mbc
-
వన్నియార్లకు రిజర్వేషన్లు కుదరదన్న సుప్రీం
న్యూఢిల్లీ: వన్నియార్లను (వన్నియకుల క్షత్రియులు) ప్రత్యేకంగా గుర్తించేందుకు గణనీయమైన ప్రమాణాలు లేవని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. అందువల్ల వీరికి ఎంబీసీల్లో కేటాయించిన 10.5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి రిజర్వేషన్ ఇవ్వాలన్న సిఫార్సుకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికన తీసుకున్నారని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవైతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎంబీసీల్లోని 115 కులాల్లో వీరిని ప్రత్యేకంగా చూసేందుకు కావాల్సిన ఆధారాల్లేవని తెలిపింది. అందువల్ల వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ 2021లో చేసిన చట్టం ఆర్టికిల్ 14, 15, 16కు వ్యతిరేకమని, రిజర్వేషన్ల రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తున్నామని తెలిపింది. అంతర్గత రిజర్వేషన్లకు కులం ఒక కారణం కావచ్చు కానీ అదొక్కటే కారణం కాకూడదని తెలిపింది. ఎంబీసీ, డీఎన్‌సీలకు కేటాయించిన 20 శాతం రిజర్వేషన్లలో అంతర్గతంగా వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్ కేటాయించడం ఇతర వర్గాలను దెబ్బతీస్తుంద న్నది. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న అభ్యర్ధనను కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కోటా కింద జరిపిన నియామకాలపై తాజా తీర్పు ప్రభావం ఉండదని తెలిపింది. వన్నియార్లకు ప్రత్యేక రిజర్వేషన్ రా జ్యాంగ విరుద్ధమని తమిళనాడుహైకోర్టు గతేడాది తీర్పునిచ్చింది. -
గత ప్రభుత్వ పాపం.. ఎంబీసీలకు శాపం
గత టీడీపీ ప్రభుత్వ పాపం ప్రస్తుతం ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్)లకు శాపంలా మారింది. వృత్తి రుణాలు తీసుకుని చిన్నపాటి వ్యాపారం చేసుకుని బాగుపడదామని భావించిన ఎంబీసీలకు ఆ నిరాశే మిగిలింది. అందరితో పాటు దరఖాస్తు చేసుకున్నా కొందరికి మంజూరు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, పలమనేరు(చిత్తూరు) : జిల్లాలో 32 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. వీరు చేసుకునే వృత్తులను బట్టి రూ.30 వేలు (90శాతం రాయితీ) రుణాలను నాన్‌బ్యాంకింగ్, ఆపై లక్షదాకా రుణాలను బ్యాంకింగ్ ద్వారా ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైనే బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు నాటి సీఎం చంద్రబాబునాయుడు మంచి పథకాన్నే ఎంచుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలోని 1,800 మంది ఎంబీసీలు ఈ రుణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఈ రుణాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ గతంలో జరిగిన అక్రమాలు, ఆపై ఎన్నికల్లో బీసీలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన తతంగాలను గమనించి వాటిని రద్దు చేసింది. ఎంబీసీ రుణాల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫలితంగా జిల్లాలోని ఎంబీసీలు మళ్లీ అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు. భారీగా పెరిగిన రుణం ఈ ప్రభుత్వంలో ఎంబీసీ రుణాలను రూ.30 నుంచి రూ.50 వేలకు పెంచారు. ఈ రుణాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 30వ తేదీ వరకు గడువు పెట్టారు. ఆసక్తి గలవారు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న రుణాలను కావాలనే ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని, నిజమైన అర్హులకు రుణాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. -
ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ 5 శాతం లాభంతో ముగింపు
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్... స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా లిస్టైనప్పటికీ, చివరకు 5 శాతం లాభంతో ముగిసింది. ఇష్యూ ధర, రూ. 300 వద్దే ఈ రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. చివరకు 4.7 శాతం లాభంతో రూ.314 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8.1 శాతం లాభంతో రూ.324.5 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో 2.79 లక్షలు, ఎన్ఎస్ఈలో 29 లక్షలకు పైగా యూనిట్లు ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,238 కోట్లుగా ఉంది. ఇటీవలే వచ్చిన ఈ ఐపీఓ ఇష్యూ 2.57 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.299–300 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారీ ఈ రీట్ రూ.4,750 కోట్లు సమీకరించింది. -
ఎంబసీ రీట్... 2.6 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్
న్యూఢిల్లీ: మన దేశపు తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) 2.57 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ రీట్ ద్వారా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థ రూ.4,750 కోట్లు సమీకరించింది. వ్యూహాత్మక, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ ఇటీవలనే రూ.2,619 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌కు ప్రైస్‌బాండ్ గా రూ.299–300 ధరలను నిర్ణయించారు. 7.13 కోట్ల యూనిట్లను ఆఫర్ చేస్తుండగా, మొత్తం 18.35 కోట్ల యూనిట్లకు బిడ్లు వచ్చాయి. రీట్ యూనిట్లు వచ్చే నెల మొదటి వారంలో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీ గ్రూప్ కలసి ఎంబసీ ఆఫీస్ పార్క్ పేరుతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీనే తొలి రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఒడలు బళ్లు.. బళ్లు ఓడలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక విద్యా కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. నాణ్యత ప్రమాణాలు కొరవడటంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సంప్రదాయ డిగ్రీలైన బీకాం, బీఎస్సీలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైన్సు, కామర్స్ రంగాల్లో అవకాశాలు పెరుగుతుండటంతో వీటిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో 6 వేల వరకు తగ్గిపోగా, సంప్రదాయ డిగ్రీల్లో చేరిన వారి సంఖ్య గత ఏడాదికి, ఇప్పటికి 25 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఉన్నత విద్యా శాఖ తాజాగా తేల్చిన లెక్కల్లో ఈ వాస్తవం బయటపడింది. సంప్రదాయ డిగ్రీల్లో భారీ పెరుగుదల.. రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్సీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాదికి ఇప్పటికి పోల్చితే బీఏలో 8 వేలకు పైగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే బీకాంలో 16 వేల వరకు పెరగగా, బీఎస్సీలో 10 వేల వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 2016–17 విద్యా సంవత్సరంలో 71,066 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 54,064 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరంలో 66,079 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,662 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఎంబీఏ, ఎంసీఏలోనూ 2016–17లో 24,557 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 22,479 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018–19కి వచ్చే సరికి 25,912 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 21,767 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌లోనూ 2016 విద్యా సంవత్సరంలో 50,721 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 36,983 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018 విద్యా సంవత్సరంలో 38,359 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 29,310 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. -
ఎంబీసీల రాయితీ పథకాలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీసీ(అత్యంత వెనుకబడిన కులాలు)ల రాయితీ పథకాలకు లైన్ క్లియర్ అయ్యిం ది. ఇప్పటివరకు ఎంబీసీ జాబితాలో ఎవరున్నారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎంబీసీ కార్పొరేషన్ రెండేళ్ల నుంచి ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నా.. కార్పొరేషన్ పరిధిలోకి ఏయే కులాలు వస్తాయనే అంశం తేలకపోవడంతో ఆ నిధులు ఖర్చు చేయలేదు. 36 కులాలను ఎంబీసీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా కులాలకు చెంది న కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ఎంబీసీ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న యంత్రాంగం.. వారి కోసం ప్రత్యేకంగా రాయితీ పథకాలను రూపొందిస్తోంది. వీటికి తోడు వృత్తి నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించిన అధికారులు.. తాజా ప్రణాళికలో ప్రాధాన్యత ఇస్తున్నారు. 20 వేల మందికి నేరుగా రాయితీ.. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ఎంబీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలను నేరుగా ఇవ్వాలని భావిస్తోంది. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా నేరుగా రాయితీని విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్లో అమల్లో ఉన్న ఈ నిబంధనలను ఎంబీసీ కార్పొరేషన్ కూడా అడాప్ట్ చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అత్యవసర కోటా కింద 20 వేల మందికి రాయితీ రుణాలు ఇవ్వనుంది. ఎంబీసీ కులాల్లోని నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ పథకాన్ని అమలు చేయనుంది. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున రాయితీ ఇవ్వనుంది. ఈ మేరకు నెలాఖరులోగా కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించనుంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టనుంది. అక్టోబర్ నాటికి 20 వేల యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా ఎంబీసీ కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. దీనికి రూ.200 కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేస్తోంది. ఎంబీసీ కులాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ సమన్యాయం చేయనున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. -
ఎంబీసీలకు రాయితీ పెంపు
సాక్షి, హైదరాబాద్: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) రుణసాయం, సబ్సిడీలను పెం చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్వయం ఉపాధి పథకాలకు అందించే ఆర్థిక సహకారాన్ని మరింత పెంచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే విధంగానే ఎంబీసీలకు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. బీసీలకు అమలు చేసే ఎకనామిక్ సపోర్టు స్కీమ్‌కు ఇప్పటివరకు రూ.లక్షకు 60 శాతం (రూ.60 వేలు) సబ్సిడీ ఇచ్చేవారు. అది సరిపోదని, మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. యూనిట్లకు అందించే రుణ సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు అందించాలన్నారు. రూ.లక్ష యూనిట్‌కు ఇకపై రూ.80 వేలు (80 శాతం), రూ.2 లక్షల యూనిట్‌కు రూ.1.40 లక్షలు (70 శాతం), రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల యూనిట్‌కు గరిష్టంగా రూ.5 లక్షలు (60 శాతం) సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంబీసీలకు అమలు చేసే స్వయం ఉపాధి పథకాల సబ్సిడీకి సంబంధించిన ఫైలుపై గురువారం కేసీఆర్ సంతకం చేశారు. గతేడాది ఎంబీసీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, ఈసారీ నిధులు కేటాయిస్తామన్నారు. ఆ నిధులతో ఎంబీసీ కులాల్లోని పేద యువతకు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించారు. -
‘రిజర్వేషన్లలో ఎంబీసీలకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలకు(ఎంబీసీ) అన్యాయం జరుగుతోందని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణిని సంఘ ప్రతినిధులు సూర్యారావు, సత్యం, అంతయ్య తదితరులు బుధవారం ఢిల్లీలో కలసి ఎంబీసీలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో పర్యటించి అత్యంత వెనుకబడిన కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి న్యాయం చేస్తామని జస్టిస్ రోహిణి హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. -
బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!
♦ ‘సాక్షి’తో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ♦ జనాభా ప్రాతిపదికన అంటే 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది ♦ బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాల్సి ఉంటుంది ♦ ప్రస్తుతం బీసీలకు కేటాయింపు 27%గా ఉన్నా లబ్ధి పొందుతున్నది 11% ♦ పలు కులాలు అత్యధికంగా లబ్ధిపొందాయనే అభిప్రాయముంది ♦ వాటికి ప్రాధాన్యం తగ్గించేలా ప్రతిపాదనలు ఉంటాయి ♦ కొన్ని ఆదివాసీ కులాలకూ తాత్కాలికంగా బీసీల్లో చోటు ♦ దీంతో బీసీ వర్గీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయి ♦ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక నమూనా.. 6 నెలల్లో నివేదిక ఇస్తాం ♦ తమ అధ్యయనంలో ఎంబీసీలపైనా స్పష్టత వస్తుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్ అధ్యయ నాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వంలోని ప్రతిశాఖతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో కులాల వారీగా ఉన్న బీసీ ఉద్యోగులు, ఆయా శాఖల పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నవారి సంఖ్యపై పరిశీలన జరుపుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసేం దుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్ర వారం బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తమ అధ్యయనం వివరాలను ‘సాక్షి’కి వెల్ల డించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కులాలపై సమగ్ర అధ్యయనం.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండడం మంచిదే. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం బీసీల సమగ్ర అధ్యయనానికి ఆదేశించింది. బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణలోని కులాలపై సమగ్ర అధ్యయనం చేస్తాం. జీవన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం, సమాజంలో వివక్ష తదితర అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, సంపద పెరిగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. ఆరు నెలల్లో మా నివేదిక సమర్పిస్తాం. ప్రత్యేక కార్యాచరణతో.. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక కార్యచ రణ రూపొందిస్తున్నాం. వివరాలు సేకరిం చేందుకు 8 పేజీలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. దాన్ని నాలుగు పేజీలకు కుదించి, అన్ని వివరాలు వచ్చేలా కొత్త నమూనా తయారు చేస్తున్నాం. ప్రతి కుటుం బంలో వయసు వారీగా సభ్యులు, వారిలో నైపుణ్యాలు, ప్రభు త్వ పథకాల లబ్ధి, ఉద్యో గాలు, నిరుద్యోగం, జీవన స్థితిగతులు, కులవృత్తులు తదితర విధాలుగా పరిశీలన చేస్తాం. ఎంబీసీల జాబితా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొ రేషన్ ఏర్పాటు చేసింది. దాని పరిధిలోకి వచ్చే కులాల జాబితా కూడా సిద్ధం చేస్తాం. కానీ ఇది కేవలం ఆర్థిక చేయూతనిచ్చే పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకుంటాం అధ్యయనంలో భాగంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావు లు, కవులు, కళాకారులు, యువజన సంఘాలు, సామాన్యుల నుంచి వినతు లు తీసుకునేందుకు ప్రత్యే కంగా సమయం కేటాయి స్తాం. ఆన్లైన్ విధానం లోనూ వినతులు తీసుకు నేలా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి కులానికి 10 పేజీ లతో మొత్తంగా 1,500 పేజీల నివేదిక ఇవ్వాలని యోచిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులతోనే.. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వ హించి, పూర్తి వివరాలు సేకరించింది. కానీ నిబంధ నల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జనాభా లెక్కల విభాగానికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సమగ్ర సర్వే వివరాలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం కేటగిరీల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయి. దీంతో కులాల వారీగా వివ రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. 2011 జనగణ న ఆధారంగా పరిశీలన చేపట్టాలని భావిస్తున్నాం. 85 శాతానికి చేరుతాయి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. ప్రస్తుతం 4 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నాం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు ఉన్నారు. అందులో బీసీలు 52 శాతం నుంచి 55 శాతం వరకు ఉన్నట్లు అంచనా. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేపడితే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా పరిశీలన పూర్తయితే రిజర్వేషన్లు ఏమేరకు ఇవ్వాలో స్పష్టత వస్తుంది. కేంద్రం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. వాస్తవంగా 11 శాతం బీసీలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. ఇతర కులాలు ఆ వాటాను దక్కించుకుంటున్నాయి. లబ్ధి పొందిన కులాలు కింది వరుసలోకి.. వెనుకబడిన తరగతుల్లో 113 కులాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 కులాలు అత్యధికంగా లబ్ధి పొందాయనే అభిప్రాయా లున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేస్తాం. అత్యధికంగా లబ్ధి పొంది నట్లు గుర్తిస్తే.. ఆ కులాలను కిందవరుసలో చేర్చుతాం. వాస్తవానికి ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. బీసీల్లోనే ఉంచుతూ ప్రాధాన్యతను తగ్గించాలని యోచిస్తున్నాం. మరోవైపు కొన్ని ఆదివాసీ కులాలు ఏ జాబితా లోనూ నమోదు కాలేదు. వారిని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడం దీర్ఘకాల ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. అందువల్ల అలాంటి కులాలను బీసీల్లో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్గీకరణలోనూ మార్పులు చేర్పులు జరుగుతాయి. -
ఎంబీసీలను ప్రభుత్వం ఆదుకోవాలి: తమ్మినేని
హైదారాబాద్: రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్న ఎంబీసీ కులాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. పేరుకు బీసీలు అయినప్పటికీ వీరు సమాజంలో అత్యంత వివక్షను అనుభవిస్తున్నారని.. తమ మహాజన పాదయాత్ర సందర్భంగా ఎంబీసీల నుంచి అనేక వినతులు వస్తున్నాయని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎంబీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు అందడం లేదని.. అలాగే ఇందులో మెజారిటీ కులాలకు చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం రాలేదని తెలిపారు. అణగదొక్క బడ్డ వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందించాల్సిన అవసరముందన్నారు. ఫెడరేషన్ల ద్వారా ఇస్తున్న లోన్లు కూడా వీరికి సరిగా అందడం లేదన్నారు. మొత్తం 208 కోట్లు కేటాయిస్తే.. 20 కోట్ల రుణాలు కూడా వీరికి అందలేదని తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నవారు సైతం వీరిని ఎంబీసీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. వీరికి సామాజిక పరమైన రక్షణకోసం ఎస్సీ, ఎస్టీ తరహాలో అట్రాసిటీ చట్టం అవసరముందన్నారు. వెంటనే ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి.. దానికి 10 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రుణాలు అందించేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.