బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి! | BC Commission Chairman BS Ramulu | Sakshi
Sakshi News home page

బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!

Published Sat, May 27 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!

బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!

‘సాక్షి’తో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు
జనాభా ప్రాతిపదికన అంటే 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది
బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాల్సి ఉంటుంది
ప్రస్తుతం బీసీలకు కేటాయింపు 27%గా ఉన్నా లబ్ధి పొందుతున్నది 11%
పలు కులాలు అత్యధికంగా లబ్ధిపొందాయనే అభిప్రాయముంది
వాటికి ప్రాధాన్యం తగ్గించేలా ప్రతిపాదనలు ఉంటాయి
కొన్ని ఆదివాసీ కులాలకూ తాత్కాలికంగా బీసీల్లో చోటు
దీంతో బీసీ వర్గీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయి
వివరాలు సేకరించేందుకు ప్రత్యేక నమూనా.. 6 నెలల్లో నివేదిక ఇస్తాం
తమ అధ్యయనంలో ఎంబీసీలపైనా స్పష్టత వస్తుందని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్‌ అధ్యయ నాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వంలోని ప్రతిశాఖతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో కులాల వారీగా ఉన్న బీసీ ఉద్యోగులు, ఆయా శాఖల పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నవారి సంఖ్యపై పరిశీలన జరుపుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసేం దుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్ర వారం బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు తమ అధ్యయనం వివరాలను ‘సాక్షి’కి వెల్ల డించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

కులాలపై సమగ్ర అధ్యయనం..
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండడం మంచిదే. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం బీసీల సమగ్ర అధ్యయనానికి ఆదేశించింది. బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణలోని కులాలపై సమగ్ర అధ్యయనం చేస్తాం. జీవన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం, సమాజంలో వివక్ష తదితర అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, సంపద పెరిగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. ఆరు నెలల్లో మా నివేదిక సమర్పిస్తాం.

ప్రత్యేక కార్యాచరణతో..
క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక కార్యచ రణ రూపొందిస్తున్నాం. వివరాలు సేకరిం చేందుకు 8 పేజీలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. దాన్ని నాలుగు పేజీలకు కుదించి, అన్ని వివరాలు వచ్చేలా కొత్త నమూనా తయారు చేస్తున్నాం. ప్రతి కుటుం బంలో వయసు వారీగా సభ్యులు, వారిలో నైపుణ్యాలు, ప్రభు త్వ పథకాల లబ్ధి, ఉద్యో గాలు, నిరుద్యోగం, జీవన స్థితిగతులు, కులవృత్తులు తదితర విధాలుగా పరిశీలన చేస్తాం.

ఎంబీసీల జాబితా కూడా..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొ రేషన్‌ ఏర్పాటు చేసింది. దాని పరిధిలోకి వచ్చే కులాల జాబితా కూడా సిద్ధం చేస్తాం. కానీ ఇది కేవలం ఆర్థిక చేయూతనిచ్చే పథకాలకు మాత్రమే వర్తిస్తుంది.

అన్ని వర్గాల  అభిప్రాయాలూ తీసుకుంటాం
అధ్యయనంలో భాగంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావు లు, కవులు, కళాకారులు, యువజన సంఘాలు, సామాన్యుల నుంచి వినతు లు తీసుకునేందుకు ప్రత్యే కంగా సమయం కేటాయి స్తాం. ఆన్‌లైన్‌ విధానం లోనూ వినతులు తీసుకు నేలా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి కులానికి 10 పేజీ లతో మొత్తంగా 1,500 పేజీల నివేదిక ఇవ్వాలని యోచిస్తున్నాం.

న్యాయపరమైన చిక్కులతోనే..
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వ హించి, పూర్తి వివరాలు సేకరించింది. కానీ నిబంధ నల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జనాభా లెక్కల విభాగానికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సమగ్ర సర్వే వివరాలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం కేటగిరీల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయి. దీంతో కులాల వారీగా వివ రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. 2011 జనగణ న ఆధారంగా పరిశీలన చేపట్టాలని భావిస్తున్నాం.

85 శాతానికి చేరుతాయి
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. ప్రస్తుతం 4 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నాం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు ఉన్నారు. అందులో బీసీలు 52 శాతం నుంచి 55 శాతం వరకు ఉన్నట్లు అంచనా. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేపడితే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా పరిశీలన పూర్తయితే రిజర్వేషన్లు ఏమేరకు ఇవ్వాలో స్పష్టత వస్తుంది. కేంద్రం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. వాస్తవంగా 11 శాతం బీసీలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. ఇతర కులాలు ఆ వాటాను దక్కించుకుంటున్నాయి.

లబ్ధి పొందిన కులాలు కింది వరుసలోకి..
వెనుకబడిన తరగతుల్లో 113 కులాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 కులాలు అత్యధికంగా లబ్ధి పొందాయనే అభిప్రాయా లున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేస్తాం. అత్యధికంగా లబ్ధి పొంది నట్లు గుర్తిస్తే.. ఆ కులాలను కిందవరుసలో చేర్చుతాం. వాస్తవానికి ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌ ఉన్నప్పటికీ.. బీసీల్లోనే ఉంచుతూ ప్రాధాన్యతను తగ్గించాలని యోచిస్తున్నాం. మరోవైపు కొన్ని ఆదివాసీ కులాలు ఏ జాబితా లోనూ నమోదు కాలేదు. వారిని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడం దీర్ఘకాల ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. అందువల్ల అలాంటి కులాలను బీసీల్లో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్గీకరణలోనూ మార్పులు చేర్పులు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement