సీమకు అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాలి | Seema to Injustice people should mobility | Sakshi
Sakshi News home page

సీమకు అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాలి

Published Mon, Jul 6 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

సీమకు అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాలి

సీమకు అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాలి

మైదుకూరు టౌన్ : అభివృద్ధి విషయంలో రాయలసీమకు జరిగిన అన్యాయంపై కుందూ సాహితీ ఆధ్వర్యంలో సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు లెక్కల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీహైస్కూల్ ఆవరణలో కుందూ సాహితీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్రరాష్టం ఏర్పడిన సమయంలో రాయలసీమ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను నాయకులు అమలు చేయలేదన్నారు.

సాగునీటి ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల ఏర్పాటులో మొండి చెయ్యి మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభన అనంతరం కూడా రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థ సమన్వయకర్త తవ్వా ఓబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శితోట రామమోహన్, పొదిలినాగరాజు, ఓబులం క్రిష్టమూర్తి, క్రిష్టమూర్తి యాదవ్, దాదం ఆంజనేయులు, పోలుకొండారెడ్డి, డిఎన్‌నారాయణ, సాదక్, కొండపేట  నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement