
తెలంగాణకు అన్యాయం జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదని పెదవి విరిచారు. కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వ విద్యాలయం కొత్తది కాదని.. పునర్విభజన చట్టంలో ఉన్నదే అని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయిని ఆశించినట్టు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు.