హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని పీసీసీ అధికార ప్రతినిథి బండి సుధాకర్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల్లో లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్లీనరీల మీద..బహిరంగ సభల మీద వున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాల మీద, పునాదులపై అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. వారికి చేయాల్సిన ఆర్థిక సాయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు.