రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | mp geetha reddy fire on cm kcr | Sakshi

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Published Thu, Mar 3 2016 4:25 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు - Sakshi

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

సానియామీర్జాకు రూ. కోటి ఇచ్చారు..
దళిత యువతికి అన్యాయం జరిగితే ఇవ్వరా
మాజీ మంత్రులు గీతారెడ్డి, సబిత, సునీత

 

 వీణవంక : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, స్వేచ్ఛ గా ఉండలేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి గీతారెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఇటీవల గ్యాంగ్‌రేప్‌కు గురైన బాధితురాలిని మాజీ మంత్రులు సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి బుధవారం పరామర్శించారు. ఎస్‌ఐని, కానిస్టేబుల్‌ను మాత్రమే సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నాన్నారు. విచారణ పేరుతో బాధితురాలిని వేధించిన సీఐని, డీఎస్పీని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండి కూడా ఇంతవరకు బాధితురాలిని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం యువతికి పోలీసు ఉద్యోగం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సబితారెడ్డి మాట్లాడుతూ సానియామీర్జాను పిలిచి కోటి రూపాయలు ఇచ్చిన సీఎం... దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఇవ్వలేరా అని అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుం బానికి కాంగ్రెస్  అండగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement