K. kesava rao
-
కేకే భూముల రిజిస్ట్రేషన్ రద్దు
♦ హాఫీజ్‌పూర్‌లో 70 ఎకరాలను స్వాధీనం చేసుకున్న సర్కారు ♦ అలాగే టీసీఎస్ సమీపంలో ఐదెకరాలు వెనక్కి ♦ బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.20 కోట్లపైనే సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీం పట్నం మండలం హఫీజ్‌పూర్‌లో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు చేయించుకున్న అటవీ, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కేకే, గోల్డ్‌స్టోన్ యాజమాన్యం గుప్పిట్లో ఉన్న 70 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దండు మైలారం గ్రామం హఫీజ్‌పూర్ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 36/1లో 1,822 ఎకరాలు, 36/2లో 422.29 ఎకరాల మేర అటవీ, ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి లో 50 ఎకరాలను కేకే తన కుటుంబీకులు కంచర్ల నవజ్యోత్, జ్యోత్న, గద్వాల విజయలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గోల్డ్‌స్టోన్ యాజ మాన్యం నుంచి కొనుగోలు చేసిన ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది. అయితే, ఈ భూమిని చట్టపరంగానే కొనుగోలు చేశానని మొదట వాదించిన కేశవరావు చివరకు వెనక్కి తగ్గారు. ఈ భూ వ్యవహారం తన మెడకు చుట్టుకుం టుందని పసిగట్టిన ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు 22ఏ కింద నమోదైన ఈ భూమి చేతులు మారడాన్ని సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం.. కేకే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అలాగే ఇదే సర్వే నంబర్లలో గోల్డ్‌స్టోన్ యాజమాన్యం తన అనుబంధ సంస్థలకు కట్టబెట్టిన 20 ఎకరాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.20 కోట్ల భూమి వెనక్కి! ఆదిబట్లలోని టీసీఎస్ సంస్థను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 79/2 లోని రూ.20 కోట్ల విలువైన ఐదెకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అసైన్డ్‌దారుల నుంచి చేతులు మారిన ఈ భూమిని స్వాధీనం చేసుకున్న సర్కారు.. బోర్డులు నాటి ప్రహరీగోడను ఏర్పాటు చేసింది. అనంతరం ఈ స్థలంపై కన్నేసిన ల్యాండ్ మాఫియా.. గోడలు, సూచిక బోర్డులను తొలగించి మళ్లీ ఆక్రమించింది. మియాపూర్ భూముల కుంభకోణం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన రెవెన్యూ యం త్రాంగం.. అన్యాక్రాంతమవుతున్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అలాగే దురాక్రమణకు గురైన మరో 25 ఎకరాల భూమిని పీఓటీ చట్టం కింద వెనక్కి తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. -
మాజీ జర్నలిస్టుల పిల్లల రసవత్తర పోరు
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. అభ్యర్థులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. అయితే.. బంజారా హిల్స్ డివిజన్ అభ్యర్థుల విషయంలో ఒక ఆసక్తి కరమైన పోలిక ఉంది. ఈ డివిజన్ లో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గద్వాల్ విజయ లక్ష్మి తండ్రి కే.కేశవరావు, బీజేపీ అభ్యర్థి మేచినేని శ్రీనివాసరావు తండ్రి మేచినేని కిషన్ రావులు ఇద్దరూ మాజీ జర్నలిస్టులు కావడం విశేషం. వీరిద్దరూ జర్నలిజంలో ఉంటూనే ఎవరికివారు ప్రత్యేకంగా పత్రికలు నడిపారు. మేచినేని కిషన్‌రావు సమయం పత్రికను నిర్వహిస్తే కే.కేశవరావు డైలీ న్యూస్ పేరుతో ఓ పత్రికను సమర్ధవంతంగా నడిపారు. తాజాగా ఇద్దరు మాజీ జర్నలిస్టులు తమ పిల్లల విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాదు.. ప్రస్తుతం ఈ మాజీ జర్నలిస్టుల వారసులు కార్పోరేటర్ పదవికి పోటీ పడుతుండగా.. గతంలో కేశవరావు, కిషన్ రావులు సికింద్రాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పదవికి పోటీ పడటం విశేషం. ఆ ఎన్నికల్లో కేకేపై కిషన్‌రావు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఈ ఇద్దరూ మాజీ మంత్రులు కావడం మరో విశేషం. కేకే కార్మికశాఖామంత్రిగా పని చేస్తే కిషన్‌రావు విద్యాశాఖామంత్రిగా పని చేశారు. మరో విషయం ఏంటంటే హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేకే, కిషన్‌రావు ఇద్దరూ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రావుపై కేకే గెలుపొందారు. ఇలా ఈ ఇద్దరూ చాలా విషయాల్లో తలపడినవారే. కేకే, కిషన్‌రావు కూతురు, కొడుకు పోటీ పడుతుండటం.. తాజాగా డివిజన్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో తలపండిన ఈ ఇద్దరు నేతలు తమ పిల్లలను గెలిపించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరి తుది విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పలు సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. నివసించేది.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో. అంతే కాదు.. ఇద్దరూ ఎప్పుడు ఎదురు పడినా.. ఆప్యాయంగా పలకరించుకోవడం.. ఒకరిపై ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేయడంలో హుందా వ్యవహరిస్తారు. -
పార్టీని వీడిన వారి ఫొటోలు ఇంకా ఎందుకు..?
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీని వీడిన వారి ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని టీపీసీసీ నిర్ణయించింది. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీ ద్రోహుల ఫొటోలను గాంధీభవన్‌లో ఉంచాల్సిన అవసరమ లేదని టీపీపీసీ ముఖ్యనాయకుడొకరు గురువారం ప్రదిపాదించారు. ఈ ప్రతిపాదనతో టీపీసీసీ నేతలంతా అంగీకరించారు. మరోసారి ముఖ్యులతో మాట్లాడి, ఈ ప్రతిపాదనను అమలు చేయాలని నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారి ఫోటోలు, వారు పని చేసిన కాలం వంటివాటితో అందరి ఫొటోలను గాంధీభవన్‌లో వరుసగా పెట్టే సంప్రదాయం ఉంది. అయితే, పార్టీ నుంచి పోయినవారి ఫొటోలను ఇప్పటిదాకా గాంధీభవన్ నుంచి తొలగించిన దాఖాలాల్లేవు. పార్టీ నుంచి బయటకు పోయి, కాంగ్రెస్ పార్టీనే తిడుతున్న ద్రోహుల ఫోటోలను ఎందుకు పెట్టాలంటూ పలువురు నేతలు ప్రశ్నించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ ఫొటోలను గాంధీభవన్ నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
'అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది'
-
'అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది'
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. సెక్యులర్ భావాలున్న కేంద్రం ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు అండగా ఉంటుందని తాము భావించడం లేదన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశామని తెలిపారు. టీడీపీ ముడుపుల కేసులో కచ్చితంగా చంద్రబాబు పేరును చేర్చాల్సిందేనని కేశవరావు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ టాపింగ్ అంశం సీరియస్ వ్యవహారమని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి
హైదరాబాద్: పాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలో పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను సీనియర్ నాయకుడు కె. కేశవరావుకు అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యత కేకే భుజస్కందాలపై పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వలసలను ప్రోత్సహించాలని కూడా కేసీఆర్ యోచినట్టు సమాచారం. ఇక జిల్లాల్లో పార్టీ బలోపేతం బాధ్యతలు మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఆగష్టు 3వ వారంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
తెలంగాణకు అన్యాయం జరిగింది: కేసీఆర్
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదని పెదవి విరిచారు. కేంద్రం కేటాయించిన ఉద్యాన విశ్వ విద్యాలయం కొత్తది కాదని.. పునర్విభజన చట్టంలో ఉన్నదే అని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేటాయింపులు ఎక్కువగా ఉంటాయిని ఆశించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్లో తెలంగాణకు నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. -
స్థాయిని మరిచి సోనియా అబద్దాలు : కేకే
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన స్థాయిని మరిచిపోయి అబద్దాలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేసీఆర్ సభలోనే లేడని సోనియాగాంధీ చెప్పడం వాస్తవం కాదన్నారు. లోక్‌సభ టీవీ చానల్ ఫుటేజ్‌ను చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. తెలంగాణ కావాలని డిమాండ్ పెట్టి, తెలంగాణ ప్రజలతో ఉద్యమించిన పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. ఉద్యమంలో భుజంభుజం కలిపినట్టుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్లో చేరిన తాను, మరో ఇద్దరు ఎంపీలు కాకుండా ఉద్యమంలో కలసివచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరని కేకే ప్రశ్నించారు. ఆరువందల మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, పార్లమెంటులో సంతాపతీర్మానం చేయాలని అడిగితే ప్రధానమంత్రి అంగీకరించలేదని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన సీఎం కూడా కాంగ్రెస్ వారేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకున్న 18 మంది ఎంపీలు కూడా కాంగ్రెస్‌వారేనని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఎంపీలు ధిక్కరిస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఉద్యమం లేకుంటే తెలంగాణ ఇచ్చేవారా అని కేకే ప్రశ్నించారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో 8 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రణాళికాసంఘం చెప్పినా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వలేదని అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 92 వేల ఉద్యోగాలను ఆక్రమించిన ఆంధ్రా ఉద్యోగులను వెనక్కు పంపించేయకపోతే ఉద్యమానికి అర్థమే లేదన్నారు. -
అనవసరంగా నోరు జారొద్దు: కేకే
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో అనవసరంగా నోరు జారొద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావుతో కలిసి తెలంగాణభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 1,200 మంది విద్యార్థులు అమరులైతే ఏనాడూ రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేయించలేని అసమర్థ మం త్రులు ఇప్పుడు జై తెలంగాణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌కు నీళ్లు రాకుండా కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు అడ్డుకుంటే ఆ పార్టీ అధిష్టానాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించగలరా? అని ప్రశ్నించారు. జాతీయ పార్టీల చేతిలో తెలంగాణ ఉంటే నదీజలాలు, ఉద్యోగాలు వంటి చాలా సమస్యలు శాశ్వతంగా ఉంటాయని హెచ్చరించారు. కొందరు బాధపడినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే అంతిమలక్ష్యంగా పోరాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను విమర్శించడానికి ముందుగా హుందాగా మెలగాలని కాంగ్రెస్ నేతలకు కేకే సూచించారు. బాబుది నాలుకేనా?: హరీష్‌రావు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుది నాలుకా, తాటిమట్టా అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకులు టి.హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని నిన్నటివరకు చెప్పిన చంద్రబాబే ఇప్పుడు టీఆర్ఎస్ విలీనం కాకుండా నమ్మకద్రోహం చేసిందంటూ విచిత్రంగా వాదిస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎస్ ఒంటరిపోరుకు సిద్ధమైందని ప్రకటించగానే కాంగ్రెస్‌కు, టీడీపీకి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. తెలంగాణ ఇప్పుడు స్వంత రాష్ట్రమని, టీడీపీ వంటి పరాయి రాష్ట్రాల పార్టీల అవసరం ఇక్కడ లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్కు అధిష్టానమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు. సీపీఐతో చర్చలు సీట్ట సర్దుబాటుపై సీపీఐతో చర్చలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ పొత్తుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె.కేశవరావు వెల్లడించారు. పొత్తుల వివరాలను ఇప్పుడే మీడియాకు చెప్పలేమన్నారు. -
టీఆర్ఎస్లో కొలిక్కిరాని పొత్తు చర్చలు
సాక్షి, హైదరాబాద్: పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనే అంశంపై టీఆర్ఎస్లో ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఈటెల రాజేందర్, బి.వినోద్‌కుమార్ తదితరులు సోమవారం కూడా సమావేశమయ్యారు. టీఆర్ఎస్తో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, చర్చించడానికి ఢిల్లీ వస్తున్నారని కాంగ్రెస్ ప్రకటించినా టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లలేదు. అయితే పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీపీఐ జాతీయస్థాయి నాయకత్వం చేసిన ప్రకటనపై ఈ సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ పార్టీతో అనుసరించాల్సిన వైఖరిపైనా చర్చించారు. అయితే సీట్ల సంఖ్యలో కచ్చితమైన అంగీకారం కుదరకుంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయంతో కేసీఆర్ ఉన్నట్టుగా పొత్తుల చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు ఒకరు వెల్లడించారు. వీటిపై అంతర్గతంగా ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే చర్చలను బహిరంగపర్చాలని అనుకుంటున్నారు. రెండు, మూడు రోజుల తర్వాతనే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆ నేత తెలిపారు. అయితే మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. -
పొత్తుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ చర్చలు!
-
పొత్తుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ చర్చలు!
కేకేతో దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ మంతనాలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యూయి. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్.. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావులు ఈ చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్న కేకేతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, అందువల్ల టీఆర్ఎస్పై విమర్శలకు తొందరపడొద్దని కాంగ్రెస్ తెలంగాణ నేతలకు సూచనలు అందినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో విలీనం ఉండదని ప్రకటించినప్పటికీ పొత్తుకు సిద్ధమేననే సంకేతాలను టీఆర్ఎస్ అధిష్టానం పంపడంతో.. పొత్తులపై సూత్రప్రాయమైన నిర్ణయానికి వచ్చే దిశగా దిగ్విజయ్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. చర్చల నేపథ్యంలోనే తెలంగాణలోని ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి? ఏ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది? అనే వివరాలపై ఇరుపార్టీలు దృష్టి పెట్టారుు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఎంపీ సీట్లే కీలకమైనందున టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే తాము ఎక్కువగా ఎంపీ సీట్లే కోరే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్కు ఎక్కువగా ఇచ్చేందుకు పార్టీ పెద్దలు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ లక్ష్య సాధన పూర్తయినందున టీఆర్ఎస్ ముందున్న ప్రధాన కర్తవ్యం తెలంగాణ పునర్నిర్మాణమే. అది జరగాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరముందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే ఇతర పార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. పొత్తులో భాగంగా 70కి పైగా అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్కు దక్కేలా చూడాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఉద్దేశంతోనే అవసరమైతే 17 ఎంపీ సీట్లలో 10 స్థానాలను తీసుకున్నా అభ్యంతరం లేదనే సంకేతాలను కాంగ్రెస్‌కు పంపినట్లు సమాచారం. ఇరు పార్టీల పెద్దల మధ్య సీట్ల సర్దుబాటుపై అంతర్గత చర్చలు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎందుకీ వెంపర్లాట!: కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ తేల్చిచెప్పిన తర్వాత కూడా ఆ పార్టీతో పొత్తు కోసం హైకమాండ్ పెద్దలు తహతహలాడుతుండటాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్సేనన్న విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని, టీఆర్ఎస్తో పొత్తు లేకపోయినా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పినా హైకమాండ్ పెద్దలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నా ప్రతి విమర్శలు చేయలేని పరిస్థితిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి నివాసంలో మంగళవారం సమావేశమైన టీ కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విషయం హైకమాండ్ దృష్టికి వెళ్లింది. బుధవారం తెలంగాణ నేతలతో ఫోన్లో మాట్లాడిన దిగ్విజయ్.. ప్రస్తుతానికి టీఆర్ఎస్ను విమర్శించొద్దని సూచించారు. ఒకరిద్దరు కీలకమైన నేతలకు టీఆర్ఎస్తో పొత్తుకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఇప్పటికే అంతర్గతంగా మంతనాలు జరుగుతున్నాయని కూడా చెప్పినట్లు తెలిసింది. అరుుతే టీ కాంగ్రెస్ నేతల్లో అత్యధికులు ఇప్పటికీ టీఆర్ఎస్తో పొత్తు వద్దని, ఒంటరిగానే పోటీ చేయాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. పొత్తువల్ల సీట్లు కోల్పోయే నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలున్నాయని, తద్వారా అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని ఒక నేత ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టీఆర్ఎస్తో పొత్తువల్ల తమకు మళ్లీ సీట్లు దక్కుతాయో లేదోననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిలేని రీతిలో ఇరు పార్టీలు పొత్తులు పెట్టుకునే దిశగా చర్చలు జరుపుతున్నందున ఆందోళన అవసరం లేదని హైకమాండ్ పెద్దలు చెబుతున్నట్లు తెలిసింది. పొత్తులపై చర్చల్లేవు : కేకే పొత్తులపై కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు ఒక ప్రకటనలో ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.