
పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి
హైదరాబాద్: పాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలో పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను సీనియర్ నాయకుడు కె. కేశవరావుకు అప్పగించారు.
గ్రేటర్ ఎన్నికల బాధ్యత కేకే భుజస్కందాలపై పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వలసలను ప్రోత్సహించాలని కూడా కేసీఆర్ యోచినట్టు సమాచారం. ఇక జిల్లాల్లో పార్టీ బలోపేతం బాధ్యతలు మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఆగష్టు 3వ వారంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.