పుల్లూర్ బండపై మొక్క నాటుతున్న మంత్రి
- 30 ఏళ్లలో కేవలం 134 మాత్రమే
- ఏడాదిలోనే 160 బాలికల గురుకులాలు ఏర్పాటు
- తాజాగా జిల్లాకు మూడు డిగ్రీ గురుకులాలు మంజూరు
- రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో బాలికల విద్యకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బాలికల విద్య కోసం 1985 నుంచి 2015 వరకు 30 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 134 పాఠశాలలు ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోనే 160 బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలు మంజూరు చేసి, వారి విద్యాభివృద్ధికి దోహదపడుతున్నట్టు చెప్పారు. ఆదివారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మిటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో మూడు కళాశాలలు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలకు మం జూరైనట్టు చెప్పారు. అంతకు ముందు మండలంలోని పుల్లూర్ బండ శ్రీ లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు మొక్కలు నాటారు.