
'అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది'
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. సెక్యులర్ భావాలున్న కేంద్రం ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు అండగా ఉంటుందని తాము భావించడం లేదన్నారు.
ఈ అంశాలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశామని తెలిపారు. టీడీపీ ముడుపుల కేసులో కచ్చితంగా చంద్రబాబు పేరును చేర్చాల్సిందేనని కేశవరావు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ టాపింగ్ అంశం సీరియస్ వ్యవహారమని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.