హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను బేసిక్ లిమిట్‌ను పెంచటం వల్ల ఎవరికెంత లాభం? ఉద్యోగులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, వృత్తి నిపుణులు వీరందరికీ ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఇది తెలుసుకోవటానికి ట్యాక్సేషన్ నిపుణుల్ని ‘సాక్షి’ సంప్రదించింది. వారు సోదాహరణంగా చెప్పిన వివరణలివీ...
1) కృష్ణమోహన్ నెల జీతం రూ.25,000. అంటే ఏడాదికి రూ.3 లక్షలు. గతేడాది బేసిక్ లిమిట్ రెండు లక్షలుగా ఉండటంతో మిగిలిన లక్ష రూపాయల ఆదాయంపై పది శాతం అంటే రూ.10,000 పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ కృష్ణ మోహన్ ఈ భారాన్ని తగ్గించుకోవడానికి సెక్షన్ 80సీ పరిమితిని పూర్తిగా వినియోగించుకున్నాడు. దీంతో అతను ఒక్కపైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బడ్జెట్‌లో బేసిక్ లిమిట్‌ను రూ.2.5 లక్షలకు పెంచడంతో పన్నుకు గురయ్యే ఆదాయం రూ.50,000 తగ్గింది. దీంతో అతనికి నేరుగా రూ.5,000 పన్ను భారం తగ్గింది. అలాగే ఈ సారి కేవలం రూ.50,000 పొదుపు చేస్తే చాలు పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆ విధంగా చూస్తే కృష్ణమోహన్ జేబులోకి ఈ ఏడాది ఖర్చు చేసుకోవడానికి అదనంగా రూ.55,000 వచ్చినట్లే. సెక్షన్ 80సీనే పూర్తిగా వినియోగించుకోలేదు కాబట్టి ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచినా, గృహరుణాలపై మినహాయింపు లభించే వడ్డీ పరిమితిని
రూ. 2 లక్షలకు పెంచినా వీటి ప్రయోజనాలను కృష్ణ మోహన్ పొందలేడు. ఈ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే అతని వార్షిక వేతనం కనీసం రూ.6 లక్షలు దాటి ఉండాలి. అంటే నెలకు రూ.50,000 జీతం దాటిన వారు మాత్రమే జైట్లీ ఫలాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించగలరు.
బేసిక్ లిమిట్‌ను పెంచడం... సెక్షన్ 80సీ, గృహ రుణ వడ్డీపై మినహాయింపుల పెంపువల్ల ఎవరెవరికి గరిష్ఠంగా ఎంత పన్ను భారం తగ్గుతుందో పై పట్టికలో చూడొచ్చు..
ఎవరికి ఎంత లాభం?
Published Fri, Jul 11 2014 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement