TRS plenary
-
TRS Formation Day: టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు 2022 (ఫొటోలు)
-
గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. తమిళనాడులోనూ ఓ బిల్లు విషయంలో అదే పరిస్థితి. మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా గవర్నర్ల పంచాయితీ చూస్తున్నాం. దివంగత ఎన్టీఆర్.. పార్టీ పెట్టినప్పుడు మేమూ ఆయనతో పని చేశాం. అద్భుతమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఇదే దుర్మార్గమైన రీతిలో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి.. స్వచ్ఛమైన పాలన అందించిన ఎన్టీఆర్‌ను సీఎం పీఠం నుంచి దించేశారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇదెక్కడో భారత రామాయణ గాథలు నుంచి చెప్తోంది కాదు. ఇదే హైదరాబాద్ గడ్డపైన జరిగింది. తామే గొప్పనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. మెడలు వంచి ఎన్టీఆర్‌ను మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ ఏమయ్యాడు?.. చివరకు తొలగించబడ్డాడు.. అవమానకర రీతిలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు. జరిగిన చరిత్రే కదా. దాని నుంచైనా బుద్ధి రావొద్దా? ఇది చూసైనా ప్రజాస్వామ్యంలో పరిణితి నేర్చుకోవద్దా?. కానీ, ఇప్పుడేం జరుగుతోంది?.. ఉల్టా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వక్రమార్గంలో.. రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని దుర్వినియోగపరుస్తున్నారు అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. సంబంధిత వార్త: కావాల్సింది రాజకీయ ఎజెండా కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా -
అన్నీ ఉన్నా దేశంలో దారిద్య్రం ఎందుకు?: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి కావాల్సింది బీజేపీని గద్దె దించడమో, రాజకీయ ఎజెండానో కాదని.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హెచ్సీసీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జాడ్యాలు, అవాంఛితమైన, అనారోగ్యకరమైన, అవసరమైన పెడధోరణులు ప్రబలుతున్నాయన్నారు. ► భారత దేశం శాంతికి అలవమైన సమాజం. కానీ, అవసరమైన జాఢ్యాలు పెరిగిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంత అద్భుతమైన దేశంలో సంకుచిత, ఇరుకైన విధానాలు.. దేశ గరిమకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తున్నాయి. మంచి మార్గాలు కనిపించడం లేదు. అందుకే ఒక రాష్ట్రంగా ఏం చేయాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అలాగే దేశ అభ్యున్నత కోసం యధాశక్తిగా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ► తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు. ► తెలంగాణ పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయి. వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి. ► పరిష్కారాలు కనబర్చాల్సింది విపరీతంగా ఉన్న సమస్యల మీద. ప్రపంచంలోనే యువ జనాభా ఉన్న దేశం భారత్.. కానీ, దరిద్రమే తాండవిస్తోంది. ప్రతిభాపాటవాలను విదేశాల్లోనే ఖర్చు పెడుతున్నారు. అద్భుతంగా పురోగమించాల్సిన దేశం.. వెనుకబడి పోతోంది. మట్టిని కూడా సింగపూర్ పొరుగుదేశం నుంచి తెచ్చుకుంటుంది. నీళ్లు కూడా మలేషియాదే. కానీ, వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. ఇది కఠోరమైన వాస్తవం. నిప్పులాంటి నిజం. హేతుబద్ధమైన వాదం. స్వచ్ఛమైన కఠోరమైన వాస్తవం. కాదనుకుంటే నీతి ఆయోగే ఖండించేది కదా. ► అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ► కొన్ని పార్టీల మిత్రులు మనమంతా ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని కోరారు. చెత్త ఎజెండా తాను వెంట రాలేనని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. గద్దె ఎక్కించాల్సింది ప్రజలనని, తెలియజేయాల్సింది ప్రజలకు, మారాల్సింది దేశ ప్రజల జీవితాలు, కావాల్సింది మౌలిక వసతులని సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ► అందరికీ రేషన్ బియ్యం ఇచ్చినందుకే ఓటేయాలని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కోరాడు. ఇదా పరిస్థితి?. ► దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్. ► దేశంలో అనారోగ్యమైన వాతావరణం నెలకొంది. రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, రాజకీయ పునరేకీరణ కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ► నూతన వ్యవసాయం, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. ప్రతీ ఒక్కరికీ పని చేసే అవకాశం రావాలి. అద్భుతమైన దేశ నిర్మాణం జరగాలి. అంతేకానీ, సంకుచిత రాజకీయం కాదన్నారు సీఎం కేసీఆర్. -
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు.. లైవ్ అప్డేట్స్
ప్లీనరీ అప్డేట్స్: 👉కేసీఆర్ విజన్ ఉన్ననేత అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే తెలుగు ప్రజల గుండెలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ రోజు తెలంగాణలో ఆచరిస్తున్నది.. దేశ వ్యాప్తంగా ఆచరించే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. 👉రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. తెలంగాణ పథకాలను పేరుమార్చి కేంద్రం కాపీకొడుతోందన్నారు. టీఎస్ ఐపాస్లాగా కేంద్ర సింగిల్ విండో తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతులకు 24 గంటల కరెంట్ అందుతోందన్నారు. 👉బీజేపీ నేతలు ఆత్మనిర్భర్ భారత్ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్ భారత్ అయ్యిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్, బంగ్లాదేశ్ మనకన్నా ముందన్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు. 👉బుధవారం టీఆర్ఎస్ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్‌లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలపారన్నారు. ► టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు భోజన విరామం. లంచ్ అనంతరం తిరిగి ప్రారంభం కానున్న సమావేశం. ► హరీశ్ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు మన్య రంజిత్ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు. ► కేంద్రంలో ఉంది సంకుచిత ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నులు పెరిగాయి. అప్పుల విషయంలోనూ కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటుందా? ఆంక్షలు ఎందుకు? బీజేపీకి రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. ఈ అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. ► కేంద్రం బాగుపడాలి.. రాష్ట్రాలు నష్టపోవాలి అన్నట్లుంది కేంద్రం తీరు: టీఆర్ఎస్ నేత హరీష్ రావు ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ► ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని బలపర్చిన మంత్రి గంగుల కమలాకర్. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ► దేశ పరిస్థితిని గాడిన పెట్టే శక్తులు తప్పకుండా వస్తాయి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టుకురాలేదా? అలాగే దేశానికి అవసరమైనప్పుడు.. దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్. ► పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ.. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నారు. ► దేశ రాజధాని దేవుడి పేరుతో మారణాయుధాలతో ఉరేగింపా? .. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. దేశానికి మంచి మార్గం చూపించొద్దా? ► దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలి. ► జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తినే దుర్భాషలాడుతారా? ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తారా? ఏ దేశమైన ఇలా చేస్తుందా? ఇదేం పెడ ధోరణి? ఇదేం సంస్కృతి. ► ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి దేశం కోసం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా రూపొందితే.. అది మనకే గర్వకారణం. ► ప్రధాని సొంత రాష్ట్రం సహా దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయని అన్నారు. ► వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి అని తెలిపారు. ► తెలంగాణ రాష్ట్రం పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కరెంట్ దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ పురోగతి ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మాట కాగ్, ఆర్థిక నిపుణులు సహా పలు నివేదికలు చెప్తున్న మాట. ► ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నెలవు. ఇప్పుడు జలధారకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ► అన్నింట్లోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంది. ► ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు సాధించాం. ► తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. ► డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం. ► దేశానికి తెలంగాణ పాలన రోల్ మోడల్. సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ► తెలంగాణకు టీఆర్ఎస్ కంచుకోట.. ఎవరూ బద్దలు కొట్టలేని రక్షణ కవచం. టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆస్తి. ► అనుకున్న లక్ష్యాలను ముద్దాడి, రాష్ట్ర కాంక్షను సాధించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి. ► 60 లక్షల మంది పార్టీ సభ్యులతో.. వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ టీఆర్ఎస్. ► ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెడుతోంది టీఆర్ఎస్ పార్టీ. ► టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రసంగం ప్రారంభం. ► టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు గౌరవ స్వాగతోపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం. ► హెచ్ఐసీసీకి చేరిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. వేదికపైకి చేరిక. ► ప్రగతి భవన్ నుంచి ప్లీనరీ ప్రాంగణానికి బయలుదేరిన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ► టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు హాజరుకానున్నారు. ► ఒకప్పుడు బెంగాల్లో ఏది జరిగితే.. దేశమంతా అదే జరిగేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఏది జరిగితే.. దేశమంతా అదే జరుగుతోంది. తెలంగాణలో ఒకప్పుడు కరువు, వలసలు ఉండేవి. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది: మంత్రి హరీష్‌రావు ► టీఆర్ఎస్లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం. ► తెలంగాణ భవన్లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ప్లీనరీ సమావేశంలో జాతీయ రాజకీయాలపై తీర్మానం ప్రవేశపెట్టనున్న కేటీఆర్. ► హైదరాబాద్ మాదాపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం జరగనున్న వేడుకల్లో.. పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ► తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. -
జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం సుమారు పది రోజుల క్రితం ప్రారంభమైన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తికాగా, వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం భోజనాల ఏర్పాట్లు మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. అందరి దృష్టీ ‘జాతీయ రాజకీయాలపైనే’ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని చేరడమే కాకుండా వరుసగా రెండు పర్యాయాలు అధికార పగ్గాలు చేపట్టింది. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తమ పార్టీ మేజర్ అయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్లీనరీలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనుండగా, జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్ర, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన వైఫల్యాలు ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానం ఆమోదించనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా తీర్మానాలు చేయనున్నారు. ఇప్పటికే తీర్మానాల వారీగా వక్తల పేర్లను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ రాక సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు గులాబీరంగు దుస్తులను ధరించి రావాలని ఆదేశించారు. ప్రతినిధులందరికీ ప్రత్యేక కిట్‌లో తీర్మానాల ప్రతులు, పెన్నులు, ప్యాడ్లు, పార్టీ జెండాలు తదితరాలు అందజేస్తారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ప్రతినిధుల పేర్లు నమోదు చేసి, పాస్‌ను పరిశీలించి లోని కి అనుమతిస్తారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. కేసీఆర్ ప్రా రంభోపన్యాసం తర్వాత తీర్మానాలపై చర్చ మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ తీర్మానాలు ఇవే.. ► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం ► దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం ► ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం ► బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం ► నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ► భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం ► తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ఊరూరా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో జెండా పండుగ నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు జెండా పండుగలో పాల్గొనాలని, గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఉదయం 9 గంటలకు తెలంగాణలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించాలన్నారు. బార్కోడ్ పాస్‌తో ప్రవేశం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని మొత్తం 22 కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది ప్రజా ప్రతినిధులు, నాయకులకు మాత్రమే పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 65 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్నా.. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపించామని, ఆహ్వానాలు అందని వారు మన్నించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీల ద్వారా ఆహ్వానాలు వెళ్లగా తొలిసారిగా ‘బార్కోడ్’తో కూడిన పాస్‌ను ఉపయోగించి సమావేశ ప్రాంగణంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో ప్రధాన వేదికతో పాటు మరో ఐదు డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. 33 రకాల వంటకాలు సమావేశ ప్రాంగణమంతా కేసీఆర్ భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో గులాబీమయం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరానికి దారితీసే ప్రధాన మార్గాలతో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లలో పార్టీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 33 రకాల వంటకాలు సిద్ధం చేయడంతోపాటు హెచ్ఐసీసీలో వేర్వేరు చోట్ల భోజన వసతి కల్పిస్తున్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగంతో పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గద్వాల, భద్రాచలం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన నేతలు మంగళవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. -
‘దేశ రాజకీయాలకు కేసీఆర్ పునాది’
శాంతినగర్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో దేశ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ వెళ్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, యావత్తు తెలంగాణ ప్రజలు ఆమోదించారని మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందాజగన్నాథం అన్నారు. మానవపాడు మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 27న కొంపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతమైందన్నారు. దశాబ్దాల కాలంగా పాలించిన బీజీపీ, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని ఫ్రంట్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. తుమ్మిళ్ల ప్రాజెక్ట్–1 పనులు పూర్తయినందున సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం కావాలంటే వెంటనే తుమ్మిళ్ల ఫేస్–2 పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ పనులు పూర్తయితే కెనాల్లో నీటిపారుదల నిలిచిన సమయంలో మూడు రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుందని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మానవపాడు మండల అధ్యక్షుడు రోశన్న, గ్రంథాలయ డైరెక్టర్ ఆత్మలింగారెడ్డి, సర్పంచ్ రాజశేఖర్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, ఎల్లారెడ్డి, శంకర్‌గౌడ్, రఘు, సీతారాముడు, దుబ్బన్న, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకంపనలు
-
ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు
-
'కేసీఆర్ అనే నేను' సినిమా తీస్తాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్లీనరీ జరగుతున్నది ప్రగతి ప్రాంగణంలో కాదని, తెలంగాణను అధోగతి చేసే ప్రాంగణం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుది నోరా.. మొరా అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని సాక్షాత్తు మండలిలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లీనరీలో కనీసం సోనియాను తలుచుకోకపోవడం దారుణమని, తెలంగాణ ఇచ్చిన వారిని గౌరవించుకునే సంస్కారం కేసీఆర్‌కు లేదంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీ అబద్ధాలకు, భజనలకు వేదిక అంటూ పొన్నం ఎద్దేవా చేశారు. దేశంలో అబద్దాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని అన్నారు. ప్లీనరీ కోసం పదవ తరగతి ఫలితాలను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ మచ్చర్ పహిల్వాన్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ అబద్దాలు, మోసాల మీద 'కేసీఆర్ అనే నేను' సినిమా తీస్తామని చెప్పారు. -
‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’
-
ప్రారంభమైన టీఆర్ఎస్ ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ శుక్రవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా వేదికపైన ఆటపాటలతో కళాకారులు, ప్లీనరీకి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. పార్టీ ప్లీనరీకి అనుకున్నట్లుగానే వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీ ప్రాంగణమంతా అంతా గులాబీమయం అయింది. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేదికపైకి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు. ప్లీనరీకి సుమారు 2 వేల పోలీసులతో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారులపై నిఘా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్లీనరీకి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోలిట్‌బ్యూరో సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. ప్లీనరీ ఆరు తీర్మానాలను ప్రతిపాదించనున్నారు. -
సబ్బండవర్ణాల సంక్షేమపథంలో..
సందర్భం అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ నేడు దేశం ముందు నిలబడింది. సంచలనాలకు కేంద్రమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్ భగీరథ, కులవృత్తుల పునర్జీవనం కోసం వివిధ పథకాలు భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి. సబ్బండ వర్ణాల సంక్షేమ పథంలో ఈ ప్లీనరీ ఒక మేలిమలుపు కాగలదని అందరూ ఆశిస్తున్నారు. 1946 నుంచి 1951 వరకు ఎగసిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావంతో తెలంగాణ ప్రజల్లో స్వీయ సామాజిక– సాంస్కృతిక స్పృహలు పెరిగాయి. 1956–71 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక వర్గంలో విద్య, కొద్ది మేర ఆర్థిక కార్యకలాపాలు, మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చాయి. మరో వర్గం తెలంగాణ వనరుల దోపిడీ వ్యతిరేకత, ఉమ్మడి రాష్ట్రంలో స్థానికేతరుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ నక్సలిజం వైపు మళ్లింది. ఈ ఉద్యమంతో తెలంగాణ సమాజం స్వీయ అస్తిత్వం, స్వీయ ఆర్థిక, రాజకీయ స్పృహలు బలపడ్డాయి. పై రెండు∙ఉద్యమాల కారణంగానే భూస్వామ్య పెత్తందారి వర్గాలు గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వలస పోయి అక్కడి సురక్షితమైన వ్యాపారాల్లోకి ప్రవేశించారు. దొరల పలాయనం పల్లెల్లో చదువులను, చైతన్యాలను పెంచాయి. సామాజిక, రాజకీయ చైతన్యం పురివిప్పుకుంది. ఇవన్నీ కలగలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక యువతరం ఉనికిలోకి వచ్చింది. తెలంగాణవాద సోయికి ఇదో పునాది. 1991– 2001 మధ్య కాలం వచ్చేసరికి అనేక కారణాలతో నక్సలిజం బలహీనపడుతూ ఆయుధం పట్టిన యువకుల వలసలు జనజీవన స్రవంతిలోకి మళ్లాయి. కానీ వారిలోని మానసిక అలజడి మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. తొలి నాళ్లలో సాయుధ పోరాట చైతన్యం, ఉనికిలోకి వచ్చిన యువతరం,మాజీ నక్సల్ తరం, ఏళ్లకేళ్లుగా దోపిడీకి మగ్గిన తరం అందరూ కలిసి నీళ్లు, నిధులు, నియామకాలను ఒక అనువైన నినాదంగా తీసుకున్నారు. ఈ నినాదాన్ని అందుకొనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారు. ఆ కాల్పులే మహోద్యమానికి నాంది 2001లో సిద్దిపేటలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకల వేదిక మీద తొలిసారి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతకు ముందు బషీర్‌బాగ్ వద్ద విద్యుత్తు ధరల తగ్గింపు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ ఘటనతో తీవ్రంగా చలించిన కేసీఆర్ బూరుగుపల్లి సభా వేదిక నుంచే అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి ప్రత్యక్షంగా రాష్ట్ర సాధన ఉద్య మానికి అంకురార్పణ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ధనికవర్గాల ఆధి పత్యంపై 1950 నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అటువంటి ఘర్షణలను దోపిడీ పట్ల వ్యతిరేకత అనే ముద్రతోనే చూశారు తప్ప తెలం గాణ జాతి స్పృహగా గుర్తించలేదు. 1956 నుంచి 2001 వరకు తెలంగాణ ప్రాంతం కోసం, ప్రజల కోసం నిలబడిన నేతలను వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. అలా నిలబడిన వారు కూడా వ్యక్తులుగానే ఉన్నారు. ఆæక్రమంలో టీఆర్ఎస్ ఆరంభం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు జీవం పోసింది. అక్కడ మొదలైన రాష్ట్ర ఏర్పాటు పోరాట ప్రస్థానం 13 ఏండ్లకు సాకా రమైంది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సిద్ధించింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు పార్టీ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. గతంలో జరిగిన ప్లీన రీలు పార్టీగా స్వరాష్ట్ర ప్రజలకు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేసుకునేం దుకు జరిగినవి అయితే, ఇప్పుడు జరుగుతున్న ప్లీనరీలో ప్రజలకు ఏం చేశా మన్న దానిపై సమీక్ష జరుపుకోవాల్సి ఉన్నది.. రైతులకు సాగునీరు, విద్యుత్‌ను అందించేందుకు, వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు గత నాలుగేళ్లలో జరి గిన నిర్విరామ కృషి బంగారు తెలంగాణ నిర్మాణానికి ఎన గర్రలుగా నిలబ డ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇదే వేగంతో కొనసాగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సబ్బండ వర్ణాలు భావిస్తున్నాయి. మన పాలన మన చేతికి వచ్చే నాటికే వ్యవసాయం, కుల వృత్తుల విధ్వంసం జరిగిపోయింది. తెలంగాణ పల్లెలో ఇప్పటికీ బోర్లు వేస్తే.. 1000 ఫీట్లు లోతుకు వెళ్లినా నీళ్లు రాని దుస్థితి. ఒక బోరు వేసినప్పుడు నీళ్లు రాక పోతే ఇంకో బోరు వేయటం.. ఇలా నీటి చెమ్మ కోసం ఐదు.. పది.. పదిహేను బోర్లు వేసి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా మూసంపల్లిలో బైరా రామిరెడ్డి అనే రైతు 54 బోర్లు వేసి బోర్ల రామిరెడ్డి అయ్యాడని సీఎం కేసీఆర్ 2015 సెప్టెంబర్ మాసంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి రైతు కన్నీటి నీటి గోస ఎలా ఉందో విడమరిచి చెప్పారు. కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణకు 1257 టీఎంసీల వాటా ఉందని అధికారిక నివేదికలు చెప్తున్నాయి. ఇందులో 954 టీఎంసీలు గోదా వరి నుంచి, 299 టీఎంసీలు కృష్ణానది నుంచి. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కలిపి తెలంగాణకు 1071 టీఎంసీల జలాలు ఇచ్చినట్టు ఉమ్మడి రాష్ట్ర పాలకులు నివేదికల్లో పొందుపరిచారు. కాళేశ్వరం ఒక సంచలన ప్రయోగశాల అయితే తెలంగాణలో అందుబాటులో ఉన్న సాగు భూమికి రకరకాల లెక్కలు ఉన్నాయి. అడవులు, గ్రామ కంఠాలు పోను ఒక కోటీ 11లక్షల ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. మరి 1071 టీఎంసీల కేటాయింపులు చేస్తే కోటి ఎకరాల మాగాణి నీళ్లెందుకు పారలేదనేది బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు వాటా జలాలను సంపూర్ణంగా మన బీడు భూముల్లోకి మళ్లించు కునే ప్రయత్నం జరుగుతోంది. గోదావరి, కృష్ణా నదుల మీద 23 ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన జరిగింది. ఇందుకోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు జరుగుతోంది. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల, దేవాదుల, ప్రాణహిత, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్, ఎస్సా రెస్పీ1,2, ఆర్డీఎస్, ఎస్సెల్బీసీ, ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టులకు రూపం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రూపం దాల్చకముందే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించిన జల ప్రాజెక్టుగా రికార్డు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5,683 మెగావాట్ల విద్యుత్తు సామ ర్థ్యం ఉంది. అందులో అనేక సాంకేతిక కారణాలతో ఎప్పుడూ 2,500 మెగా వాట్లకు మించి వాడుకోలేని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలోనైతే వ్యవ సాయానికి 1,000 మెగావాట్లు కూడా అందేది కాదు. నాలుగేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే రూ. 5500 కోట్ల ఖర్చుతో 24 గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును రైతాంగానికి ప్రభుత్వం అందిస్తోంది. ఒకప్పుడు వ్యవసాయ కరెంటు కోసం రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు 24 గంటల కరెంటు వద్దు అనే పరిస్థితిలోకి వచ్చారు. భూపాలపల్లి కేటీపీపీ నుంచి 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్రాజెక్టు నుంచి 1,200 మెగావాట్లు, థర్మల్ పవర్‌టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ సిస్టం ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రోపవర్ ప్రాజెక్టు నుంచి 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 30 మెగావాట్లు, సోలార్ పవర్ నుంచి 1080 మెగావాట్లు, విండ్ పవర్ నుంచి 99 మెగావాట్లు మొత్తం కలిపి ఈ నాలుగేళ్లలో మరో 5,039 మెగావాట్ల విద్యుత్తు అదనంగా ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. ఈలోగా రైతులను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించే సూక్ష్మ ప్రణాళికలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి.. కళ్యాణ లక్ష్మి పథకం అమలు ఇందులో భాగమే. పేదింటి ఆడబిడ్డ సగౌరవంతో అత్తవారింట అడుగు పెట్టేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ అమల్లోకి వచ్చాయి. మొదట దళిత, గిరిజను లకు మాత్రమే పరిమితమైన పథకాన్ని వెనుకబడిన అన్ని వర్గాలకు విస్తరిం చారు. రూ 50001 నుంచి రూ ఒక లక్షా నూట పదహార్లకు పెంచారు. పెళ్లితోనే అయిపోలేదు. తెలంగాణ పల్లెల్లో బిడ్డ మొదటి పురుడు తల్లిగారింట్లోనే జర గాలనే ఆచారం ఉంది. బిడ్డను ప్రయివేటు ఆసుపత్రికి తీసుకొని పోయి కాన్పు చేసుకొని తల్లీబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకునేసరికి మరో రూ 40 వేలు ఖర్చు. రైతుకు ఈ బాధ తప్పించడానికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయివేటుకు దీటుగా అధునాతన వైద్య, మిషనరీ సౌకర్యాలు కల్పించారు. తల్లీ బిడ్డలకు రూ 16 వేలను అందిస్తున్న కేసీఆర్ కిట్ పథకం మాతృ శిశు సంక్షేమం కోరుకుంటోంది. నా నియోజకవర్గం దుబ్బాకలో ఒకప్పుడు తొండలు గుడ్లు పెట్టిన ప్రభుత్వ ఆసు పత్రిలో ఈ రోజు నెలకు కనీసం 40కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే రైతుకు పెళ్లి భారం రూ ఒక లక్షా నూట పదహార్లు, పురుడు రూ 40 వేలు, దానికి వడ్డీ భారం తప్పి, ఇప్పుడు జన్మనిచ్చిన తల్లి చేతికే రూ. 14 వేలు అందుతున్నాయి. అన్నదాతలకు సరికొత్త ఊపిరి భగీరథ ఊట బావులు, చెరువులు, చెలిమెలు తప్ప మరో నీటి వనరు లేని ప్రాంతం తెలంగాణ. అయినా నేలను దున్ని బతకటం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే ముందుగా చెరువులు బాగు చేసే పనులు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెరువులను, కుంటలను పునర్నిర్మాణం చేసే మహా యజ్ఞం చేపట్టారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో, భూగర్భ జలాలతో కలిపి 500 టీఎంసీల నీళ్లు నిల్వ చేసినట్టే అని జాతీయ పరిశోధక సంస్థలు వెల్ల డించాయి. భూస్వామి ఇంటి ముందే కాదు, దళిత, గిరిజనుల ఇళ్ల ముందూ ట్రాక్టర్లను నిలబెట్టింది. యంత్రలక్ష్మీ పథకం కింద వ్యవసాయ పరికరాలను రైతులకు ఇవ్వడం కోసం గత మూడేళ్ళలో రూ.1,109 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర రైతులకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4000 ఇవ్వనుండటం అద్భుతం. వచ్చే వానాకాలం నుంచే ఈ పథకం అమలవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి బడ్జెట్లో రూ. 12,000 కోట్లు కేటాయించారు. మే 10 నుండి వారం రోజులు 58 లక్షల మంది రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. పట్టెడన్నం పెట్టే అన్నదాత పురుగుల మందు బారిన పడకుండా, అప్పులు తీరి, ఆదాయం పెరిగి, రైతులు ఆత్మాభిమా నంతో బతకాలన్నదే కేసీఆర్ ఆలోచన. అంపశయ్య మీదున్న అన్నదాతకు ఊపిర్లు ఊది మళ్లీ పొలం మీదకు పంపే మహా ప్రయోగశాలగా తెలంగాణ వేదిక అయింది. దూపగొన్న ప్రతి గొంతును తడిపేందుకు మిషన్ భగీరథ, కుల వృత్తుల పునర్జీవనం కోసం గొర్రెల పథకం, చేపల పెంపకం, గీత, నేత న్నలకు వరాలు అన్నీ కలిసి భవిష్యత్తు బంగారు తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తాయని సబ్బండ జాతులు కాంక్షిస్తున్నాయి. (నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా) -సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
‘టీఆర్ఎస్ ప్లీనరీలో సమాధానమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో గురువారం అన్ని రాష్ర్టాల జౌళి శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జియోట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణలో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలుకు, అద్దకాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. చేనేత మగ్గాలు ఎక్కడున్నా వాటికి యూనిక్ కోడ్లు ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడమంటే కాంగ్రెస్ నాయకులకు చేతకాదని విమర్శించారు. అసెంబ్లీ బయట సమస్యలపై మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్నీ విమర్శలకు సమాధానమిస్తామని కేటీఆర్ అన్నారు. Attended an important meeting chaired by @smritiirani Ji on Centre- State collaboration to promote Handloom & Handicrafts Shared Telangana progress on Geotagging of Handlooms, 50% subsidy on Yarn & Dyes, Thrift scheme, Buy back scheme. Flagged concerns on GST & health Insurance pic.twitter.com/5IBWQjqrXs — KTR (@KTRTRS) April 26, 2018 -
ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్లీనరీ
-
టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలు ఆరే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో తీర్మానాల సంఖ్యను వీలైనంత కుదిస్తున్నారు. మరీ అనివార్యమైతే మినహా ఆరు తీర్మానాలకే పరిమితం కావాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఒక అంశానికి సంబంధించిన అనుబంధ తీర్మానాలన్నింటినీ ఒకే తీర్మానంగా చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలపైనా ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం రూపొందించాలని ఆదేశించారు. ప్లీనరీ తీర్మానాల కమిటీతో సీఎం బుధవారం రాత్రి సమావేశమై తీర్మానాలకు తుదిరూపు ఇచ్చారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు వంటివన్నీ కలిపి ఒకే తీర్మానంగా ప్రతిపాదించనున్నారు. సంక్షేమంపై తీర్మానంలోనే అన్ని వర్గాల సంక్షేమంపైనా తీర్మానం ప్రతిపాదిస్తారు. విద్య, వైద్యం వంటి అన్ని అనుబంధ అంశాలను కలిపి తీర్మానంగా చేయనున్నారు. వ్యవసాయం, విద్యుత్, రైతుబంధు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్ వంటి వాటన్నింటినీ సాగునీటి రంగంపై తీర్మానంలోనే అనుబంధంగా చేర్చాలని కేసీఆర్ సూచించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ కలిపి ఒక తీర్మానం చేయనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమంపై ఒక తీర్మానం చేయనున్నారు. అన్ని అంశాలనూ ఈ ఆరు తీర్మానాల్లోనే అనుబంధంగా చేర్చాలని కేసీఆర్ ఆదేశించారు. తలకాయ నుంచి నాటుకోడి దాకా ప్లీనరీలో నోరూరించే తెలంగాణ వంటకాలు అలరించనున్నాయి. తలకాయ కూర, పాయ, మటన్ షోర్బా, నాటుకోడి కూర, బిర్యానీ, బగారా అన్నంతో పాటు పచ్చి పులుసు, దాల్చె, జొన్న రొట్టె, అంబలి తదితరాలు సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సల్ల (మజ్జిగ) అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో ప్లీనరీ వేదిక, ప్రాంగణంతో పాటు నగరంలోనూ అలంకరణ ఏర్పాట్లను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు చూస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ రోజూ సమీక్షిస్తున్నారు. -
నియోజకవర్గం నుంచి 100 మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఆహ్వానించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 100 మంది వరకు వివిధ స్థాయి ల్లోని పార్టీ నేతలను ఆహ్వానించనున్నారు. ఆహ్వానితుల జాబితాను ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నగర పాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నియోజకవర్గాల బాధ్యులు, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులు, రీజినల్ మహిళా ఆర్గనైజర్లను ఈ ప్లీనరీకి ఆహ్వానిస్తున్నారు. మొత్తంగా 12 వేల నుంచి 15 వేల మంది హాజరుకానున్నారు. 9 కమిటీలు.. ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ కమిటీల్లో ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరుగురితో ఏర్పాటు చేసిన తీర్మానాల కమిటీతో కలుపుకుని.. మొత్తంగా 9 కమిటీల బాధ్యులు, తమకు అప్పగించిన పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి రంగంలోకి దిగారు. పకడ్బందీ ఏర్పాట్లు టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్లో ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్కింగ్, ప్రతినిధుల నమోదు, భోజనాలకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా సాంçస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతించిన ప్రాంతాల్లో హోర్డింగులు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్లీనరీ ఆహ్వానితులు ఈనెల 27న ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి సూచించారు. ప్లీనరీ నిర్వహణ కమిటీలివి.. తీర్మానాల కమిటీ: కె.కేశవరావు(పార్లమెంటరీ పార్టీ నేత) ఆహ్వాన కమిటీ: పట్నం మహేందర్ రెడ్డి (రవాణా శాఖ మంత్రి), సీహెచ్ మల్లారెడ్డి (ఎంపీ) సభా ప్రాంగణం, వేదిక: గ్యాదరి బాలమల్లు (టీఎస్ఐఐసీ చైర్మన్), శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ) ప్రతినిధుల నమోదు, పార్కింగ్: కె.పి.వివేకానంద గౌడ్ (ఎమ్మెల్యే), ఎం.సుధీర్ రెడ్డి (ఎమ్మెల్యే), సీహెచ్ కనకారెడ్డి (ఎమ్మెల్యే) నగర అలంకరణ: బొంతు రామ్మోహన్ (జీహెచ్ఎంసీ మేయర్) వలంటరీ కమిటీ: మైనంపల్లి హన్మంతరావు (ఎమ్మెల్సీ), బాబా ఫసీయుద్ధీన్ (జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్), చిరుమళ్ల రాకేశ్(టీఎస్టీఎస్సీ చైర్మన్) భోజన కమిటీ: మాధవరం కృష్ణారావు (ఎమ్మెల్యే) మీడియా కో ఆర్డినేటర్లు: బాల్క సుమన్ (ఎంపీ), కర్నె ప్రభాకర్ (ఎమ్మెల్సీ), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సాంస్కృతిక కమిటీ: రసమయి బాలకిషన్ (సాంస్కృతిక సారథి చైర్మన్) -
టీఆర్ఎస్ ప్లీనరీ ఖమ్మం రైతులను ముంచింది
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సాక్షి, ఖమ్మం: ‘టీఆర్ఎస్ ప్లీనరీ కోసం మార్కెట్ యార్డు ల్లో ఆ శాఖ మంత్రి హరీశ్ రావు బస్తా మోస్తే రూ.6 లక్షల కూలి ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు.. వ్యాపారుల దగ్గర కూలీ చేయ డంతో వారు.. తాము ఏమైనా చేసుకోవచ్చని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఖమ్మం జిల్లా రైతుల కొంపముంచింది’అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నా రు. బుధవారం ఖమ్మం జిల్లా జైలులో ఉన్న మిర్చి రైతుల కుటుంబాలను వారు పరామర్శించారు. నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా జైలులో ఉన్న రైతులను, నేతలు పరామర్శించి అనంతరం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. జైలుపాలైన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఎస్టీ కమిషన్, గవర్నర్‌కు విన్నవిస్తామన్నారు. -
‘టీఆర్ఎస్ సభతో జనానికి ఇబ్బందులు’
హైదరాబాద్: వరంగల్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్లీనరీకి ట్రాక్టర్లలో జనం తరలింపు ఏమిటని ప్రశ్నించారు. ఈ సభ నేపథ్యంలో ప్రతి పక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్ చెయ్యడం ఏం ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో పూర్వ విద్యార్థులుగా తమకు కనీసం ఆహ్వానం పంపలేదని ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అక్కడ చదువుకున్న ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. సభలో సీఎం, గవర్నర్ మాట్లాడకపోవడం అందరికీ అవమానకరమని తెలిపారు. -
కూలీ బాగోతంతో బిల్డప్: చాడ
సాక్షి, హైదరాబాద్: గులాబీ కూలీల పేరిట టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పార్టీ నాయకుల కూలీ సంపాదనతోనే టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించినట్లుగా కూలీ బాగోతంతో బిల్డప్ ఇచ్చారని ధ్వజమెత్తారు. కూలీలతో రాజకీయ నాయకులు రూ.లక్షల్లో డబ్బులు సంపాదించినపుడు మండుటెండల్లో కాయకష్టం చేసే నిజమైన కూలీలు ఎందుకు బతకలేకపోతున్నారని ప్రశ్నించారు. శనివారం మఖ్దూంభవన్‌లో మల్లేపల్లి ఆదిరెడ్డితో కలసి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీ యావత్తు కేసీఆర్ భజన చేయడం, డబ్బాకొట్టడం మినహా మరేమీ లేదని.. కేసీఆర్‌ను మెచ్చుకోకపోతే టీఆర్ఎస్ నాయకులకు బతుకు లేదన్నారు. రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములు, అటవీహక్కుల చట్టాలు, సాదాబైనామాల అమలు అంశాలపై ప్లీనరీలో చర్చించలేదన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ అరిగిపోయిన రికార్డును వినిపించారని, ఎరువులను ఉచితంగా సరఫరా చేస్తామంటూ రైతులను ఊరించే ప్రయత్నం చేయకుండా ఈ ఏడాది నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న మిర్చి, కంది రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. సిద్దిపేట, బోయినపల్లి మార్కెట్లలోనే కాకుండా అన్ని మార్కెట్లలో రూ.5 సద్దన్నం పథకం అమలు చేయాలన్నారు. -
టీఆర్ఎస్ పార్టీ నియమావళికి సవరణలు
మూడు మార్పులకు ప్లీనరీలో ఆమోదం సంస్థాగత ఎన్నికలు ఇక నాలుగేళ్లకోసారి.. జిల్లా కమిటీలు రద్దు నియోజకవర్గ కమిటీలదే కీలక పాత్ర సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నియమావళిలో మూడు మార్పులను చేస్తూ పార్టీ 16వ ప్లీనరీ నిర్ణయం తీసుకుంది. పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఇక నుంచి జిల్లా కమిటీలు ఉండవని, జిల్లాలో కేవలం సమన్వయం కోసం కన్వీనర్ ఉంటారని ప్రకటించారు. రెండో మార్పుగా.. నియోజకవర్గ కమిటీలను కొత్తగా తెరపైకి తెచ్చారు. జిల్లాల్లో ఇక నుంచి నియోజకవర్గ కమిటీలకే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉండి, అధ్యక్షుడిగా పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అలాగే ఇక నుంచి రెండేళ్లకోసారి కాకుండా పార్టీ సంస్థాగత ఎన్నికలను నాలుగేళ్లకోసారి జరపాలని మూడో సవరణ చేశారు. ఎన్నికల సంఘం సైతం నాలుగేళ్లకోసారి పార్టీ ఎన్నికలు పెట్టుకోవచ్చని ప్రకటించిందని, దీంతో టీఆర్ఎస్ ఎన్నికల కాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ మార్పులు చేసినట్లు కేకే తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేత కృష్ణమూర్తి ఈ ప్రతిపాదను బలపరచగా.. ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ సంధానకర్తగా ఉండాలని, ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకే మార్పులు చేసినట్లు ప్రకటించారు. రూ.2.25 కోట్ల విరాళాలు పదహారో ప్లీనరీ సందర్భంగా పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు విరాళాలు ప్రకటించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సలీం రూ.కోటి చొప్పున చెక్కులను పార్టీ సెక్రటరీ జనరల్ కేకేకు అందజేశారు. పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి రూ.25 లక్షల చెక్కు అందజేశారు. ‘విత్తనాల ధరలు తగ్గించాలి’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (సీపీఐ) డిమాండ్ చేసింది. విత్తనాలు, పురుగు మం దుల కొనుగోళ్లకు వచ్చే వానాకాలం పంట నుంచే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయా లని సంఘ ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. సబ్సిడీపై రైతులకు పంపి ణీ చేసే విత్తనాల ధర మార్కెట్ ధరకు సమానంగానే ఉన్నాయని విమర్శించారు. -
మటన్ బిర్యానీ.. కొర్రమీను వేపుడు..
నోరూరించిన వంటకాలు - 26 రకాల పసందైన వెరైటీలు - 150 మంది వంటగాళ్లు.. 350 మంది వలంటీర్లు సాక్షి, హైదరాబాద్: మటన్ దమ్కా బిర్యానీ... దమ్కా చికెన్ ఫ్రై.. గుడ్డు పులుసు.. మిర్చీకా సాలన్.. కొర్రమీను వేపుడు.. రొయ్యల ఫ్రై.. ఇలా ఘుమఘుమలాడే వంటకాలెన్నో ప్లీనరీలో నోరూరించాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వంటకాలను ఆరగించి అదుర్స్ అని మెచ్చుకున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో 26 రకాల ప్రత్యేక వంటకాలతో సుమారు 15–20 వేల మంది ప్రతినిధుల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వంటకాల తయారీకి సుమారు రూ.20 లక్షలు ఖర్చయినట్లు అంచనా. మెనూలో ఉన్న ప్రత్యేక వంటకాలను నల్లకుంట ప్రాంతానికి చెందిన స్పందన క్యాటరర్స్ యజమాని పి.రమేశ్ నేతృత్వంలో సిద్ధం చేశారు. వంటకాల తయారీలో 150 మంది పాల్గొన్నారు. అతిథులకు కొసరి కొసరి వడ్డించేందుకు 350 మంది వలంటీర్లను అందుబాటులో ఉంచారు. వీరంతా గురువారం రాత్రి నుంచే వంటకాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇదీ మెనూ.. 2,500 కిలోల మటన్‌తో దమ్కా బిర్యానీ తయారుచేశారు. 3000 కిలోల చికెన్‌తో దమ్కా బిర్యానీ సిద్ధం చేశారు. 15 వేల గుడ్లతో గుడ్డుపులుసు, 200 కిలోల చేపలు, 200 కిలోల రొయ్యల వేపుడు సిద్ధం చేశారు. 700 కిలోల మాంసంతో మటన్ కర్రీ చేశారు. మటన్ దాల్చాకు 300 కిలోల మాంసాన్ని వినియోగించారు. 200 లీటర్ల పాలతో పైనాపిల్ ఫిర్నీ స్వీట్ తయారు చేశారు. ఫ్లమ్ కేక్ ఐస్‌క్రీమ్ అతిథుల నోరూరించింది. శాకాహారుల కోసం మిర్చీకా సాలన్, ఆలుగోబీ టమాటా కుర్మా, గంగవాయిలి కూర పప్పు, వెజ్ దాల్చ, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, దోసకాయ చట్నీ, ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీం వడ్డించారు. -
ప్లీనరీ సక్సెస్
పార్టీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం - తీర్మానాల రూపంలో ప్రభుత్వ ప్రగతి నివేదిక - వేదికపై మాట్లాడేందుకు అమాత్యులకు నో చాన్స్ - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే తీర్మానాల బాధ్యత - ఇక వరంగల్ బహిరంగ సభపై నేతల దృష్టి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంతో కీలకంగా భావించిన పదహారో ప్లీనరీ విజయవంతం కావడం తో పార్టీ నాయకత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్లీనరీని విజయవంతం చేసేందుకు గడచిన 15 రోజులుగా పార్టీ యంత్రాంగం శ్రమించింది. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల శాఖల కమిటీల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఇలా.. వరుసగా పార్టీ యంత్రాంగం బిజీబిజీగా గడిపింది. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభతో పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ముగిసినట్టే. ప్లీనరీలో గడిచిన మూడే ళ్లలో ప్రభుతం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలు, కార్యక్రమాల ప్రగతి నివేదికను తీర్మానాల రూపంలో సమర్పించారు. ప్రభుత్వ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పార్టీ నాయత్వం భావిస్తున్న నేపథ్యంలో.. వాటికి తీర్మానాల రూపం ఇచ్చి చర్చకు పెట్టారు. అలాగే ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు ప్రభుత్వ పనితీరు, పథకాలపై అవగా హన కల్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్ల పాలన ప్రగతి నివేదికను ప్రకటించిన టీఆర్ఎస్.. భవిష్యత్ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రానున్న రెండేళ్లలో ఏం చేయనున్నారన్న అంశాన్ని రేఖా మాత్రంగానే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు చేయనున్న ఆర్థిక సాయం అంశాన్ని ప్రత్యేక అంశంగా చేపట్టింది. ఈ ఒక్క అంశానికే ప్రాధాన్యం ఇచ్చి చర్చకు పెట్టింది. ప్రతిపక్షాలపై విమర్శలు.. తమ ప్రభుత్వ పనితీరు, విజయాలను వివరిస్తూనే పార్టీ నేతలు విపక్షాలపైనా విరుచుకుపడ్డారు. సాగునీ టి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షా లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనపైనా సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. కాగా ప్లీనరీలో మం త్రులంతా మౌనంగానే ఉన్నారు. ఒక్క మంత్రికి కూడా మాట్లాడే అవకాశం రాలేదు. తీర్మానాలను ప్రతిపాదించడం, బలపర చడం వంటి బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకే ఇవ్వడం తో మంత్రులు వేదికపై కూర్చోవడానికే పరిమిత మయ్యారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న అయి దుగురు మహిళల్లో.. ఇద్దరికి ప్లీనరీలో మాట్లాడే అవకాశం దక్కింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపు ష్టం–వృత్తులు అంశంపై ఎమ్మెల్యే కొండా సురేఖ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లా డారు. ఆమె చేసిన ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. 15 లక్షల మందితో సభ! ప్లీనరీ విజయవంతం కావడంతో ఇక వరంగల్ బహిరంగ సభపై దృష్టి పెడతామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న నిర్వహించే ఈ సభకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉద్యమ పార్టీగా ఇదే వరంగల్‌లో 10 లక్షల మందితో సభ జరిపామని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో బహిరంగ సభను 15 లక్షల మందితో జరిపేందుకు శ్రమిస్తున్నామని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు. -
గులాబీ పండుగ
-
టీఆర్ఎస్ నిబంధనల్లో భారీ మార్పులు
-
టీఆర్ఎస్ నిబంధనల్లో భారీ మార్పులు
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సంస్థాగత నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రెండేళ్లకోసారి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుండగా, ఇకపై ఆ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచారు. జిల్లా కమిటీలను పూర్తిగా రద్దుచేశారు. ఇక జిల్లా కమిటీల బదులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతాయి. ఈ కమిటీల కాలపరిమితి కూడా నాలుగేళ్లకు పెంచారు. ఈ నిర్ణయాలను టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంపల్లి(హైదరాబాద్)లోని జీబీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పార్టీ 16వ ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ప్లీనరీ ముగింపు సంసందర్భంగా ప్రసంగించిన కేసీఆర్ విమర్శకులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. ’ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం. విపక్షాలు గుడ్డి విమర్శలు మానుకోవాలి. అవినీతిని పెంచిపోషించింది గత ప్రభుత్వాలే. మేం అవినీతిపై యుద్ధం చేస్తున్నాం’అని కేసీఆర్ అన్నారు. ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసంలో రైతాంగంపై వరాలు కురిపించిన ముఖ్యమంత్రి.. ముగింపు వ్యాఖ్యల్లోనూ రైతు సంబంధిగత అంశాలను ప్రస్తావించారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు ఎంత నష్టపోతే, ఆ మెత్తాన్నీ కంపెనీలు చెల్లించేలా త్వరలో చట్టం రూపొందిస్తామని చెప్పారు. ప్లీనరీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సీఎం తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్‌లో జరగబోయే భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎనిమిదోసారి కేసీఆర్.. ఏడు తీర్మానాలు.. టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభానికి ముందే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. తద్వారా వరుసగా ఎనిమిదోసారి కేసీఆర్ ఆ పదవిని చేపట్టినట్లైంది. అట్టహాసంగా జరిగిన ప్లీనరీలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించారు. వీటిలో సంక్షేమం, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక, నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర తీర్మానాలున్నాయి. (చదవండి: రైతన్నలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!) (టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్) -
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
-
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. పన్నెండు సెట్ల నామినేషన్లు వచ్చాయని, అయితే అందరూ కేసీఆర్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారన్నారు. ఎన్నికలకు సహకరించిన అందరికీ నాయిని ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. కాగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసిఆర్ తిరిగి ఎన్నికయిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు కేసీఆర్ ఎన్నికతో మంత్రులు, ఎంపీలు తెలంగాణ భవన్లో మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీ సమావేశాలకు కొంపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికార పీఠాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడంతో ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి నివేదికను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్లీనరీ వేదికను ఉపయోగించుకోనున్నారు. -
'గులాబీ'ల పండుగ నేడే
-
'గులాబీ'ల పండుగ నేడే
► మరోమారు అధ్యక్షుడిగా కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన లేనట్టే? ► నేడు టీఆర్ఎస్ 16వ వ్యవస్థాపక దినోత్సవం.. కొంపల్లిలో ప్లీనరీ ► అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏడు తీర్మానాలు ► ప్రభుత్వ పనితీరుపై సవివరమైన చర్చ ► 15 వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు ► 2 వేల మంది పోలీసులతో బందోబస్తు సాక్షి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. శుక్రవారం కొంపల్లిలో జరగనున్న ఈ ప్లీనరీలో సీఎం, పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒకే నామినేషన్ మిగిలిన నేపథ్యంలో కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిలో సంక్షేమ రంగ తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్లీనరీకి పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన 8 వేల మంది ఇవ్వనున్నారు. ప్లీనరీకి పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన ఎనిమిది వేల మంది ప్రతినిధులను ఆహ్వానించారు. భోజనాలు తదితర ఏర్పాట్లు మాత్రం పదిహేను వేల మందికి సరిపోయేట్లు చేస్తున్నారు. సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మూడేళ్లు.. వచ్చే రెండేళ్లు.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడం, వచ్చే రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో.. ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధిని, వచ్చే రెండేళ్లలో చేపట్టనున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. ఈ ఆలోచనతోనే ప్లీనరీ జరుగుతున్న ప్రాంతానికి ‘తెలంగాణ ప్రగతి ప్రాంగణం’అని పేరు పెట్టారని చెబుతున్నారు. వచ్చే ఏడాది నాటికి ఎన్నికల ముంగిట్లో ఉన్నట్టే కాబట్టి.. అప్పటి హామీలను ఎన్నికల ముందు ఇచ్చేవిగా భావించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనే దానిపై తమకు రెండేళ్ల ముందు నుంచే ఉన్న స్పష్టతను తెలియజెప్పేందుకు ప్లీనరీని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలనే కాకుండా, సంక్షేమ రంగంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల గురించి ప్రచారం చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటన లేనట్టే! కొద్ది నెలలుగా టీఆర్ఎస్లో అంతర్గత పోరు సాగుతోందన్న ప్రచారం బలంగా ఉంది. కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు (కేటీఆర్), మంత్రి హరీశ్‌రావులు రెండు వర్గాలుగా విడిపోయారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ జిల్లాల్లో పార్టీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పజెబుతారని, ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని, దానిని ఈ ప్లీనరీలోనే ప్రకటించవచ్చని ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఉద్దేశమేదీ కేసీఆర్‌కు లేదని, ఇప్పట్లో ఎలాంటి ప్రకటనా ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆరే ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతారని, రెండేళ్ల వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు కాబట్టి, ఆయన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతారని పేర్కొంటున్నాయి. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, అంతా కలసికట్టుగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వడం, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూడడం ప్లీనరీ ముఖ్య ఉద్దేశమని చెబుతున్నాయి. ఇవీ తీర్మానాలు ప్లీనరీలో ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వాటిలో అంతర్భాగంగా మరికొన్ని అంశాలు ఉంటాయి. వాటిని ప్రవేశపెట్టి, చర్చించడానికి ఏడుగురు నేతలను ఎంపిక చేశారు. తీర్మానాలపై చర్చలో ఈసారి మంత్రులకు అవకాశం ఇవ్వడం లేదని పార్టీ వర్గాల సమాచారం. సాగునీటి పారుదల వ్యవస్థ, వ్యవసాయం – నిరంజన్‌రెడ్డి, వృత్తులు (గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం)– కొండా సురేఖ, మిషన్ భగీరథ– వేముల ప్రశాంత్‌రెడ్డి, విద్యుత్ రంగంలో విజయాలు (ఐటీ, పరిశ్రమలు కూడా )– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రగతికాముక పథకాలు– ఎంపీ వినోద్ కుమార్, సంక్షేమం– పాయం వెంకటేశ్వర్లు, సామాజిక రుగ్మతల నియంత్రణ (పేకాట, గుడుంబా, అనవసర ఆపరేషన్ల కంట్రోల్)– నారదాసు లక్ష్మణ్‌రావు. ఇదీ ఎజెండా.. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభిస్తారు. అనంతరం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగత ఉపన్యాసం ఉంటుంది. కె.కేశవరావు తొలి పలుకులు, తీర్మానాలపై చర్చ, మధ్యాహ్నం 1.30 గం. నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం, తీర్మానాలపై చర్చ కొనసాగింపు, కేసీఆర్ ముగింపు ఉపన్యాసం ఉంటాయి. అయితే మంచి ముహూర్తం ఉండటంతో ప్లీనరీ ప్రారంభానికి ముందే శుక్రవారం ఉదయం 9.55 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికను ప్రకటించనున్నారు. -
అలాకాదు.. ప్లీనరీకి ఇలా రండి!
ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకు రేపు ట్రాఫిక్ ఆంక్షలు - రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అధికార యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో రావాలని చెప్పారు. ► మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల్ నుంచి వచ్చే వాహనదారులు నేషనల్ హైవే 44, ఓఆర్ఆర్ శంషాబాద్, పటాన్చెరు, సుతారి గూడ, ఎన్‌హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్డు జంక్షన్ మీదుగా ప్లీనరీ జరిగే పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట్, పటాన్చెరు నుంచి వచ్చే వాహనదారులు బాంబే హైవే, పటాన్ చెరు, సుతారి గూడ, ఎన్‌హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్లేస్‌కు చేరుకోవాలి. ► నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, చౌటుప్పల్, హయత్‌నగర్‌ల నుంచి వచ్చే వాహనదారులు ఎన్‌హెచ్65, ఓఆర్ఆర్ పెద్ద అంబర్‌పేట, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట, రాజీవ్ రహదారి, తూముకుంట, హకీంపేట్, బొల్లారం చెక్‌పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల, గోదావరిఖని, రామ గుండం, మంచిర్యాల, అసిఫాబాద్ నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్ –1), శామీర్‌పేట, తూముకుంట, హకీంపేట, బొల్లారం చెక్‌పోస్టు, బొల్లారం రైల్వేగేట్ నుంచి పార్కింగ్ వద్దకు చేరుకోవాలి. ► రామాయంపేట, తుఫ్రాన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనదారులు నేషనల్ హైవే 44, మేడ్చల్, కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, జోగిపేట, నారాయణఖేడ్ నుంచి వచ్చే వాహనదారులు స్టేట్ హైవే–6, నర్సాపూర్, గగిల్పూర్ (ఓఆర్ఆర్ ఎంట్రీ నంబర్ 5), సుతారిగూడ (ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 6), ఎన్‌హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ఏటూరునాగారం, జనగాం, భువనగిరిల నుంచి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్ 163, ఓఆర్ఆర్ పెద్దఅంబర్‌పేట, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట, రాజీవ్ రహదారి, తూముకుంట, హకీంపేట, బొల్లారం చెక్‌పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► నారాయణ్‌పేట్, కొండగల్, కోస్గి, తాండూర్, వికారాబాద్, చేవెళ్ల నుంచి వచ్చే వాహనదారులు టీఎస్పీఏ, పటాన్చెరు, సుతారిగూడ, ఎన్‌హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్‌గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. జంటనగరాల నుంచి బయల్దేరే వారికి.. ► హైదరాబాద్ నగరం నుంచి వచ్చే వాహనదారులు సికింద్రాబాద్, ప్యారడైజ్, ట్యాంక్‌బండ్, బాపూజీ నగర్, బోయిన్పల్లి, చెక్‌పోస్టు, ఎన్‌హెచ్ 44, సుచిత్ర జంక్షన్, లయోలా కాలేజ్ రోడ్డు, హెచ్ఎంటీ కాలనీ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనదారులు జేబీఎస్, రాజీవ్ రహదారి, కార్ఖానా, లోతుకుంట, బొల్లారం చెక్‌పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నుంచి వచ్చే వాహనదారులు మియాపూర్, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్, అయోధ్య జంక్షన్, సుతారిగూడ, ఎన్‌హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్ గూడ రోడ్డు జంక్షన్ నుంచి ప్లీనరీ జరిగే పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. ఐదు లక్షల మజ్జిగ ప్యాకెట్లు వరంగల్ జిల్లాలో నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణుల దాహం తీర్చేందుకు సుమారు 5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, హçస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ తదితరులు లాలాపేటలోని విజయ డెయిరి ప్రధాన కార్యాలయంలో ఎండీ. కె. నిర్మలతో చర్చించారు. -
‘60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్’
హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా ఇంకా తెలంగాణ పూర్తిస్థాయిలో కుదురుకోకముందే మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 21శాతం వృద్ధి రేటుతో తెలంగాణ మిగితా రాష్ట్రాలకంటే వేగంగా దూసుకెళుతోందని చెప్పారు. ఈ నెల 21న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కొంపల్లి జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ‘దేశానికే దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌గా నిలుస్తోంది. ఏ రాష్ట్రంలో అమలుచేయనన్ని పథకాలతో తెలంగాణ దేశంలోనే ముందుంది. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా కార్యక్రమం తీసుకొచ్చాం. దీనిని దేశంలోని ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, అధికారులు వచ్చి తెలుసుకొని తమ రాష్ట్రాల్లో అమలుచేయబోతున్నారు. టీఎస్ ఐపాస్‌తో పారిశ్రామిక విధానం కొత్త పుంతలు తొక్కించాం. సంక్షేమ రంగంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంలా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్నారు. 15 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. అంతేకాకుండా రైతులకు అద్భుతంగా సహాయం చేసేలా ఎరువులను ఉచితంగా అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదొక బృహత్తర కార్యక్రమం. ఏదేమైనా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అందుకే. అంత ఘనంగా పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. 21నాడు పెద్ద మొత్తంలో ప్రతినిధులు పాల్గొంటున్నారు. 10 నుంచి 16వేలమంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. దాదాపు 60 ఎకరాల్లో ప్లీనరీ, ప్రధాన సభా ప్రాంగణం 5 ఎకరాల్లో ఉంటుంది. భోజనం, మంచినీళ్లు, మజ్జిక ప్యాకెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం. ప్రతినిధులకు, వీఐపీలకు నాయకులకు, మీడియాకు వేర్వేరుగా ఆరు భోజన శాలలు, సీఎంకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సమావేశ ప్రాంగణానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. 75 ఎకరాల్లో పార్కింగ్, 31 జిల్లాలకు సంబంధించి 31 కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. సమావేశ ప్రాంగణానికి కొన్ని ప్రధాన రహదారులను కూడా అనుసంధానిస్తున్నాం. ఎండలు బాగా ఉన్నందున మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నాం. వెయ్యిమంది వాలంటీర్లు వైర్ లెస్ వాకీ టాకీలతో పనిచేయనున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. -
‘60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్’
-
నేడు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
-
రేపు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నామినేషన్ వేయనున్నారు. ఆదివారం ఉదయం కేసీఆర్ తరఫున మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం శుక్రవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక లాంఛనం కానుంది. -
ప్లీనరీ ఏర్పాట్లలో అధికార దుర్వినియోగం: పీసీసీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని పీసీసీ అధికార ప్రతినిథి బండి సుధాకర్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల్లో లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లీనరీల మీద..బహిరంగ సభల మీద వున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాల మీద, పునాదులపై అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. వారికి చేయాల్సిన ఆర్థిక సాయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. -
టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు
హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరిస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ దాకా నామినేషన్లను స్వీకరిస్తారు. 19 న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల అధికారి నాయిని నరసింహ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి , మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీలో బీసీ డిమాండ్లపై తీర్మానం
ప్లీనరీ తీర్మానాల కమిటీకి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చించి, తీర్మానం చేయాలని ప్లీనరీ సమావేశాల తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు (కేకే)కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కేకేను కలసి బీసీల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసింది. బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు, హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో బీసీభవన్ నిర్మించాలని విజ్ఞప్తి చేసింది. -
టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
12 ప్రాధాన్య అంశాల గుర్తింపు: కేకే సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి 12 ప్రాధాన్య అంశాలను గుర్తించామని టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చెప్పారు. ఆయన నివాసంలో పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ శనివారం భేటీ అయింది. కమిటీ సభ్యులు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి హాజరయ్యారు. కమిటీ గుర్తించిన ప్రాధాన్య అంశాలను చర్చించి రాజకీయ తీర్మానాలు కూడా ఆమోదిస్తామని, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలపై తీర్మానాలు ఉంటాయన్నారు. నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర తీర్మానాలు చేస్తామన్నారు. పదహారో ప్లీనరీని ఈ నెల 21న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో, పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఇంకా తెలవారదేమి..
సంస్థాగత పదవులపై గులాబీ నేతల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నేతలు, శ్రేణులను ఊరిస్తున్న సంస్థాగత పదవుల వ్యవహారంలో మరింతగా ఎదురు చూపులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన పార్టీ కమిటీల ఏర్పాటు మరింత ఆలస్యమవు తోంది. గత నెల 29 నాటికే పార్టీ పదవులకు ఎంపిక పూర్తవుతుందని... జిల్లా, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ మళ్లీ వాయిదా పడింది. దీం తో పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. అభ్యంతరాలతోనే.. పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య పేచీలు, కూర్పు కుదరకపోవడం వంటి అంశాలపై నాయకత్వం పెద్ద కసరత్తే చేసింది. ఆయా జిల్లాల్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొత్త కమిటీల జాబితాకు తుది రూపు ఇవ్వలేక పోయింది. ప్లీనరీ దగ్గర పడడంతో.. ఏటా ఏప్రిల్ నెలలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. అందులో భాగంగా వచ్చే ఏప్రిల్‌లో 16వ ప్లీనరీ జరగాల్సి ఉంది. మరోవైపు పార్టీ రెండేళ్లకోమారు సభ్యత్వ నమోదు, కొత్త కమిటీల ఎన్నిక వంటి నిబంధనల వల్ల ఈ ఏడాది సభ్యత్వాల రెన్యూవల్, కొత్త సభ్యత్వాల నమోదు చేపట్టాల్సి రానుంది. ప్రస్తుతం ప్లీనరీకి రెండు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో.. కొత్త కమిటీల నియామకం కుదరదని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలు స్తోంది. అందువల్ల ముందుగా సభ్యత్వ నమో దు కోసం షెడ్యూల్‌ను ప్రకటించను న్నారు. సభ్యత్వాల నమోదు కార్యక్రమం ముగిశాక.. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా నిర్వహించే 16వ ప్లీనరీ సమయానికి కమిటీలను పూర్తి చేస్తారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు టీఆర్ఎస్కు ఇప్పటిదాకా జిల్లాల్లో ఎక్కడా పెద్దగా సొంత కార్యాలయాలు లేవు. ప్రస్తుతం కరీంనగర్లో మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యమ సమయం నుంచీ ఇదే పరిస్థితి. అయితే ప్రస్తుతం అధికార పార్టీ హోదాలో టీఆర్ఎస్ సొంత భవనాలను సమకూర్చుకుని పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దీనిపై ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు అందుబాటులోకి వచ్చేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు సభ్యత్వ నమోదు పూర్తయ్యాక క్రియాశీలక సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ రెన్యూవల్, కొత్త వారికి బీమా కల్పించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
TRS ప్లీనరీపై పెద్దనోట్ల రద్దు ప్రభావం
-
ప్లీనరీపై ఉన్న శ్రద్ధ కరువుపై చూపరా? : కె.లక్ష్మణ్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో కరువు విలయతాండ వం చేస్తుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో సీఎం, జిల్లా స్థాయిలో మంత్రులు కరువుపై సమీక్షలు నిర్వహించకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ మీద, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధను కరువుపై కూడా చూపాలన్నారు. నెలాఖరులోగా కరువుపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోతే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, ప్రదీప్ కుమార్, లాయక్ అలీతో కలసి బుధవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు కరువు పరిస్థితిపై వినతి పత్రం అందజేశారు. తమ పార్టీ తరఫున 10 బృందాలు జిల్లాల్లో పర్యటించి కరువు పరిస్థితులపై అధ్యయనం చేశాయని, ఆ వివరాలను సీఎస్ రాజీవ్ శర్మకు అందజేశామని తెలిపారు. కరువుపై చర్చించడానికి గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదన్నారు. -
'కరువు కాటేస్తుంటే.. ప్లీనరీనా'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరువు కాటేస్తుంటే ప్లీనరీ పెట్టుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు ఏమి వచ్చింది? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులని హామీలిచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. పాలమూరులో ఆర్డీఎస్ పనులను ప్రారంభించాలన్న డిమాండ్‌తో మే 9న కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం సమగ్ర జల విధానాన్ని ప్రకటించాలని చెప్పారు. ఎఫ్ఆర్బీం పరిమితిని పెంచినా, రంగారెడ్డి జిల్లాలో భూములను విక్రయించినా ఇంకా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయడం లేదంటూ దుయ్యబట్టారు. ఖమ్మంలో ఓటమి పాలైన టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు పాలేరులో చెల్లుతారా? అంటూ ఎద్దేవా చేశారు. పాలేరు కాంగ్రెస్ కోసం విరాళంగా సీఎల్పీ ఒక నెల వేతనాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలేరు ఉప ఎన్నిక వ్యయం కోసం పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. -
2019 నాటికి రైతులకు 24 గంటల విద్యుత్: కేసీఆర్
ఖమ్మం: 2019 నాటికి రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరెంట్ పోయే సమస్యే లేదని అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్వుల తెలంగాణ చూడాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సాధించామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందంటూ వాపోయారు. ఉద్యమ నేతలు చాలామంది అమ్ముడు పోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకే ప్రాజెక్ట్‌ల రీడిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నారు. తెలంగాణ అస్థిత్వం కాపాడేందుకే సీఎం పదవి తీసుకున్నానని చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి 95 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూం పథకం ఘనత తమేదనన్నారు. ఆర్టీసీ కార్మికులకు భరోసా కల్పించామని చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తానని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిద్రపోను' అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. -
‘గులాబీ బాల’కు పదిహేనేళ్లు
♦ నేడు ఖమ్మంలో టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం ♦ ఉదయం 10 గంటలకు ప్లీనరీ ♦ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ ♦ 15 అంశాలపై తీర్మానాలు చేయనున్న ప్రతినిధులు ♦ పట్టణమంతా గులాబీమయం.. భారీగా బందోబస్తు ♦ ఖమ్మం చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ♦ ప్లీనరీకి 4 వేల మంది ప్రతినిధులు.. సభకు 2 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్, ఖమ్మం: ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. పోరుబాటతో ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్... ఈ ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రత్యేక తెలంగాణ సాధించడమేకాదు.. తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్నీ చేపట్టింది. ఇప్పుడు పార్టీ 15వ ఆవిర్భావ వేడుకను ఘనంగా జరుపుకొంటోంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా జరుపుతున్న ప్లీనరీకి ఈసారి ఖమ్మం వేదికైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ఉదయం ప్లీనరీ, సాయంత్రం బహిరంగ సభ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వేల మంది ప్రతినిధులను దీనికి ఆహ్వానించారు. ప్లీనరీలో 15 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక, దీంతో ఎన్నికల సంఘం విధించిన షరతులతో కూడిన అనుమతి మధ్య ప్లీనరీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముస్తాబైన ఖమ్మం టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఖమ్మం పట్టణమంతా తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బెలూన్లతో గులాబీమయం అయిపోయింది. చెరుకూరి మామిడి తోట సమీపంలో ప్లీనరీ, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఖమ్మంలో 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్లీనరీ వేదిక వద్ద ప్రత్యేకంగా వాటర్ కూలింగ్ స్ప్రింక్లర్లు పెట్టారు. బహిరంగ సభకు ఖమ్మంతోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి జనసమీకరణపై టీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. ఎంపీలు బాల్కసుమన్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్లీనరీ వేదికను పరిశీలించారు. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం రాత్రికే ఖమ్మం చేరుకున్నారు. ఇదీ షెడ్యూల్ సీఎం కేసీఆర్ ఎన్నెస్పీ క్యాంపులో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి ఉదయం 9.30కు భూమిపూజ చేస్తారు. అనంతరం ప్రభుత్వ పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పార్టీ 15 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. 9.45 గంటలకు ప్లీనరీ వేదిక వద్దకు చేరుకుంటారు. ప్లీనరీ ప్రాంగణంలో 4 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరో వెయ్యి కుర్చీలను అదనంగా అందుబాటులో ఉంచారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్య నేతల కోసం ఏడు అడుగుల ఎత్తులో వేదిక నిర్మించారు. దానికి కుడివైపున మీడియా ప్రతినిధులకు బ్లాక్ ఏర్పాటు చేశారు. వేదిక ముందుభాగంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేలా వీఐపీ బ్లాక్‌ను, దాని వెనుక ఏ, బీ బ్లాకులుగా విభజించి పార్టీ ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఎండవేడిని తట్టుకునేలా హైదరాబాద్, విజయవాడ నుంచి తెప్పించిన ఏసీలను.. ప్లీనరీ ప్రాంగణానికి ఇరువైపులా చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, కూలర్లను పెట్టారు. ప్లీనరీ అనంతరం సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ మొదలవుతుంది. దీనికి 2 లక్షల మందిని తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సభలో 6.30 గంటలకు సీఎం ప్రసంగిస్తారు. ఆయనతోపాటు జిల్లా మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులు మాత్రమే ప్రసంగించేలా ప్రణాళిక రూపొందించారు. ప్లీనరీ, బహిరంగ సభల కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ, డీఐజీలతో పాటు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 120 మంది ఎస్సైలు సహా పెద్ద సంఖ్యలో సివిల్, ఏఆర్ పోలీసులు, హోంగార్డులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. చేయబోయే తీర్మానాలివే.. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఈసారి 15 తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ‘సంక్షేమం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు-రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక, ఐటీ విధానం, కృష్ణా పుష్కరాలు, శాంతిభద్రతలు-పేకాట-గుడుంబా నిర్మూలన-షీటీమ్స్, కరువు, తెలంగాణ హరితహారం, విభజన హామీలు-కేంద్రంతో ఆమోదింపజేయడం, కేజీ టు పీజీ, పట్టణాభివృద్ధి-హైదరాబాద్ విశ్వనగరం వంటి 15 తీర్మానాలు చేయనున్నారు. ఏ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారనేదానిపై ఇప్పటికే పార్టీ పెద్దలు సంబంధిత ప్రతినిధులకు సూచించారు. ప్లీనరీ, బహిరంగ సభ షెడ్యూల్.. - ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు - 10.10:ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అతిథులను వేదిక మీదకు ఆహ్వానిస్తారు - 10.20: అమరులకు శ్రద్ధాంజలి.. రెండు నిమిషాల పాటు మౌనం - 10.30: మంత్రి తుమ్మల స్వాగతోపన్యాసం - 10.50: పార్టీ ప్రధాన కార్యదర్శి కేకే తొలి ప్రసంగం - 11.00: సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం - మధ్యాహ్నం 12.00-1.30 గంటల వరకు 6 తీర్మానాలు - 1.30 నుంచి 2.30 వరకు: భోజన విరామం - 2.30 నుంచి 4.30 వరకు: 9 తీర్మానాలు, చర్చ - 4.45: కేసీఆర్ ముగింపు ఉపన్యాసం - సాయంత్రం 6.00: బహిరంగ సభ ప్రారంభం ప్రజల ఆశలు నెరవేర్చేలా ప్లీనరీ: తుమ్మల బంగారు తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేలా ప్లీనరీలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఖమ్మంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ రెండేళ్ల పాలన ఎలా ఉంది, ఇంకా ఏం చర్యలు తీసుకోవాలనే 15 అంశాలపై ఈ ప్లీనరీలో తీర్మానాల ద్వారా చర్చిస్తామన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్ అవకాశమివ్వడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ అదిరింది..
ఖమ్మం : ఖమ్మంలో బుధవారం జరుగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే అతిథుల కోసం పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ,ఆంధ్ర స్టైల్లో వంటకాలను తయారు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే నోరూరించే వంటకాలను సైతం సిద్దం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యేవారికి బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి అల్పాహారాన్ని అందించనున్నారు. పూర్ణం, ఇడ్లీ, వడ, ఉప్మా- పెసరట్టు, పొంగలి, కొబ్బరి చెట్నీ, పల్లీ చెట్నీ, అల్లం చెట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు. ప్లీనరీ ప్రారంభమైన వేదికపై ఉన్నవారికి ఉదయం 10 గంటలకు మజ్జిగ, 11 గంటలకు రాగిజొన్న మిక్స్డ్ జావ, మధ్యాహ్నం 2 గంటలకు స్నాక్స్ (బొప్పాయి, ద్రాక్ష పండ్లు) సాయంత్రం 4 గంటలకు టీ లేదా హాట్ బాదం, సాయంత్రం 5 గంటలకు బాసంది అందిస్తారు. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు నిరంతరం మంచినీరు, ఉదయం 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు స్నాక్స్ (మైసూర్‌పాక్, ఆనియన్ పకోడి), సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఇందులో తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, సన్‌రైజ్ ఫుడింగ్, కట్లెట్, గారె, కొత్తిమీర-టమాటా చట్నీ, వెజ్‌టబుల్ బిర్యానీ, పనీర్ కుర్మా, పెరుగు చట్నీ, వైట్‌రైస్, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, బీరకాయ శనగపప్పు కర్రీ, మద్రాస్ ఉల్లి చట్నీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చి పులుసు, మిర్యాల రసం, నల్లకారం, నెయ్యి, ఉలవచారు, గుడ్డు, క్రీం, నాటుకోడి పులుసు, మటన్ ధమ్ బిర్యానీ, దాల్చ, గోంగూర మటన్, చింత చిగురు రొయ్యలు, కొర్రమేను పులుసు వంటి 32 రకాల పదార్థాలను అందించనున్నారు. బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, వెజ్‌రోల్, వైట్‌రైస్, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడా ఫ్రై, బీరకాయ, దొండకాయ, రోటీ చట్నీ, పెసరపప్పు టమాట, చీమచింతకాయ ఫ్రై, చామదుంప పులుసు, ముద్దపప్పు, పచ్చి పులుసు, పప్పుచారు, అప్పడం, పెరుగు, నెయ్యి వంటి 18 పదార్థాలను మరో మెనూలో అందించనున్నారు. 12 నుంచి 15 వేల మందికి తగ్గట్లుగా వంటలు తయారుచేస్తున్నారు. -
'టీఆర్ఎస్ ప్లీనరీకి 4 వేల ప్రతినిధులనే ఆహ్వానిస్తున్నాం'
హైదరాబాద్ : ఖమ్మంలో ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి 4 వేల ప్రతినిధులనే ఆహ్వానిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈటల రాజేందర్ విలేకర్లతో మాట్లాడుతూ... ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రతినిధుల సభ నిర్వహిస్తామని... సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. పలు కీలక అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలనూ కూడా అమలు చేసిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. -
'ప్లీనరీకి ముఖ్యమంత్రిగా వెళ్లొద్దు'
హైదరాబాద్ : ఖమ్మం నగరంలో ఈ నెల 27న టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎన్నికల నియమావళి వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పార్టీ కార్యక్రమాల కోసం ముందు నుంచే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికిప్పుడు మరో చోటకు తరలించడం సాధ్యం కాదని, ఖమ్మంలోనే నిర్వహించుకునేందుకు అనుమతించాలంటూ.. మంత్రి కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం ఈ నెల 27న ఖమ్మంలో సభ, ప్లీనరీ నిర్వహణకు షరతులతో అనుమతించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లేఖ ద్వారా శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చునంతా పార్టీ తరఫున వెచ్చించాలని, ప్రజా ధనాన్ని ఖర్చు చేయరాదని ఈసీ పేర్కొంది. అలాగే అధికార యంత్రాంగాన్ని వాడరాదని, ముఖ్యమంత్రి, మంత్రులు అధికార హోదాలో ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు షరతులతో అనుమతిస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ లేఖలో పేర్కొన్నారు. -
దత్తాత్రేయకు ఏం తెలుసు...?
- కేంద్రం నుంచి కరువు నిధులు పూర్తి స్థాయిలో రాలేదన్న నాయిని హైదరాబాద్ కేంద్ర నుంచి కరవు నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రాలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. కరవు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో దత్తాత్రేయకు ఎలా తెలుస్తుందని, ఆయన ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాడని ఎద్దేవా చేశారు. సోమవారం మంత్రి నాయిని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. తాను రాజ్యసభలో రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగించినంత కాలం ఉంటానని, అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు. ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో జరగనున్న టీఆర్ఎస్ 15న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి 500 మందికి పైగా ప్రజాప్రతినిధులు వెళ్లనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని వివరించారు. సీఎం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. అసెంబ్లీలోని తన చాంబ ర్లో ఆయన సోమవారం ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో భేటీ అయ్యారు. సభ నిర్వహణకయ్యే ఖర్చు, ప్రతినిధులు, బహిరంగ సభలు ఎక్కడ జరపాలి, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ప్లీనరీ లోగా ఖమ్మం జిల్లాలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులపైనా చర్చకు వచ్చింది. ఖమ్మంలోని స్టేడియంలో బహిరంగ సభ, ఆ పక్కనే కాలేజీ మైదానంలో ప్రతి నిధుల సభకు ఏర్పాట్లు చేయాలన్న నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం ముగియగానే కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల నియామకానికి సంబంధించిన జాబితాలతో మంత్రి హరీశ్‌ను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే కనకయ్య, మదన్‌లాల్, వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ తుమ్మలతో భేటీలో పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో స్తబ్దత!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో స్తబ్దత ఆవరించింది. ఏప్రిల్‌లో ప్లీనరీ, అదే నెలలో బహిరంగ సభ నిర్వహించినప్పటి నుంచి పార్టీపరంగా చేపట్టిన కార్యక్రమాలేవీ లేకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం ఆవరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో పార్టీ యంత్రాంగం సేవలు వినియోగించుకుంటామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినా స్వచ్ఛ హైదరాబాద్ వంటి కార్యక్రమాలు అధికారికంగానే సాగడం, జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కరువైంది. పెండింగ్‌లోనే పార్టీ కమిటీలు... టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాక జరగాల్సిన పార్టీ కమిటీల నియామకం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. అంతకుముందే పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయినా, జిల్లాస్థాయి కమిటీల భర్తీ కూడా జరగలేదు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు, జిల్లా స్థాయిలో అధ్యక్షులు, నగర అధ్యక్షులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. చివరకు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌పై కూడా పార్టీపరంగా దృష్టిపెట్టినట్లు కనిపించట్లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ నాయకత్వం ఆ దిశలో పార్టీ యంత్రాంగాన్ని నడిపే ప్రయత్నం మాత్రం చేయట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీతోపాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకూ ఎన్నికలు జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తికానందున ఎవరు ఏ హోదాలో పనిచేయాలో తెలియని సందిగ్ధత ఏర్పడింది. తమకు ఏ పదవీ లేక, బాధ్యతలూ అప్పజెప్పకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పుకుని పనిచేయాలన్న సందేహాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో ఇప్పటికే పెదవి విరుస్తున్న పార్టీ యంత్రాంగం చివరకు పార్టీ పదవులన్నా భ ర్తీ చేయరా అని లోలోన మథనపడుతున్నారు. జంప్ జిలానీలకూ తప్పని నిరీక్షణ! ఎన్నికల ముందు, ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ పార్టీలను వదిలి టీఆర్ఎస్లోకి వలస వచ్చిన నాయకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వివిధ పార్టీల్లో మంచి హోదాల్లో ఉన్న పదవులు వదులుకుని పార్టీ మారిన వారికి పదవుల్లేక సాధారణ కార్యకర్తలుగా మిగిలే పరిస్థితి నెలకొంది. నామినేటెడ్ పదవులు ఆశ చూపి పార్టీలోకి చేర్చుకున్న తమకు చివరకు పార్టీ పదవులకూ దిక్కులేకపోవడంపై జంప్ జిలానీలు కుమిలిపోతున్నారు. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారితో పోటీపడుతూ ఎలాంటి పదవుల్లేకుండా పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మొత్తంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలు అటకెక్కాయి. ప్రస్తుతం అందరి దృష్టి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపైనే కేంద్రీకృతమై ఉంది. -
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు
- తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలి - మే 2న వీహెచ్ రాహుల్ రైతు సందేశ్ యాత్ర - డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేల ముంచుతున్నాయని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం ఆరోపించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోకపోవడంలో పాలకులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల మోజులో పడి రైతు సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. మల్లాపూర్ చక్కెర కర్మాగారం పరిధిలోని చెరకు రైతులకు వెంటనే బకారుులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయలేమని మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడడం బాధ్యతా రాహిత్యమన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయూలన్నారు. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వకుంటే మే మొదటి వారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రైతులకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాజ్యసభ ఎంపీ వి.హన్మంతరావు మే 2న జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గంభీరావుపేట నుంచి బయలుదేరి దమ్మన్నపేట, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, పదిర, వెంకటాపూర్, సిరిసిల్ల, నాంపెల్లి, కొదురుపాక , బావుపేటలో పంటలను పరిశీలిస్తూ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని చెప్పారు. -
గులాబీ కళ
టీఆర్ఎస్ బహిరంగ సభకు గ్రేటర్ ముస్తాబు నగరం నుంచి మూడు లక్షల జన సమీకరణ ఏర్పాట్లలో మంత్రులు బిజీ బిజీ సాక్షి, సిటీబ్యూరో:అధికార టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు గ్రేటర్ నగరం ముస్తాబైంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్‌లో వేదిక, బారికేడ్లు, ఆడియో, లైటింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పనులను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఆదివారం పరిశీలించారు. వేదిక ఏర్పాటు బాధ్యతను ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తీసుకున్నారు. ఈ సభకు గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులకు లక్ష్యం నిర్దేశించారు. జన సమీకరణకు బస్తీలు, కాలనీల ముఖ్య నాయకులను కలవడంతో పాటు... సభకు హాజరయ్యేందుకు కార్యకర్తలకు అవసరమైన వాహనాలను నాయకులు ఇప్పటికే సమకూర్చారు.రాబోయే బల్దియా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం... గ్రేటర్ క్యాడర్లో జోష్ నింపడం... ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఈ సభను వినియోగించుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గులాబీ వనంగా నగరం... బహిరంగ సభ నేపథ్యంలో పది జిల్లాల నుంచి నగరానికి వచ్చే కార్యకర్తలకు ఘన స్వాగతం పలికేందుకు ముఖ్య రహదారులపై భారీ ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలు, మైదానం గులాబీ జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. గ్రౌండ్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నేతల ప్రసంగాలు దూరప్రాంతాలకు వినిపించేలా సౌండ్సిస్టంను ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు, సభకు హాజర య్యే వారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి ముఖ్య కార్యవర్గంతో పాటు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, తెలంగాణ వాదులు సభకు హాజరయ్యేలా చూసేందుకు డివిజన్ స్థాయి నేతలతో మంత్రులు ప్రత్యక్షంగా మాట్లాడారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఆటుపోట్ల ప్రస్థానం... సుమారు 14 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో అస్తిత్వ పోరాటం చేసిన టీఆర్ఎస్... నేడు అధికార పార్టీగా అవతరించి... భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం విశేషం. 2001 ఏప్రిల్ 27న నగరంలోని జలదృశ్యంలో అధినేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. తొలినాళ్లలో పార్టీ ఉనికిని చాటుకునేందుకు పెద్ద పోరాటమే చేసింది. జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం వరకు ఎదిగిన తీరు పార్టీ వర్గాలను సైతం అబ్బురపరుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటుటోంది.ప్రధాన పార్టీల నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకొని... రాబోయే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేయాలన్నదే నగర మంత్రులు, అధినేత లక్ష్యమని గ్రేటర్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారని... వీటిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఇటీవలే టీఆర్ఎస్ గ్రేటర్ విభాగం అధ్యక్షునిగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో పార్టీని అజేయశక్తిగా మలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపాయి. హోం మంత్రి పరిశీలన రసూల్‌పురా: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సోమవారం జరుగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కలసి ఆదివారం పర్యవేక్షించారు. బందోబస్తు విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తే బస్సులను ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్లు హామీ ఇచ్చారని... నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 14 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పార్టీ కోసం పని చేస్తున్నారని కొనియాడాఉ. బంగారు తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హరీష్‌రావు అలకబూనినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. హోంమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎమ్మేల్యే రసమయి బాలకిషన్, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఏసీపీ గణేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. బందోబస్తుపై సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: టీఆర్ఎస్ బహిరంగ సభ బందోబస్తును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సమీక్షించారు. బహిరంగ సభలకు వచ్చే ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బందోబస్తులో 4000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. నగర పోలీసులు, టీఎస్ఎస్పీ, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామన్నారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కలిసి బందోబస్తు చర్యలను స్వయంగా పరిశీలించారు. బందోబస్తులో పాల్గొంటున్న అధికారులకు నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు తగిన సూచనలిచ్చారు. -
ప్లీనరీ సైడ్‌లైట్స్..
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ ఆద్యంతం కళాకారుల పాటలు, కేసీఆర్ మార్కు పంచ్ డైలాగులు, కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో సందడిగా జరిగింది. అందులో పలు అంశాలు సభకు హాజరైనవారిని బాగా ఆకట్టుకున్నాయి. * టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన కార్యకర్తలకు అభివాదం చేసి వేదికపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీ కట్టారు. * టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్‌ను ప్రకటించిన సమయంలో వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల నుంచి గులాబీ పూలవర్షం కురిపించారు. * వేదికతో పాటు మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు కూర్చున్న గ్యాలరీలపై పూలవర్షం కురవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమయంలో కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చారు. * వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన సంస్కృతిని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన డమరుకాన్ని కేసీఆర్ మో గించడం ఆకట్టుకుంది. ఇదే సమయంలో ‘గులాబీ జెండా లు ఎగరాలి.. ద్రోహుల గుండెలు అదరాలి..’ అంటూ పాటరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. * టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన అనంతరం కళాకారులు ఆలపించిన ‘సల్లంగుండాలయ్యా.. మాసారూ కేసీఆరూ.. మీరు పైలం గుండాలయ్యా మా ముఖ్యమంత్రిగారు..’ అన్న పాట బాగా ఆకట్టుకుంది. * కేసీఆర్‌కు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బోనం ఆకారంలో ఉన్న కళాకృతిని ఇచ్చి శిరస్సుపై పగిడి పెట్టి సన్మానించారు. * కొందరు మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. * కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ.. అడిగి మరీ కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించారు. ప్లీనరీ తీర్మానాల ఆమోదం సమయంలోనూ గట్టిగా చప్పట్లు కొట్టాలని పదేపదే కార్యకర్తలను కోరారు. వేదికపైనున్న ముఖ్య నేతలు సైతం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరడం గమనార్హం. * త్వరలో పార్టీ కార్యకర్తలకు పదవుల పందేరం మొదలుపెడతామని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయరాదని సీఎం సూచించినపుడు కార్యకర్తల చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది. * కేసీఆర్ పలువురు నాయకులపై పంచ్ డైలాగులు విసిరి అందరినీ నవ్వించారు. కార్యసాధకుడు లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగడంటూ ఓ పద్యం వినిపించడం ఆకర్షించింది. * అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను సన్మానించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడ్డారు. ఈ సమయంలో వేదిక కిక్కిరిసిపోవడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అందరినీ కిందకు పంపించివేశారు. * ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్లు తరచూ ఆగిపోవడంతో కార్యకర్తలు ప్లకార్డులతో విసురుకోవడం కనిపించింది. వేదికపై ఉన్న మంత్రులు సైతం ఉక్కపోత భరించలేక పార్టీ కరపత్రాలతో విసురుకున్నారు. * వేదికపై నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్, ఎంపీ కవిత మహిళలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. * మంత్రులు హరీశ్, కేటీఆర్‌ల ప్రసంగాల సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. * ‘తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవడంతో మా కల నిజమైం ద’ంటూ కళాకారులు ఓ పాట పాడిన సమయంలో కేసీఆర్.. ‘ఇది డబ్బాగొట్టే పాట’ అంటూ నవ్వించారు. * ఉద్యమ సమయంలో తన జీపుపై నుంచి జెతైలంగాణ నినాదాలు చేసిన స్వీటీ అనే బాలిక .. సభకు వచ్చి తాను పైలట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వేదికపైకి ఎక్కి సీఎంకు వినతిపత్రం సమర్పించింది. దీంతో ఆయన ఆ బాలికకు ఎంత ఖర్చైనా ఇచ్చి పైలట్ చేస్తామని చెప్పి, అందరితో చప్పట్లు కొట్టించడం ఆకట్టుకుంది. ఆయన ‘పంచ్’ వేస్తే.. ప్లీనరీలో కేసీఆర్ తనదైన శైలిలో పడికట్టు పదాలతో, పంచ్ డైలాగులతో సభకు హాజరైనవారిని ఆకట్టుకున్నారు. * రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో ‘కోతులుండే జాగాను మనం ఖరాబు చేస్తే.. మనం ఉండే జాగాలకచ్చి అవి మన పంటలను ఖరాబు చేస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామంలో వేలాదిగా చెట్లు నాటాలి..’ అని సూచించారు. * కరెంట్ కోతలపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ‘మేం అధికారం చేపట్టి గోచిగూడా సర్దుకోకముందే ఆందోళన చేస్తున్నరు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లాంతర్లు, ఎండిన వరి కంకులు తేకుండా పంటలకు నీళ్లిచ్చినం..’’ అన్నారు. * పలువురు మంత్రులు తీర్మానం సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో.. ‘మనం నాయకులం సమయం విషయంలో సోయి ఉండాలె. కార్యకర్తలందరూ చాలా దూరం పోవాలె. పెద్ద అంశమైతే ఏడు నిమిషాలు, చిన్న తీర్మానమైతే మూడు నిమిషాల్లో ప్రసంగాలను ముగించండి..’ అని కేసీఆర్ సూచించారు. కానీ పలువురు మంత్రులు పది నిమిషాలకు పైగా ప్రసంగం కొనసాగించారు. * విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని ‘ఇక నుంచి కరెంట్ రెడ్డి అని పిలవాల’న్నారు. * సభా ప్రాంగణంలో కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన చిన్నపాటి తోరణాలను చించుకునేందుకు కార్యకర్తలు పోటీపడడంతో కేసీఆర్ వారినుద్దేశిస్తూ.. ‘సభ అయిపోయినంక ఎవరికి దమ్ముంటే వారు పీక్కోని పోండి.. అప్పటివరకు ఆగండి..’ అని తనదైన శైలిలో చెప్పారు. అలరించిన ఆటా పాట ప్లీనరీ ప్రధాన వేదికకు ఆనుకుని వేసిన ప్రత్యేక స్టేజీపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బృందం ఆధ్వర్యంలో కళా బృందాల ఆటాపాట కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. గతానికి భిన్నంగా ఈసారి తెలంగాణ సంస్కృతితో పాటు మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం వంటి పథకాలకు సంబంధించిన గేయాలు పాడారు. ‘పల్లె మేలుకోవాలి.. ఇళ్లు మేలుకోవాలి.. ప్రతి మహిళా మేలుకోవాలి’, ‘కొమ్మలల్లా కోయిలమ్మా పాటపాడుతున్నాది.. జై తెలంగాణ అని’, ‘జయజయహే తెలంగాణ’, ‘ఉస్మానియా క్యాంపస్‌లో వీరుల్లారా.. వీరవనితల్లారా..’ అన్న పాటలకు మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు పార్టీ పతాకాలను ఊపుతూ కళాకారులను అభినందించారు. -
ప్రజలే మా బాసులు
* మా మదిలో, గుండెల్లో వాళ్లే * టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం * వారి కల నెరవేర్చేందుకే అహర్నిశలు శ్రమిస్తాం * రాష్ర్ట ప్రజలకే నా జీవితం అంకితం * బంగారు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తాం * రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు.. ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ * ఐకేపీ సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం * నాలుగేళ్లలో ప్రాణహిత, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి * వాటర్‌గ్రిడ్ పూర్తి కాకుంటే ఓట్లు అడగబోం * మూడేళ్లలో 24 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి * వచ్చే నెలలో పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని వెల్లడి * 8వ సారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. - సీఎం కేసీఆర్ ‘టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో ఇతర పార్టీలు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వారి కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం’ అని అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ర్ట ప్రజలకే తన జీవితం అంకితమని, బంగారు తెలంగాణ గమ్యం ముద్దాడే వరకు అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి.. ఆనాటి జల దృశ్యం నుంచి ఈనాటి జన దృశ్యం వరకు అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని కొనియాడారు. ఎనిమిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా వివరించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. కార్యసాధకులుగా నిలవాలని, బంగారు తెలంగాణ లక్ష్యాన్ని చేరే వరకు పోరాడాలంటూ పార్టీ కార్యకర్తలు, కళాకారుల్లో కొత్త ఉత్తేజం నింపారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... - సాక్షి, హైదరాబాద్ కల నెరవేరుస్తాం అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రాబోయే రెండేళ్లలో లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ సోదరులు నిరాశకు గురవుతున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తల తెగిపడ్డా తప్పడు. నిరాశ పడకండి. త్వరలోనే మీ కలలు కూడా నెరవేరుతాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంద శాతం చేస్తాం. ఉద్యోగుల విభజన అయిపోయిన తెల్లారే ఆ ఉత్తర్వులు జారీ చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చాం. ఐకేపీ, డ్వాక్రా ఉద్యోగులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాం. ఐకేపీ సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం. కేజీ టు పీజీని వచ్చే ఏడాది అమలు చేస్తాం. ప్రాణహితకు మార్పులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎత్తివేయట్లేదు. మార్పులు చేసుకుంటున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటాం. దిగువకు అవసరమున్న నీటిని ప్రాణహిత గోదావరిలో కలిశాక.. కాళేశ్వరం నుంచి తీసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. మిడ్‌మానేరుకు అక్కణ్నుంచి నీరు తీసుకుంటాం. ఎవడు అడ్డమొస్తడో నేను చూస్తా. ప్రాజెక్టుల కాడ కుర్చీ వేసుకుని కూర్చొని కట్టిస్తానని గతంలో చెప్పిన. రాబోయే నాలుగేళ్లలో ఇటు పాలమూరు.. అటు ప్రాణహిత ప్రాజెక్టులను నిజంగానే కుర్చీ వేసి కట్టించి తీరుతా. ఏడాదిన్నర వ్యవధిలో దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్ఎల్బీసీలను పూర్తి చేస్తాం. హామీ నెరవేర్చకుంటే ఓట్లు అడగం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రాబోయే నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీటిని ఇవ్వకపోతే ఓట్లు అడగమని ఇప్పటికే చెప్పిన. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మనం పట్టుబట్టి తెలంగాణ తెచ్చినట్లుగా అపర భగీరథుల్లా ఈ పథకం చేపట్టాలి. పది జిల్లాల్లో దాదాపు 20 వేల చోట్ల రైల్వే లైన్లు, వాగులు, ఒర్రెలు, కెనాల్స్, హైవేలు, రోడ్లు దాటుతూ పైపులైన్లు వేయాలి. ఎక్కడ ఏం గ్రామంలో ఈ పని వచ్చినా కార్యకర్తలు శివంగి బిడ్డల్లా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ పనుల్లో పాలుపంచుకోవాలి. రోడ్లు, రహదారులకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్లు, బ్రిడ్జి పనులన్నీ కథానాయకులై ముందుకు తీసుకుపోవాలి. మెట్రో రైలు నిర్మాణం అశాస్త్రీయంగా ఉంది. అటు ఎయిర్‌పోర్టు, ఇటు ఇబ్రహీంపట్నం, రాంచంద్రాపురం వరకు పొడిగించాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంస విక్రయ మార్కెట్లు, శ్మశానవాటికలు, డంప్‌యార్డులను అభివృద్ధి చేస్తాం. యాదగిరి నర్సన్న పవర్ ప్లాంట్ ప్రస్తుతం రాష్ర్టంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉంది. అదనంగా రూ. 91,500 కోట్ల నిధులు సమకూర్చుకున్నాం. రాబోయే మూడేళ్లలో 24 వేల మెగావాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. అసెంబ్లీలో నేనీ విషయం చెబితే.. ‘ఇదేం మాయా మశ్చీంద్రనా.. ఇదేమన్నా అద్భుతమా..’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ చేసేదంతా అద్భుతమే. జీవితంలో మీరు ఆలోచించని పనులే మేం చేస్తాం. తెలంగాణ ప్రజలే మా బాసులు. నిత్యం మా మదిలో, గుండెల్లో వాళ్లే ఉంటారు. వాళ్ల కల నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. నల్లగొండ జిల్లా దామరచర్లలో 6,600 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతాం. ఈ ‘యాదగిరి నర్సన్న’ పవర్ ప్లాంట్‌కు పది రోజుల్లో శంకుస్థాపన చేస్తా. తెలంగాణకు కరెంటు పీడ పోయింది. ఇక కరెంటు కోతలుండవ్. ఇప్పుడు పంటలను ఎండకుండా కాపాడుకున్నాం. గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. పువ్వు పుట్టంగనే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లా పని చేస్తుందో చెప్పడానికి కరెంటు సరఫరానే నిదర్శనం. పరిశ్రమలకు తగినన్ని భూములు, నీళ్లు ఉన్నాయి. కొత్త పారిశ్రామిక విధానం ఉంది. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలిరావాలి. ధర్మపురిలో మొక్కు తీరుస్తా తెలంగాణలో గోదావరి ఐదారు వందల కిలోమీటర్లు పారితే.. ఆంధ్రప్రదేశ్‌లో యాభై అరవై కిలోమీటర్లు పారుతుంది. కానీ గోదావరి అంటే రాజమండ్రి.. కృష్ణా పుష్కరమంటే విజయవాడ.. అన్నట్లుగా మారింది. మనం కూడా అక్కడికిపోయి గుండు కొట్టించుకొని స్నానం చేసి వచ్చేటోళ్లం. బాసర సరస్వతి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కాళేశ్వరంలో మహాశివుడు, భద్రాద్రిలో రాముడు కొలువు దీరి ఉన్నాడు. ఒక్క పుణ్యక్షేత్రం లేని రాజమండ్రిలో ఎందుకు పుష్కరాలు పెడుతారని అప్పుడు అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలతో వాదించాను. అప్పుడు తెలంగాణ సమాజం మేలుకున్నది. అప్పటి పుష్కరాల్లో నేను ధర్మపురిలో మునిగిన. మళ్లీ పుష్కరంలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మళ్లీ వస్తానని, ధర్మపురి నర్సన్నకు పాదాభిషేకం, పాలాభిషేకం చేస్తానని, తల్లీ గోదావరీ.. నీ ఒడిలో మునిగి.. నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తానని ఆ రోజే మొక్కుకున్నా. అందుకే ఈ పుష్కరాల్లోనూ ధర్మపురికే వెళ్తా. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. సన్నబియ్యం ఆలోచన ఈటలదే గత ప్రభుత్వం రేషన్ బియ్యంపై రూ. 900 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. సీలింగ్ లేకుండా పేద కుటుంబాలకు కడుపు నిండా తిండి పెడుతున్నాం. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు. వాళ్లకెప్పుడు హాస్టళ్లలో సదివే పిల్లలకు సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన రాలేదు. ఈటల రాజేందర్, నేను సన్నగనే ఉంటాం. నేను స్వయంగా హాస్టళ్లనే సదువుకున్నా.. పిల్లలకు సన్న బియ్యం పెడుతామని ఈటల చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వమన్నా. కొన్నిసార్లు నాకు అర్థం కాకపోయినా.. నన్ను సముదాయించి ఇలా మంచి పనులు చేయించే బిడ్డలు టీఆర్ఎస్లో ఉన్నారు. సన్న బియ్యం ఘనత ఈటలదే. గోల్కొండ కోటపై జెండా ఎగరేశాం ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగరేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చారిత్రక వైభవానికి చిహ్నమైన గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరేసినం. గత పాలకులకు ఆ సోయి లేదు. కొమురం భీం విగ్రహం ప్రతిష్ఠించేందుకు వెళితే కాంగ్రెస్ పాలనలో ఆ విగ్రహాలను పోలీస్ స్టేషన్లో పెట్టిన్రు. నేనే స్వయంగా వెళ్లి జోడెఘాట్‌లో కొమురం భీం విగ్రహం పెట్టా. తెలంగాణ గడ్డ గర్వపడే బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పాలకులే గౌరవించలేదు. పీవీని గౌరవించేందుకు అధికారిక ఉత్సవాలు నిర్వహించాం. అన్ని వర్గాలకు అండాదండ! ఇక ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మరోసారి ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఒకటే భరోసా ఇస్తున్నా. ఈ వర్గం, ఆ వర్గం అని లేదు. అందరికీ అండదండగా ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలే అయ్యింది. కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చాం. ముందు ముందు అనేక కార్యక్రమాలు వస్తాయి’ అని స్పష్టంచేశారు. పార్టీ ప్లీనరీని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. లండన్, అమెరికాలోని పార్టీ శాఖల నిర్వాహకులకూ ధన్యవాదాలు చెప్పారు. ‘కార్మిక వర్గానికి అండగా ఉంటాం. సిర్పూర్ పేపర్ మిల్లును మూత పడనీయం. వరంగల్ జిల్లాలోని ఏపీ రేయాన్స్ మూతపడితే డిప్యూటీ సీఎం కడియం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తీసుకువచ్చి కొన్ని రాయితీలు అడిగారు. వెంటనే ఇచ్చాం. ఏ పరిశ్రమనూ మూతపడనీయం. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఓ గేయం.. ఓ పద్యం.. నూతనోత్తేజం ప్లీనరీలో ప్రసంగం సందర్భంగా కేసీఆర్ ఉత్సాహంగా పాట పాడారు. మరో పద్యంతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ‘ఎన్నో కలలు కని తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు నేనే ఒక పాట రాసిన.. మనందరం పాడుకున్నాం’ అంటూ తన ప్రసంగం చివర్లో ఆ గేయంలోని ఓ చరణం అందుకున్నారు. ‘గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.. పచ్చని మాగాణాల్లో పసిడి పంట పండాలె.. సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె.. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె’ అని కేసీఆర్ పాటెత్తుకున్నారు. అదే తీరుగా స్వర్ణయుగంవైపు.. బంగారు తెలంగాణ వైపు.. రాష్ట్రం అడుగులు వేస్తుందని తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మరోసారి టీఆర్ఎస్ కార్యకర్తలను కార్యసాధకులుగా కొనియాడుతూ ఓ పద్యాన్ని వల్లెవేశారు. ‘కొందరిని మండలాల్లో బ్రిగేడియర్‌గా వేస్తే కాలినడకన వెళ్లారు. వెనుకటికో కవి రాశారు.. ఒకచో నేలను బవ్వళించు.. నొకచో నొప్పారు బూసెజ్జపై.. నొకచో శాఖములారగించు.. నొకచో నుత్కృష్టశాల్యోదనం.. అంటే కార్యసాధకులు.. నేల మీద పడుకున్నమా.. పరుపు మీద పడుకున్నమా.. అన్నం తిన్నమా.. గంజి తాగినమా.. అని ఆలోచించకుండా ముం దుకుసాగుతరు’ అని కేసీఆర్ ఉత్తేజపరిచారు. ప్రతీ రైతుకు నష్ట పరిహారం ‘పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా.. మనసు చిన్న చేసుకోకండి. నష్టపోయిన ప్రతీ ఎకరాకు, ప్రతీ రైతుకు సాయం చేస్తాం. కలెక్టర్ల నుంచి నివేదికలు అందగానే సాయమందిస్తాం’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు కొన్ని తీర్మానాలు చేశారని, భవిష్యత్తు కార్యక్రమాలను నిర్ణయించారని పేర్కొన్నారు. మరికొన్ని విషయాలు 27వ తేదీన జరిగే బహిరంగ సభలో చెప్పుకుందామన్నారు. ఆ సభకు పది లక్షల మంది తరలిరానున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఎజెండా తెలంగాణ రాష్ట్రమే బలహీనవర్గాల రాష్ట్రం. వారి సంక్షేమానికే పెద్దపీట వేసినం. 34 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. రూ.480 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినం. ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించినం. రాష్ట్రంలో 32 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. 3.75 లక్షల మంది బీడీ కార్మికులు జీవన భృతి పొందుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్ల వేతనాలను పెంచాం. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, కడుపు నిండా అన్నం, పౌష్టికాహారం అందిస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్‌కు 50 శాతం కోత పెట్టినా రూ.700 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాం. రూ.6,500 కోట్ల భారం పడ్డప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సోదరులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ముస్లిం మైనారిటీలకు రూ.1033 కోట్లు పెట్టాం. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టులకు రూ.10 కోట్లు కేటాయించామని కేసీఆర్ వివరించారు. -
జలదృశ్యం నుంచి జనదృశ్యం వరకు...
-
గులాబీ గుబాళింపు!!
-
24న హైదరాబాద్‌కు కవిత
రాయికల్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించనున్న పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి హాజరు కానున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమెరికాలోని న్యూ జెర్సీ యూనివర్సిటీలో సెమినార్, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఆవిర్భావం వంటి పలు కార్యక్రమాల్లో కవిత బిజీ బిజీగా గడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ప్లీనరీకి ఆమె హాజరుకానున్నారు. -
'టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి'
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున 6 సెట్ల నామినేషన్ దాఖలు కావడంతో టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక లాంఛనమైందని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నాయిని మీడియాతో మాట్లాడారు. 24 సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించనున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకుంటాడని నాయిని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశంలో కేసీఆర్‌దే నిర్ణయమని తెలిపారు. ఆంధ్రా ప్రాంతంవారు కూడా ఈసారి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రాంత ప్రజలతో మాకు ఇబ్బంది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతంగా నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీకి ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈనెల 24న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావుగౌడ్ శుక్రవారం స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్ల పనులను పరిశీలించారు. -
టీఆర్ఎస్ ప్లీనరీపై దృష్టి సారించిన కేసీఆర్
-
టీఆర్ఎస్ ప్లీనరీపై దృష్టి సారించిన కేసీఆర్
హైదరాబాద్: ఈ నెల 24న ఎల్ బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశాన్ని విజయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. పార్టీ, ప్రభుత్వంలో మార్పులపై ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 27న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఫలితాలపై కేసీఆర్ ఈ సందర్బంగా పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. -
కరెంట్ కష్టాలు తీరుస్తాం
మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యులతో భేటీలో సీఎం కేసీఆర్ ఆగస్టు నుంచి మెరుగవనున్న సరఫరా సాగుకు, పరిశ్రమలకు తగిన విద్యుత్ అందిస్తాం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుందాం త్వరలో టీఆర్ఎస్లోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు ఖమ్మం నుంచి ఒకరు, గ్రేటర్ నుంచి ముగ్గురు గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి ఏప్రిల్ 25, 26 తేదీల్లో ప్లీనరీ, 27న పార్టీ ఆవిర్భావ సభ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని మంత్రులకు సీఎం హితబోధ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూనే, టీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆగస్టు నుంచి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలకూ కోతల్లేకుండా సరఫరా చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. భూపాలపల్లి విద్యుత్ ఆగస్టుకల్లా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ నిర్మాణంతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపైనా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు హరీశ్‌రావు, అజ్మీరా చందూలాల్ మినహా మిగిలిన వారంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆరుతడి పంటలే మేలు! ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం విద్యుత్‌ని పంపిణీ చేయకపోవడం వల్లే ఖరీఫ్‌లో కష్టాలు వచ్చాయన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని కేసీఆర్ అన్నట్లు సమాచారం. రబీలోనూ కరెంటు కష్టాలుంటాయని ఆయన అన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాలువలకు నీళ్లు వచ్చే అవకాశం లేనందున ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని రైతాంగానికి సూచించాల్సిందిగా మంత్రులకు చెప్పారు. ఆగస్టు నుంచి రైతులకు, పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ అందుతుందని, ఈ దిశగా ప్రభుత్వం చేసిన కృషి ఫలించనుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం హామీని నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి లేదని అభిప్రాయపడ్డారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సానుకూల స్పందన వస్తోందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ద్వారా టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చాలని మంత్రులకు హితబోధ చేశారు. పార్టీలోకి మరో నలుగురు! ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం తెలిపారు. కొత్తవాళ్ల రాకపై పాత వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడే కొత్త సెగ్మెంట్ల వల్ల అందరికీ అవకాశం వస్తుందన్నారు. ‘త్వరలోనే గ్రేటర్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖమ్మం నుంచి మరో ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నారు. 20 మంది మాజీ కార్పొరేటర్లూ పార్టీలో చేరబోతున్నారు. కంటోన్మెంట్ ఫలితాలను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలి. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్ష జరుపుకోవాలి. నియోజక వర్గానికి 25 వేల మంది సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఏప్రిల్ 5లోగా పూర్తి చేయాలి. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీల ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకోవాలి. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పార్టీ ప్లీనరీని నిర్వహించుకోవాలి. 27న పార్టీ ఆవిర్భావదినం సందర్భంగా భారీ బహిరంగసభ, అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తే భవిష్యత్తులో మనకు తిరుగుండద’ని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావును నియమించాలని నలుగురు మంత్రులు చేసిన సూచనకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన లభిస్తోం దని, టీఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించిందని ఎంపీ కె. కేశవరావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయనున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ ఫలితాల స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపనున్నట్లు నాయిని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గణనీయ ఫలితాలు సాధిస్తుందని మహమూద్ అలీ అన్నారు. గ్రేటర్ మంత్రులు, పార్టీ నేతలతో త్వరలో సమావేశం నిర్వహించున్నట్లు చెప్పారు. 22న సీఎం ఖమ్మం పర్యటన ఈ నెల 22 నుంచి సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఎన్ని రోజుల పర్యటన ఉంటుందనే విషయంలో స్పష్టత లేకపోయినా, పార్టీలో చేరికలు, ప్రజలతో మమేకమై నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. వరంగల్ పర్యటనకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు'
హైదరాబాద్: త్వరలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నారని మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు, పాతవారితో కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలిసింది. కష్టపడేవారికి పదవులు ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం ఏప్రిల్ 25, 26 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ, 27న బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఏప్రిల్ 1లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలనుకుంటున్నట్టు భావిస్తున్నారు. కాగా, వచ్చే వారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించినట్టు తెలిసింది. కరెంట్ కష్టాలను త్వరలో అదిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అధికారుల నియామకం తర్వాతే మిగతా పదవులను భర్తీ చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఏప్రిల్ లో బహిరంగ నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతున్నట్టు సమాచారం. అంతకుముందు అక్టోబరు 18, 19 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలనుకున్నా హుద్ హుద్ తుఫాన్ హెచ్చరికల కారణంగా వాయిదా వేశారు. -
టీఆర్ఎస్ ప్లీనర్ మరోసారి వాయిదా
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ముహుర్తం కుదిరినట్లు లేదు. ప్లీనరీ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. అక్టోబరు 18, 19 తేదీల్లో జరగాల్సిన ప్లీనరీ సమావేశాలను పార్టీ నాయకత్వం వాయిదా వేసింది. ప్లీనరీని ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు కూడా ప్లీనరీ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా దీపావళి తర్వాత ప్లీనరీ జరగనున్నట్లు సమాచారం. ప్లీనరీ తేదీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. -
18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా పడింది. ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలను 18, 19వ తేదీలకు వాయిదా వేసింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వాయిదా పడిన ప్లీనరీ ఈ నెల 18న ఎల్బీస్టేడియంలో , 19న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. తుపాన్ నేపథ్యంలో హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున ప్లీనరీ వాయిదా వేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా దీపావళి తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం. -
పరేడ్ గ్రౌండ్లో అనుమతి ఇవ్వకుంటే...
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఈ నెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. సభావేదికకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఖరారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ సభకు అనుమతి రాకపోతే అంతకుమించిన మైదానంలో సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారుచేస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ప్లీనరీ కోసం ఏడు కమిటీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. -
మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం
హైదరాబాద్: ఈనెల 11, 12న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ, పరేడ్స్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో 4 వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బడ్జెట్ తర్వాత హైదరాబాద్ లోని ఉండనని, ప్రజల మధ్యలోనే ఉంటానని వెల్లడించారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందించకపోతే మళ్లీ ఓట్లు అడగనని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. -
పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి
హైదరాబాద్: పాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. పార్టీ బలోపేతంపైనా దృష్టి పెట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలో పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను సీనియర్ నాయకుడు కె. కేశవరావుకు అప్పగించారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యత కేకే భుజస్కందాలపై పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వలసలను ప్రోత్సహించాలని కూడా కేసీఆర్ యోచినట్టు సమాచారం. ఇక జిల్లాల్లో పార్టీ బలోపేతం బాధ్యతలు మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఆగష్టు 3వ వారంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.