
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్), ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్... స్టాక్ మార్కెట్లో ఫ్లాట్‌గా లిస్టైనప్పటికీ, చివరకు 5 శాతం లాభంతో ముగిసింది. ఇష్యూ ధర, రూ. 300 వద్దే ఈ రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. చివరకు 4.7 శాతం లాభంతో రూ.314 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో 8.1 శాతం లాభంతో రూ.324.5 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో 2.79 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 29 లక్షలకు పైగా యూనిట్లు ట్రేడయ్యాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.24,238 కోట్లుగా ఉంది. ఇటీవలే వచ్చిన ఈ ఐపీఓ ఇష్యూ 2.57 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.299–300 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారీ ఈ రీట్ రూ.4,750 కోట్లు సమీకరించింది.