018 4:01 AM
Advertisement
Advertisement